Bless You : తుమ్మితే ‘గాడ్ బ్లెస్ యూ’ అంటారెందుకు?

ఏదైనా పని మీద వెళ్తుంటే ఎవరైనా తుమ్మగానే తిట్టుకుంటారు. అందరి మధ్యలో తుమ్ము వస్తే తిట్టుకుంటారేమో అని కొందరు ఆపుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తారు. ఇదంతా సరే.. తుమ్మగానే ఆశీర్వదిస్తారు. ఇది ఎందుకు? మీకెప్పుడైనా డౌట్ వచ్చిందా?

Bless You

Bless You : ఏదైనా పని మీద బయటకు వెళ్తుంటే ఎవరైనా తుమ్మితే తిట్టుకుంటారు. ఇక పని అయినట్లే అని పెదవి విరుస్తారు. మంచి విషయాల్లో తుమ్మితే సంతోషపడతారు. సమాజంలో ఇలాంటి నమ్మకాలు అనేకం ఉన్నాయి. కొన్ని మంచిగానే అనిపించినా కొన్ని విపరీతంగా అనిపిస్తాయి. అయితే ఎవరైనా తుమ్మగానే ‘చిరంజీవ’.. అని ‘బ్లెస్ యూ’ అని విష్ చేస్తారు. ఎందుకలా? మీకెప్పుడైనా డౌట్ వచ్చిందా?

Easiest Ways To Sneeze : తుమ్మేందుకు ప్రయత్నిస్తున్నా తుమ్మురావటంలేదా? తుమ్మడానికి సులభమైన మార్గాల ఇవే !

తుమ్ములు చాలా శక్తివంతమైనవి. తుమ్మిన సమయంలో 40,000 కంటే ఎక్కువగా కణాలు బయటకు వెళ్తాయి. ఇవి అనారోగ్యాన్ని వ్యాప్తి చేస్తాయనడంలో అతిశయోక్తి లేదు. అవి గంటకు 100 మైళ్ల కంటే వేగంతో ప్రయాణం చేస్తాయని చెబుతారు. ముక్కులో కలిగే చికాకుల వల్ల తుమ్ములు వస్తాయని అంటారు. అయితే ఈ బ్లెస్ చేయడం అనేది ఎలా పుట్టింది అంటే.. బుబోనిక్ ప్లేగు ఐరోపాను పట్టి పీడిస్తున్నప్పుడు ఈ విష్ రోమ్ లో పుట్టిందని చెబుతారు. తుమ్మడం అనేది ప్లేగు వ్యాధి ప్రధాన లక్షణాలలో ఒకటని ఎవరైనా తుమ్మినపుడు ‘గాడ్ బ్లెస్ యూ’ అని చిన్న ప్రార్ధన చేయాల్సిందిగా పోప్ గ్రెగొరీ 1 సూచించాడని చెబుతారు. మరిన్ని మూఢ నమ్మకాలు ఏంటంటే తుమ్ము శరీరంలో ఉన్న దుష్ట ఆత్మలను బయటకు నెట్టి వేస్తుందని నమ్ముతారట.

తుమ్ము వస్తే ఆపుకున్నాడు.. మెడ ఎముక విరిగి ఆస్పత్రి పాలయ్యాడు!

ఇక తుమ్మినపుడు గుండె ఆగిపోతుందని కొందరు నమ్ముతారు. తుమ్మిన తరువాత వారి ఆత్మ శరీరాన్ని విడిచిపెడుతుందని అంటారు. అందుకే ఎవరైనా తుమ్మినపుడు ‘బ్లెస్ యూ’ అనడానికి కారణం కావచ్చు. ఇవన్నీ ఎంతవరకూ కరక్టె అన్నది పక్కన పెడితే కారణాలుగా మాత్రం చెబుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు