Vietnam : 1962 నుంచి అతను నిద్రపోలేదు.. డాక్టర్లు ఏం చెప్పారంటే?

నిద్ర లేకపోతే మనిషి శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుంది. ఒక పూట నిద్ర లేకపోతే మనం ఏ పనీ సరిగా చేయలేం. అలాంటిది ఒక వృద్ధుడికి 60 ఏళ్లుగా కంటి మీద కునుకు లేదు. అయినా అతను ఆరోగ్యంగా ఉన్నాడు. అలా ఎలా?

Vietnam : 1962 నుంచి అతను నిద్రపోలేదు.. డాక్టర్లు ఏం చెప్పారంటే?

Vietnam

Vietnam : ఒక రోజు సరిగా నిద్ర లేకపోతేనే చాలా అలసిపోతాం. తరువాత రోజు ఏ పని మీద సరిగా దృష్టి పెట్టలేం.. కానీ ఓ పెద్దాయన 1962 నుంచి అసలు నిద్రపోలేదట. వామ్మో.. అలా ఎలా ఉండగలిగాడు? అతని సమస్య ఏంటి? ఇలాంటి బోలెడు డౌట్స్ వస్తాయి మనకి.

Day time sleep : పగటి పూట నిద్ర మెదడుకి మంచిదట.. పరిశోధకులు ఏమన్నారంటే..

థాయ్ ఎన్‌గోక్ అనే 80 ఏళ్ల వృద్ధుడికి 1962 లో జ్వరం వచ్చిందట. ఆ తరువాత నుంచి అతను నిద్రపోలేదట. అందరిలాగా నిద్రపోయి కాసేపు విశ్రాంతి తీసుకోవాలని అతనికి ఉంటుందట. కానీ నిద్ర రాదట. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదా.. ఇది నిజమా? అబద్ధమా? అని కూడా డౌట్ వస్తుంది కదా. అతని భార్య, పిల్లలు, స్నేహితులు, ఇరుగు పొరుగువారు కూడా అతను నిద్రపోవడం ఎప్పుడూ చూడలేదని స్పష్టం చేస్తున్నారు. చాలామంది అతనిని కావాలని పరీక్షించారట కూడా..  ఎవరూ ఇది అబద్ధం అని చెప్పలేకపోయారట.

Eating Dinner Early : రాత్రి భోజనం త్వరగా ముగించటం వల్ల బరువు తగ్గటం, నిద్రబాగా పట్టటంతోపాటు అనేక ప్రయోజనాలు !

నిద్ర లేకపోతే శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుంది. అయితే థాయ్ ఎన్‌గోక్ కి అలాంటి పరిస్థితులు ఏమీ ఎదురవ్వలేదట. ఎప్పుడూ మంచి ఆహారం తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటాడట. ఎక్కువగా అతను గ్రీన్ టీ, వైన్ తాగడానికి ఇష్టపడతాడట. ఇక ఇతగాడిని చాలామంది ఇంటర్వ్యూలు చేసారు. డ్రూ బిన్స్కీ అనే యూట్యూబర్ కూడా వియత్నాంలో థాయ్ ఎన్‌గోక్‌ని వెతికి పట్టుకుని మరీ అతడిని ఇంటర్వ్యూ చేశాడు. ఈ ఇంటర్వ్యూ చూసిన వారు ‘చిన్నప్పుడు అతని గురించి చదివిన గుర్తు.. ఇంకా అతను నిద్రపోకుండా ఆరోగ్యంగా ఉండటం ఆనందంగా ఉంది’ అంటూ కామెంట్లు పెట్టారు. థాయ్ ఎన్‌గోక్ ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి కారణం డాక్టర్లు కూడా కనిపెట్టలేకపోయారట. ఏది ఏమైనా అతను ఇన్ని సంవత్సరాలు నిద్ర లేకపోయినా ఆరోగ్యంగా ఉండటం నిజంగా వండర్ అని చెప్పాలి.