తుమ్ము వస్తే ఆపుకున్నాడు.. మెడ ఎముక విరిగి ఆస్పత్రి పాలయ్యాడు!

తుమ్ము వస్తే ఆపుకున్నాడు.. మెడ ఎముక విరిగి ఆస్పత్రి పాలయ్యాడు!

Nose And Covering His Mouth While Sneezing : తుమ్ము వస్తే ఆపుకుంటున్నారా? తస్మాత్ జాగ్రత్త.. సరదాకు కూడా ఇలా చేయొద్దని అంటున్నారు వైద్య నిపుణులు. సాధారణంగా తుమ్మినపుడు.. మనకు తెలియకుండానే కళ్లు మూసుకుంటాం.. అది అసంకల్పిత చర్యగా చెబుతారు. అలాగే కళ్లతో పాటు గుండె కూడా కొన్ని మిల్లీ సెకన్ల పాటు కొట్టుకోకుండా ఆగిపోతుందని అంటుంటారు. అది ఎంతవరకు నిజమే తెలియదు కానీ.. తుమ్ము వచ్చినప్పుడు ఎట్టిపరిస్థితుల్లో ఆపుకోవద్దని సూచిస్తున్నారు. కానీ తుమ్మేటప్పుడు కళ్లు తెరిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకున్నాడో 34ఏళ్ల వ్యక్తి. లైవ్ ఎక్స్ పర్ మెంట్ చేశాడు.  ముక్కు, నోరు ఒకే సమయంలో మూసి గట్టిగా తుమ్మాడు..

అంతే.. అతడి మెడ ఎముక విరిగిపోయింది. వెంటనే అతన్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. ముక్కు, నోరు మూసి తుమ్మినప్పటి నుంచి అతడి మెడపై నొప్పితో పాటు విరిగిన శబ్దం వస్తోంది. ఆహారాన్ని గొంతులో మింగడం కూడా కష్టంగా మారింది అతడికి. గొంతు కూడా మారిపోయింది. మెడ కిందిభాగంలో ఎముక విరిగిన శబ్దం వినిపిస్తోంది. తుమ్మినప్పుడు పెద్ద మొత్తంలో వాయువు పీడనం ఎక్కువగా ఉంటుంది.


ఆ సమయంలో ఎయిర్ వేస్ ఓపెన్ అయి ఉంటే.. ముక్కు, నోటి ద్వారా బయటకు వెళ్లిపోతుంది. అలా కాకుండా ఎయిర్ వేస్ మూసి ఉంటే.. ఆ గాలి పీడనం లోపలికి తన్నేస్తుంది. తద్వారా ఆ పీడనం మెడ ఎముకలపై పడింది. దాంతో ఎముక విరిగి ఉండొచ్చునని అంటున్నారు పరీక్షించిన వైద్యులు. స్కానింగ్ చేసిన వైద్యులు.. బాధితుడి మెడలో సున్నితమైన కణాలు, ఛాతిని పరీక్షించారు. అందులో అతడి మెడ కింది ఎముక విరిగినట్టు గుర్తించారు. అదృష్టవశాత్తూ బాధితుడు కోలుకున్నాడు. అతనికి ట్యూబ్ ద్వారా యాంటీబయాటిక్స్ అందించారు. ఆ తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యాడు. మరోసారి తుమ్ము వచ్చినప్పుడు ఇలాంటి పని చేయొద్దని వైద్యులు హెచ్చరించారు.