Weight Loss : ఎండుద్రాక్ష, బెల్లం కలిపి తింటే.. ఇట్టే బరువు తగ్గొచ్చు..!

Weight Loss : బరువు తగ్గేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఉదయం లేచిన దగ్గర్నుంచి గంటల కొద్ది వ్యాయామాలు చేసేస్తుంటారు. కడుపు మార్చుకుని తెగ డైటింగ్ చేసేస్తుంటారు.

Weight Loss : బరువు తగ్గేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఉదయం లేచిన దగ్గర్నుంచి గంటల కొద్ది వ్యాయామాలు చేసేస్తుంటారు. కడుపు మార్చుకుని తెగ డైటింగ్ చేసేస్తుంటారు. అయినా బరువు తగ్గడం లేదని తెగ బాధపడి పోతుంటారు. వాస్తవానికి బరువు తగ్గాలంటే కష్టమైన కసరత్తులు చేయాల్సిన పనిలేదు. సింపుల్‌గా ఈ రెండింటిని మీ డైలీ డైట్ లో చేర్చుకుంటే చాలు.. కొద్దిరోజుల్లోనే వేగంగా బరువు తగ్గిపోవచ్చు. అవేంటో తెలుసా? ఎండు ద్రాక్ష.. రెండోది బెల్లం.. ఈ రెండింటిని కలిపి తీసుకోవాలి. అప్పుడు మీ శరీరంలోని కొవ్వు క్రమంగా కరిగిపోతుంది. ఫలితంగా అతికొద్ది రోజుల్లోనే బరువు తగ్గిపోతారు. ఇంతకీ ఈ రెండింటిని కలిపి ఎలా తీసుకోవాలి? ఏయే టిప్స్ పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

గోరు వెచ్చని నీటిని తీసుకోండి. అందులో 4 నుంచి 5 వరకు ఎండుద్రాక్షలను రాత్రిసమయంలో నానబెట్టుకోవాలి. ఉదయం లేచిన తర్వాత ఏమి తినకుండా పరిగడుపున కొంత బెల్లం తీసుకోవాలి. ఇక ఎండు ద్రాక్ష నానబెట్టిన నీళ్లను ఒక గ్లాసులో తీసుకోవాలి. ఇప్పుడా నీటికి కొంత బెల్లం కలపాలి. ప్రతిరోజూ ఇలా చేయడం ద్వారా మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఫలితంగా కేలరీలు కరిగిపోతాయి. బరువు కూడా వెంటనే తగ్గిపోతారు.

లేదంటే.. మరో టిప్ ట్రై చేయండి..
మీరు ఉదయాన్ని లేవగానే పెరుగులో 4 నుంచి 5 వరకు ఎండు ద్రాక్షలను కలిపి తీసుకోండి. భోజనం తర్వాత మాత్రమే ఆ పెరుగు తీసుకోవాలి. అలా చేయడం ద్వారా మీ పొట్టలోని పేగుల్లో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఎండుద్రాక్ష, బెల్లంలో ఏయే పోషక విలువలు ఉంటాయో తెలుసా.. వీటిని సూపర్ ఫుడ్స్ గా చెప్పవచ్చు. బ్రడ్ ప్రెజర్ సమస్యను వెంటనే తగ్గించగలవు. అంతేకాదు.. ఊపిరితిత్తులను కూడా శుభ్రం చేయగలవు. ఎముకలను బలోపేతం చేయగలవు. జీవక్రియను కూడా మెరుగుపర్చగలవు. మెగ్నిషియం, పొటాషియం, కాల్షియం, సెలీనియం, మాంగనీస్, ఐరన్, జింక్ వంటి ఎన్నో పోషక విలువలు లభిస్తాయి.

Raisin With Jaggery Water How The Combination Can Help You Lose Weight 

ఎండుద్రాక్షలో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి.. ఇవి నిత్యం మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా కడుపు నిండిన భావన కలుగుతుంది. దాంతో పెద్దగా ఆకలి వేయదు. ఇందులోని ఐరన్, కాల్షియం, పొటాషియం ఉండటం వల్ల జీవక్రియ చురుగ్గా పనిచేస్తుంది. లావు తగ్గి సన్నబడిపోతారు. షుగర్ పేషెంట్లు, ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఈ రెండింటిని తీసుకునే ముందు వైద్యున్ని సంప్రదించడం మంచిది. ఏది తిన్నా మితంగా తినాలని గుర్తించుకోండి. ఏది అతిగా చేసినా మంచి ఫలితాలు కంటే చెడు ఫలితాలే అధికంగా ఉంటాయి. అవసరమైన మేరకే తీసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు.

Read Also : Eating Eggs : అల్పాహారంగా గుడ్లు తీసుకుంటే బరువు తగ్గొచ్చు తెలుసా? 

ట్రెండింగ్ వార్తలు