Saba Qama Dance : మసీదులో మహిళ డ్యాన్స్ ..అపవిత్రమైంది అంటూ అరెస్ట్ వారెంట్ జారీ

మసీదులో డాన్స్ షూట్ లో పాల్గొన్న నటికి కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ముస్లిం సోదరులు పవిత్ర స్థలంలో డాన్స్ వేసిన నటితో పాటు గాయకుడికి కూడా అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

Saba Qama Dance : మసీదులో మహిళ డ్యాన్స్ ..అపవిత్రమైంది అంటూ అరెస్ట్ వారెంట్ జారీ

Arrest Warrants Of 'hindi Medium' Star Saba Qamar

Arrest Warrants Of ‘Hindi Medium’ Star Saba Qamar: ఇస్లాం మతాచారం ప్రకారం మహిళలు మసీదుకు వెళ్లకూడదు. ఇది మొదటినుంచి..ఉందా? లేదా మధ్యలో పలు మార్పుల్లో భాగంగా మహిళలు మసీదులోకి వెళ్లకూడదనే ఆంక్షలు వచ్చాయా? దేవుడు అందరికీ ఒక్కటే కదా..మరి ముస్లిం దేవాలయం అయిన మసీదులోకి మహిళలు ఎందుకు వెళ్లకూడదు? అనే ఎన్నో ప్రశ్నలు. ఇవన్నీ పక్కన పెడితే..ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే మసీదులో ఆచారానికి వ్యతరేకింగా ప్రవర్తించకూడదు. నమాజ్ చేసుకోవటానికి వెళ్లే ముస్లింలు కూడా మసీదులో ఉండగా కనీసం గట్టిగా నవ్వకూడదు.అటువంటిది ఓ మహిళ మసీదులో డ్యాన్స్ వేసిందనే కారణంతో ఆమెకు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన ఘటన పాకిస్థాన్ లో జరిగింది.

పాకిస్థాన్ అంటే ఇస్లామిక్ దేశం. అటువంటి దేశంలో మహిళలు మసీదుకు వెళ్లటమే పాపంగా భావిస్తారు. ఈక్రమంలో పాకిస్తాన్‌ నటి సబా ఖమర్‌ ఓ షూటింగ్ కోసం మసీదులో డాన్స్ వేయటంతో ఆమెపై పాకిస్థాన్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో నటి సబా ఖమర్‌ చిక్కుల్లో పడింది. పవిత్ర స్థలం అయిన మసీదు పవిత్రతకు భంగం కలిగించిందని పాకిస్తాన్‌ కోర్టు ఆమెకు అరెస్టు వారెంట్‌ జారీ చేసింది.

‘హిందీ మీడియం’ స్టార్ సబా ఖమర్‌ లాహోర్‌లోని ఓ పురాతన మసీదులో పాకిస్తానీ సింగర్‌ బిలాల్‌ సయూద్‌తో కలిసి ఓ డ్యాన్స్‌ వీడియోలో నటించింది. దీంతో పాక్ ప్రజల ఆగ్రహానికి గురైంది. మసీదు పవిత్రతకు భంగం కలిగించారంటూ వీరిద్దరిపై పాకిస్తాన్ శిక్షాస్మృతిలోని సెక్షన్ 295 కింద లాహోర్ పోలీసులు గతేడాది ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. దీనికి సంబంధించి విచారణకు హాజరు కావాలని పదే పదే నోటీసులు పంపినా..ఏవో సాకులు చెబుతు వారిద్దరూ హాజరుకాలేదు.దీంతో ఈ కేసును విచారించిన లాహోర్‌ మెజిస్టీరియల్ కోర్టు సభాతో పాటు బిలాల్‌కు బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ను జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను అక్టోబర్‌ 6కు వాయిదా వేసింది.

కాగా..ఈ డ్యాన్స్‌ వీడియోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతున్న క్రమంలో సదరు నటితో పాటు ఆ సింగర్ కు చంపేస్తామనే బెదిరింపులు రావటంతో వారిద్దరు క్షమాపణలు తెలిపారు. దీనిపై నటి సభా మాట్లాడుతూ.. ఆ వీడియోలో కేవలం పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు షూట్ చేశారని..ఈ షూట్ ఇంత వివాదం అవుతుందని అనుకోలేదని..దయచేసి నన్న క్షమించండీ అంటూ తెలిపింది. కాగా హిందీ మీడియం వంటి పలు బాలీవుడ్‌ మూవీస్‌లో నటించిన ఆమె నటనకు మంచి స్పందన వచ్చింది.