Symptoms of diabetes : మధుమేహం ఉన్నవారిలో ఉదయం నిద్రలేచిన వెంటనే కనిపించే లక్షణాలు, సంకేతాలు !

రోగలక్షణాలు రోజంతా ఉంటాయి. ఉదాహరణకు ఉదయం సమయంలో ప్రత్యేకంగా చెప్పాలనుకుంటే తరచు మూత్రం విసర్జన సమస్య, నోరు పొడిబారిపోవటం, అలసటగా అనిపించటం, దాహంగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలా మందిలో ఈ లక్షణాలు ఉదయమే కాకుండా పగలు, రాత్రి అన్ని సందర్భాల్లోను ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

Symptoms of diabetes : మధుమేహం ఉన్నవారిలో ఉదయం నిద్రలేచిన వెంటనే  కనిపించే లక్షణాలు, సంకేతాలు !

symptoms of diabetes

Symptoms of diabetes : ఇన్సులిన్ అనేది శరీరంలో ముఖ్యమైన హార్మోన్. ఇది ప్యాంక్రియాస్ లోపల బీటా కణాలలో ఉత్పత్తి అవుతుంది. శరీర అవసరాలకోసం, మనం తినే ఆహారం ద్వారా సహజంగా లభించే రక్తంలో గ్లూకోజ్ నిల్వ చేయటానికి ఇది సహాయపడుతుంది. మన కాలేయం రక్తంలో చక్కెరను విడుదల చేయడం వల్ల అదిశక్తిగా మారి మన శరీరాన్ని రోజువారి పనిచేయటం కోసం సిద్ధం చేయడానికి , మరింత చురుకుగా చేయడానికి తోడ్పడుతుంది.

READ ALSO : Symptoms Of Glucose Spikes : మధుమేహం ఉన్నవారిలో గ్లూకోజ్ హెచ్చుతగ్గుల సమయంలో కనిపించే లక్షణాలు !

మధుమేహం ఉన్నవారు ఉదయాన్నే అధిక గ్లూకోజ్ స్థాయిలను కలిగి ఉంటారు. నోరు, గొంతు పొడిబారడం, రాత్రంతా తరచుగా మూత్ర విసర్జన చేయటం, అస్పష్టమైన దృష్టి, బలహీనత, ఆకలితో నిద్ర భంగం కలగటం వంటివి చవిచూస్తారు.

మధుమేహం ఉన్నట్లు నిర్ధారణకు ముందే చాలా మందిలో అలసట, మగత, అస్పష్టమైన దృష్టి, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, వంటి కొద్దిపాటి లక్షణాలను కలిగి ఉంటారు. ఇలాంటి శరీరంలోని అన్ని మార్పులపై శ్రద్ధ పెట్టటం మంచిది. లేకుంటే వ్యాధి తీవ్రమవుతుంది. శరీర పనితీరును మరింత దెబ్బతీసే ముందు పరీక్ష చేయించుకోవటం మంచిది.

READ ALSO : Sugar Cause Diabetes : షుగర్ ఎక్కువగా తింటే మధుమేహం వస్తుందా? ఇందులోని వాస్తవమెంత ?

ఉదయం మధుమేహం యొక్క లక్షణాలు ;

రోగలక్షణాలు రోజంతా ఉంటాయి. ఉదాహరణకు ఉదయం సమయంలో ప్రత్యేకంగా చెప్పాలనుకుంటే తరచు మూత్రం విసర్జన సమస్య, నోరు పొడిబారిపోవటం, అలసటగా అనిపించటం, దాహంగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలా మందిలో ఈ లక్షణాలు ఉదయమే కాకుండా పగలు, రాత్రి అన్ని సందర్భాల్లోను ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా బరువు తగ్గటం, దెబ్బలు తగిలితే మానకపోవటం, చర్మ సంబంధిత సమస్యలు ఇవన్నీ కూడా ఉంటాయి.

READ ALSO : Prevent Diabetes : మధుమేహం ఎలా నివారించాలి ? ప్రారంభ దశలో ఉంటే ఏంచేయాలి ?

మధుమేహం యొక్క ఇతర లక్షణాలు ;

విపరీతమైన ఆకలిగా అనిపించడం, ఊహించని విధంగా బరువు తగ్గడం, చేతులు, కాళ్లు తిమ్మిర్లు, అస్పష్టమైన దృష్టి, అలసట, బలహీనత, పొడి చర్మం, గాయాలు నెమ్మదిగా నయం కావటం, విపరీతమైన దాహం, ముఖ్యంగా రాత్రిపూట ఎక్కువసార్లు మూత్రవిసర్జన, ఎక్కువ ఇన్ఫెక్షన్లు, జుట్టు రాలడం టైప్ 2 డయాబెటిస్‌లో సాధారణం. టైప్ 1 డయాబెటిస్‌లో, వికారం, కడుపు నొప్పి, వాంతులు మొదలైన వాటితో బాధపడాల్సి వస్తుంది.

READ ALSO : Diabetes Affects The Skin : మధుమేహం చర్మంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా? ఈ లక్షణాల కనిపిస్తే జాగ్రత్త పడటం మంచిది..

మధుమేహం దీర్ఘకాలిక సమస్య ;

మధుమేహం అనేది దీర్ఘకాలిక ఆరోగ్యసమస్య. ఒక రకమైన జీవక్రియ రుగ్మత, ఇక్కడ శరీరం తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయదు. సరిగ్గా ఉపయోగించలేని ఫలితంగా, అదనపు రక్తంలో చక్కెర స్థాయిలు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. దీని ప్రభావం మూత్రపిండాలు, చర్మం, గుండె, కళ్ళు తోపాటుగా మొత్తం ఆరోగ్యంపై పడుతుంది. మధుమేహం ఏ వయస్సులోనైనా రావచ్చు.

READ ALSO : Diabetes : మధుమేహంతో బాధపడుతున్నవారు వేసవి ఉష్ణోగ్రతల వల్ల ఎదురయ్యే సమస్యలను నివారించడానికి పాటించాల్సిన చిట్కాలు !

అయితే పిల్లలు, యుక్తవయస్కులు, యువకులు టైప్ 1 డయాబెటిస్‌తో ఎక్కువగా ప్రభావితమవుతారు. అయితే టైప్ 2 మధుమేహం 40 ఏళ్ల తర్వాత పెద్దవారిలో ఎక్కువగా కనిపిస్తుంది.
ఇటీవలి దశాబ్దాల్లో మధుమేహం కేసులు విపరీతంగా పెరిగాయి. ఇది పెద్ద ప్రమాదం. గుండె మరియు మూత్రపిండాల వ్యాధులకు కారకం.