Sleepwalking : నిద్రలో నడిచే అలవాటు ప్రమాదకరమా?

కొందరిలో నిద్రలో నడిచే అలవాటు ఉంటుంది. సాధారణంగా చిన్న వయసులో ఉండే ఈ అలవాటు యుక్త వయసు రాగానే పోతుంది. అయినా ఈ అలవాటు వేధిస్తుంటే వైద్యులని సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.

Sleepwalking

Sleepwalking : కొందరు మంచం మీద పడుకుంటారు. మేల్కొనేసరికి సోఫాలో ఉంటారు. అదేంటి నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని ఆలోచిస్తారు? ఇదే నిద్రలో నడిచే అలవాటు. పిల్లల్లో నిద్రలో నడిచే అలవాటు ఉన్నప్పటికీ దాదాపుగా 1.5 శాతం మంది పెద్దవారిలో ఎక్కువగా నిద్రలో నడిచే అలవాటు ఉందట.

Symptoms of diabetes : మధుమేహం ఉన్నవారిలో ఉదయం నిద్రలేచిన వెంటనే కనిపించే లక్షణాలు, సంకేతాలు !

‘స్లీప్ వాకింగ్’ లేదా ‘సోమ్నాంబులిజం’ అనేది నిద్రను డిస్ట్రబ్ చేసే మందులు, జన్యుపరమైన లేదా ఆరోగ్య పరిస్థితుల వల్ల సంభవిస్తుందట. నిద్రలోకి జారుకున్న 1 నుంచి 2 గంటల లోపు ఇలా చేస్తారట. ఈ అలవాటు ఉన్నవారు నిద్రలో కూర్చుంటారు, నడుస్తారు.. లేదా నార్మల్ పనులు కూడా చేసేస్తారు. ఆ సమయంలో వారి కళ్లు తెరిచే ఉంటాయి. కానీ వారు చాలా గాఢ నిద్రలో ఉంటారట.

 

స్లీప్ క్లినిక్‌లో 193 మందిపై జరిపిన అధ్యయనం ప్రకారం పగటి పూట అనుభవించిన ఒత్తిడి ఏదైతే ఉంటుందో అని స్లీప్ వాకింగ్‌కి దారి తీస్తుందట. తగిన నిద్ర లేకపోయినా కూడా స్లీప్ వాకింగ్‌కు గురవుతారట. స్లీప్ వాకింగ్ హిస్టరీ ఉన్న వ్యక్తుల మెదడు MRI ద్వారా చేసిన పరిశోధనల ప్రకారం నిద్రలేమి వల్లే ప్రజలు ఎక్కువగా స్లీప్ వాకింగ్ బారిన పడుతున్నారని కనుగొన్నారట. ఇక చాలా కాలంగా మైగ్రేన్ ఉన్న వారు కూడా నిద్రలో నడుస్తారట. పిల్లల్లో స్లీప్ వాకింగ్ అనేది జ్వరానికి కారణమయ్యే అనారోగ్యాలతో లింక్ అయి ఉంటుందట. గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వ్యక్తులు కూడా స్లీప్ వాకింగ్‌తో సహా అనేక నిద్రకు సంబంధించిన రుగ్మతలకు గురయ్యే అవకాశం ఉంది.

Vietnam : 1962 నుంచి అతను నిద్రపోలేదు.. డాక్టర్లు ఏం చెప్పారంటే?

నిద్రలో నడిచే అలవాటు ఉన్నవారు ఆహారం తింటారు.. మాట్లాడతారు..ఇల్లు వదిలి బయటకు కూడా వెళ్లడానికి ప్రయత్నిస్తారు.. చాలా సమయాల్లో నిద్ర లేచిన తరువాత వారికి జరిగింది గుర్తురాదు. ఆ సమయంలో ఎవరైనా నిద్ర లేపితే ఏం జరిగిందో తెలియక ఆందోళన పడతారు. స్లీప్ వాకింగ్ అనేది చాలా ప్రమాదకరం. ఒక్కోసారి వారు డ్రైవ్ చేయడం లేదా ఇతర పనులు నిర్వహించడానికి ప్రయత్నిస్తే ప్రమాదాలు జరుగుతాయి. స్లీప్ వాకింగ్‌లో ఉన్న వారు ఇతరులకు హాని కలిగించే అవకాశం ఉన్నందున వారిని మేల్కొపడం మంచిది. అదీ సున్నితంగా చేయాలి. దీని నుంచి బయటపడాలంటే సాధారణ వ్యాయమం చేయడం, కెఫిన్ పరిమితం చేయడం, శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేయడం, యోగా చేయడం మంచిదట.

 

చాలామంది పిల్లలు యుక్త వయసుకి రాగానే ఈ సమస్య నుంచి చికిత్స అవసరం లేకుండా బయటపడతారు. అయినా ఈ సమస్యతో బాధపడుతుంటే వైద్యుడిని సంప్రదించాలి. స్లీప్ వాకింగ్‌ని ప్రత్యక్షంగా చూసినప్పుడు నిర్ధారణ  చేయడం అనేది సరైన మార్గం. జీవితంలో ఒత్తిడిని తగ్గించుకుని నిద్ర అలవాట్లు మెరుగుపరుచుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చును.  దీనివల్ల తరచూ సమస్యలు ఎదురవుతుంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

CPAP for sleep apnea : నిద్రలో ఊపిరాడక సీపాప్ మెషీన్ వాడుతున్న జో బైడెన్.. ఇంతకీ అదెలా పనిచేస్తుందంటే?

ట్రెండింగ్ వార్తలు