Precautions During Summer : వేసవి కాలంలో గర్భిణీలు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించటం మంచిది !

ఇది శరీరాన్ని చల్లబరిచేందుకు ఒక గొప్ప మార్గం. స్విమ్మింగ్ ఫూల్ అందుబాటులో ఉంటే దానిని తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి. ఉదయం లేదా సాయంత్రం ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పుడు సాధారణ వ్యాయామం తప్పనిసరిగా చేయాలి.

Precautions During Summer : వేసవి కాలం, వేడి గాలులు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తాయి. ముఖ్యంగా వేసవిలో, దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి, ఇది గర్భిణీ స్త్రీలకు కొంత అసౌకర్యాన్ని కలిగిస్తుంది. గర్భవతిగా ఉన్నప్పుడు, శిశువుకు అనుగుణంగా ఆమె శరీరం ప్రత్యేకమైన మార్పులకు గురవుతుంది. గర్భిణీలపై పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పరిస్థితులు తీవ్రమైన ప్రభావాన్నే చూపుతాయి. కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ సమస్యలను సులభంగా అధిగమించవచ్చు.

1. హైడ్రేషన్: రోజుకు కనీసం 3 లీటర్ల నీరు త్రాగాలి. తక్కువ లేదా చక్కెర లేకుండా లేత కొబ్బరి మరియు తాజా పండ్ల రసాలను తీసుకోవాలి. తగినంత హైడ్రేషన్ హీట్ స్ట్రోక్‌కు దారితీసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తగినంత నీటిని శరీరానికి అందించాలి.

2. ఆహారం: ఆహారంలో పుష్కలంగా కూరగాయలు, ఆకుకూరలు, మొలకెత్తిన సలాడ్లు, పండ్లు చేర్చుకోవాలి. పెరుగు మరియు మజ్జిగ ముఖ్యంగా శరీరాన్ని చల్లబరుస్తాయి. ఆహార తయారీలో అధిక నూనె, నెయ్యి, మసాలాలను నివారించండి. ఉప్పు తీసుకోవడం తగ్గించండి.

READ ALSO : Fridge Water : వేసవి కాలంలో ఫ్రిజ్ వాటర్ తో దాహం తీర్చుకుంటున్నారా! అయితే జాగ్రత్త?

3. స్విమ్మింగ్/వ్యాయామం: ఇది శరీరాన్ని చల్లబరిచేందుకు ఒక గొప్ప మార్గం. స్విమ్మింగ్ ఫూల్ అందుబాటులో ఉంటే దానిని తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి. ఉదయం లేదా సాయంత్రం ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పుడు సాధారణ వ్యాయామం తప్పనిసరిగా చేయాలి.

4. పాదాలను ఎత్తులో ఉంచటం: పాదాలను దిండ్లు లేదంటే కుషన్‌లపై ఉంచడం ద్వారా వాటిని ఎత్తులో ఉంచుకోవాలి. ఇలా చేయటం వల్ల పాదాలు మరియు కాళ్లలో నీరు నిలుపుదల తగ్గుతుంది.

5. దుస్తులు, పాదరక్షలు: తెలుపు లేదా పాస్టెల్ షేడ్స్‌లో వదులుగా ఉండే కాటన్ దుస్తులను ధరించాలి. వాపుకు అనుగుణంగా సౌకర్యవంతమైన పాదరక్షలను ధరించండి.

6. సన్ గ్లాసెస్/సన్‌స్క్రీన్/గొడుగు: మంచి సన్‌గ్లాసెస్‌ ను వేసవి కాలం ధరించాలి. ఎక్కువ సమయం బయటికి వచ్చినప్పుడల్లా సన్‌స్క్రీన్ ఉపయోగించాలి. బయటకు వెళ్ళే సందర్భంలో ఎండ నుండి రక్షణకోసం గొడుగును తీసుకెళ్లండి లేకుంటే టోపీని ధరించండి.

READ ALSO : Sapota Fruits : వేసవి కాలంలో రోజుకు రెండు సపోటా పండ్లు తింటే చాలు…మంచి ఆరోగ్యం మీ సొంతం!

7. నిద్ర: మధ్యాహ్నం కనీసం 30 నిమిషాలు నిద్రించడానికి ప్రయత్నించండి. అధిక వేడి ఉన్న సందర్భంలో బయటకు వెళ్ళకుండా నిద్రించటం వల్ల శరీరం కొంత చల్లబడుతుంది.

అధిక శారీరిక శ్రమచేసేవారిలో లేదా ఎక్కువ గంటలు ఎండకు బహిర్గతం అయ్యే వ్యక్తులలో మరియు కొన్ని రకముల ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలో కూడా వేసవి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. నిర్జలీకరణం, వడదెబ్బ యొక్క ఏవైనా లక్షణాలను ఎదుర్కొంటున్నట్లయితే, దయచేసి వైద్య నిపుణులను సంప్రదించండి.

 

ట్రెండింగ్ వార్తలు