Viral Video : భగభగ మండుతున్న పొయ్యి..సలసల కాగే నీళ్లలో కూర్చున్న పిల్లాడు..

భగభగా మండుతున్న పొయ్యి. దానిమీ ఓ బాండీ..ఆ బాండీలో నీళ్లు సలసలా మరుగుతున్నాయి. ఈ నీటిలో ఓ పిల్లాడు కూర్చున్నాడు. కింద మంట మండుతునే ఉంది.

Viral Video : భగభగ మండుతున్న పొయ్యి..సలసల కాగే నీళ్లలో కూర్చున్న పిల్లాడు..

Boy Sitting Boiling Water

boy sitting in boiling water : వేడి వేడి నీటిలో చేయి పెడితే చాలా అమ్మో అంటాం. కాస్త సెగ తగిలితే బాబోయ్ అంటాం. కానీ ఓ పిల్లాడు ఏకంగా సలసలాకాగే నిటిలో చక్కగా కూర్చున్నాడు. ధాన్యం చేస్తున్నట్లుగా తాపీగా కూర్చున్నాడు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ పిల్లాడు అలా ఎలా కూర్చున్నాడు బాబూ అంటున్నారు ఈ వీడియో చూసినవారంతా..దీంట్లో ఏమన్నా కిటుకు ఉందా అంటున్నారు.

అది భగభగా మండుతున్న కట్టెలు పొయ్యి. దానిమీద ఓ పెద్ద బాండీ. బాండీ నిండా పూలు పోసారు.ఆ బాండీలో నీరు పోసారు. దాంట్లో ఓ పిల్లాడు కూర్చున్నాడు. బాలుడు ఓ కడాయిలో కూర్చొని ఉండగా కింద మంట పెట్టారు. ఆ కడాయిలో నీరు సలసలా మరుగుతోంది. కానీ ఈ నీటిలో కూర్చున్న పిల్లాడు మాత్రం తాపీగా ధ్యానముద్రలో ఉన్న స్వామీజీలా ఏమాత్రం చలించకుండా కూర్చున్నాడు.

Read more : Bamma Bullet Bandi dance: బుద్దిగా కూర్చున్న తాత..‘బుల్లెట్ బండి’పాటకు డ్యాన్స్ ఇరగదీసిన బామ్మ

అలా పిల్లాడు ఏమాత్రం చలించకుండా కూర్చున్న ఈ పిల్లాడిని ఏదో మహత్తు చూసినట్లుగా ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు అక్కడున్నవారంతా. ఈ వీడియో పాతదే అయినా ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాను మరోసారి షేక్ చేస్తోంది. ఈ వీడియోకు లక్షల్లో లైకులు, కామెంట్లు వస్తున్నాయి. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. ఫేక్ అని కొంతమంది అంటుంటే..మరికొందరు ఇదొక మ్యాజిక్ ట్రిక్.. జనాలను బుడ్డోడు మోసం చేస్తున్నాడని కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా..అది ట్రిక్కో..ఫేక్కో గానీ.. ఈ వీడియా మాత్రం మరోసారి వైరల్‌గా మారింది. ఒక వినియోగదారు ట్విట్టర్‌లో షేర్ చేసారు. దీన్ని షేర్ చేస్తూ, యూజర్ ఇది 2021 భారతదేశం అని రాశారు.