Thyroid Problems : థైరాయడ్ సమస్యతో బాధపడుతున్నవారు తీసుకునే ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు !

బంగాళదుంపలు, రొట్టె, బియ్యం లేదా పాస్తా వంటి అధిక ఫైబర్ పిండి పదార్ధాలతో కూడిన భోజనం, పాలు పాల ఉత్పత్తులు, బీన్స్, పప్పులు, చేపలు, గుడ్లు, మాంసం మరియు ఇతర ప్రోటీన్లను తీసుకోవాలి. పుష్కలంగా ద్రవాలు తీసుకోవాలి.

Thyroid Problems : థైరాయిడ్ అనేది ఒక దీర్ఘ కాలిక సమస్య. మనిషి శరీరంలో మెడ భాగంలో లోపల సీతాకోకచిలుక ఆకారంలో ఉండి హార్మోన్ లను ఉత్పత్తి చేస్తుంది. గొంతు ముందు భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథి నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్ తగ్గితే హైపో థైరాయిడ్ సమస్య తీవ్రతరమైతే దానిని హైపర్ థైరాయిడ్ అని పిలుస్తున్నారు. మగవారిలో కన్నా, ఆడవారిలో ఈ సమస్య అధికంగా ఉంటుంది. శరీరంలో వివిధ రకాల అవయవాలపై థైరాయిడ్ ప్రభావం ఉంటుంది. కాబట్టి దీని విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి.

READ ALSO : Anti Aging Foods : వృద్ధాప్య ప్రభావం మీ మెదడుపై పడకుండా ఆరోగ్యంగా ఉంచడానికి 5 ఆహారాలు !

ఈ సమస్య ఉత్పన్నం అయిన సందర్భంలో నీరసం, మలబద్ధకం, చర్మం, వెంట్రుకలు పొడిబారడం, ఎక్కువ నిద్ర, బరువు పెరగడం, నెలసరిలో రక్తస్రావం ఎక్కువగా లేక తక్కువగా అవ్వడం, గర్భస్రావం, చలిని తట్టుకోలేక పోవడం, గుండె తక్కువ సార్లు కొట్టుకోవడం, జుట్టు రాలడం, థైరాయిడ్ గ్రంథి వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటే థైరాయిడ్ గ్రంథిలో తలెత్తే సమస్యను తగ్గించుకోవచ్చని నిపుణుుల సూచిస్తున్నారు. ఈ సమస్య నుంచి బటయపడేందుకు ఎలాంటి ఆహార పదార్ధాలు తీసుకోవాలో, ఏవి తీసుకోకూడదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

తీసుకోవాల్సిన ఆహారాలు ;

ప్రతిరోజు వివిధ రకాల పండ్లు , కూరగాయలను తీసుకోవాలి. బంగాళదుంపలు, రొట్టె, బియ్యం లేదా పాస్తా వంటి అధిక ఫైబర్ పిండి పదార్ధాలతో కూడిన భోజనం, పాలు పాల ఉత్పత్తులు, బీన్స్, పప్పులు, చేపలు, గుడ్లు, మాంసం మరియు ఇతర ప్రోటీన్లను తీసుకోవాలి. పుష్కలంగా ద్రవాలు తీసుకోవాలి. గ్లూటెన్-ఫ్రీ ఆహారాలు, ఆటో ఇమ్యూన్ ఎలిమినేషన్ ఆహారాలు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఆహారాలు థైరాయిడిటిస్‌తో బాధపడుతున్న వారికి సహాయపడతాయని నిపుణులు సూచిస్తున్నారు.

READ ALSO : Heart Health : రోజుకు 11 నిమిషాలు నడిస్తే చాలు.. గుండె ఆరోగ్యం భేష్

థైరాయిడ్ గ్రంధి లోపాన్ని సరిదిద్దటంలో, హార్మోన్ ఉత్పత్తిలో కొన్నిఆహారాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. యాపిల్‌లో ఉండే పేక్టిన్ అనే ఫైబర్ థైరాయిడ్ హార్మోన్‌ను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. రోజూ యాపిల్ తినడం వల్ల థైరాయిడ్ సమస్యనుండి ఉపశమనం పొందవచ్చు. బ్రౌన్ రైస్ ను ఆహారంగా తీసుకోవాలి. ఇందులో ఆరోగ్యానికి అవసరమైన సెలేనియం, జింక్, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. అలాగే డ్రై ఫ్రూట్స్ వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది. బాదం, వాల్ నట్స్, బ్రెజిల్ నట్స్ వంటివి వాటిని రోజువారిగా పోషకాహార నిపుణులు సూచించిన మొత్తాల్లో తీసుకోవటం థైరాయిడ్ సమస్యనుండి బయటపడేలా చేస్తుంది. నెయ్యి, వెన్నని తగినంతగా తీసుకోవడం వల్ల హార్మోన్ ఉత్పత్తిలో హెచ్చుతగ్గులను సరిచేయవచ్చు.

తినకూడని ఆహారాలు ;

కాలిఫ్లవర్, బ్రోకలి, అరటి వంటి క్రూసిఫెరోస్ కూరగాయలకు థైరాయిడ్ రోగులు దూరంగా ఉండాలి. క్యాబేజీ, కాలీఫ్లవర్, సోయ, పాలకూరలో గోయిట్రోజెన్‌ ఉంటుంది. ఇది గోయిట్రోజెన్‌ థైరాయిడ్‌ సమస్యను పెంచుతుంది. థైరాయిడ్‌ పేషెంట్స్‌ సమస్యను మరింత పెంచే ఈ కూరగాయలకు దూరంగా ఉండటం మంచిది. అలాగే కాఫీ, టీ, సోడా, చాక్లెట్ లాంటి ఆహారాల్లో కెఫీన్ ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల ఆందోళన, భయము, నిద్రలేమి, చిరాకు, అధిక హృదయ స్పందన రేటు పెరుగుతుంది. దూమపానం, మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండాలి.

READ ALSO : Drinking Alcohol : ఖాళీ కడుపుతో మద్యం సేవిస్తున్నారా ? అయితే మీ ఆరోగ్యం మరింత డేంజర్ లో పడ్డట్టే !

గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమాచారం సేకిరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. వివిధ ఆరోగ్య సమస్యలున్న వారు వైద్యులను సంప్రదించి తగిన సూచనలు, సలహాలు పొందటం మంచిది.

ట్రెండింగ్ వార్తలు