Bamma Bullet Bandi dance: బుద్దిగా కూర్చున్న తాత..‘బుల్లెట్ బండి’పాటకు డ్యాన్స్ ఇరగదీసిన బామ్మ
బుల్లెట్టు బండి పాటకు ఓ బామ్మ తనదైన స్టైల్లో స్టెప్పులతో ఫిదా చేసేస్తున్నారు. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బుల్లెట్ బండి పాటకు బామ్మగారు వేసిన స్టెప్పులు చూస్తే షాక్ అవ్వాల్సిందే.
- nagamani
- Published On : September 9, 2021 / 03:32 PM IST
Bamma Bullet Bandi Dance
Bamma Bullet Bandi dance : ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా వచ్చేత్తా పా’ అనే పాట సోషల్ మీడియాతో షేక్ చేసేస్తోంది. ఎవరి నోట విన్నా ఇదే పాట. చిన్నారుల నుంచి ప్రజా ప్రతినిధుల వరకు ఈ ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా’ అంటున్నారు. ఈ పాటకు ఎవరి స్టైల్లో వాళ్లు స్టెప్పులతో ఇరగదీస్తున్నారు. ఎక్కడ చూసిన డుగ్గు డుగ్గు మని అంటూ స్టెప్పులేస్తున్నారు.
ఈ బుల్లెట్టు బండి పాటకు ఓ బామ్మ తనదైన స్టైల్లో స్టెప్పులతో ఫిదా చేసేస్తున్నారు. ఆకు పచ్చని పట్టుచీర కట్టుకుని..కొప్పులో పువ్వులు ముడుచుకుని తాతగారి ముందు ఓ బామ్మగారు ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా వచ్చేత్తా పా’ అంటూ తెగ స్టెప్పులేస్తున్నారు. పాపం తాతగారు మంచం మీద బుద్ధిగా కూర్చుని ఉంటే ఆయనగారి ముందు అదేనండీ భర్తగారి ముందు బామ్మగారు మాత్రం బుల్లెట్టు బండి అంత స్పీడుగా స్టైల్ గా డ్యాన్స్ వేసేస్తున్నారు.
Read more : Saba Qama Dance : మసీదులో మహిళ డ్యాన్స్ ..అపవిత్రమైంది అంటూ అరెస్ట్ వారెంట్ జారీ
ఈ వీడియోలో.. దాదాపు 60 ఏళ్లకు పైగా వయసున్న ముసలావిడ .. ‘బుల్లెట్ బండి’ సాంగ్‌కి అద్భుతమైన స్టెప్పులేసింది. తన భర్త మంచంపై కూర్చొని చూస్తుండగా.. సరిగ్గా సాంగ్‌లో రిథమ్‌కి తగ్గట్టు ఆమె డాన్స్ చేసింది. అయితే అతను మాత్రం కదలకుండా అలా చూస్తూనే ఉండిపోయాడు. బుద్ధిమంతుడిలాగా. ఇదేంటీ ఈ వయస్సులో నీకు పాటలేంటీ ఈ స్టెప్పులేంటీ..పిల్లలు మనుమలు చూస్తే ఏమనుకుంటారు? అని కూడా అనలేదు. ఈ వయస్సులో భార్య తనముందు అలా డ్యాన్సులేస్తుంటే భలే ఎంజాయ్ చేసినట్లే ఉన్నాడీ పెద్దాయన.
Read more : Viral Video : భగభగ మండుతున్న పొయ్యి..సలసల కాగే నీళ్లలో కూర్చున్న పిల్లాడు..
అయినా సంసారం, పిల్లలు,వారి బాధ్యతలు..వారి పెళ్లిళ్లు, మనుమలు ఇలా ఎంతో కష్టపడి ఉంటారు. ఈ వయస్సులో కూడా బామ్మగారు తనలోని ప్రతిభను చాటుకుంటున్నారు. భలే భలే అనిపిస్తోంది బామ్మగారి చలాకీ డాన్స్ చూస్తుంటే.ఏమాత్రం తడబడకుండా పర్ ఫెక్ట్ గా వేసారు.పైగా మద్య మధ్యలో భర్తగారి దగ్గరకంటా వెళ్లి మరీ స్టెప్పులు వేశారావిడ.
ఈ వీడియో చూసిన నెటిజన్లు.. వావ్ బామ్మా సూపర్ అంటున్నారు. మరికొందరు ‘బామ్మ నువ్వు గ్రేట్’ అని కామెంట్ పెడుతున్నారు. నిజంగానే ఈ బామ్మ సూపరెహె..ఇరగదీసి పడేసింది బుల్లెట్ బండి పాటని.ఈ వీడియోలో డాన్స్ వేసిన బామ్మ ఎర్రటి బార్డర్ ఉన్న ఆకుపచ్చ రంగు పట్టుచీరను మడికచ్చా పోసుకుని కట్టుకున్నారు. తెల్లటి వెండి తీగల్లాంటి జుట్టుని వేసిన ముడిలో చామంతి పూలు, నుదుటిన ఎర్రని బొట్టు,ముక్కుకు రెండు నత్తులు పెట్టుకుని ఉన్న ఆమె నిజంగా వద్ధురాలు వేషం వేసుకున్న లక్ష్మీదేవిలా ఉన్నారు. అచ్చమైన హైందవ స్త్రీల నిండుగా..ముచ్చటగా..ఉన్న ఆమె వేసిన డాన్స్ నిజంగా అద్భుతం అని చెప్పక తప్పదు.
Maamma Garu, adbhutam pic.twitter.com/CGHbA9j3l6
— Damayanthi.MVNL (@Indishout) September 9, 2021
