Sour foods in pregnancy : ప్రెగ్నెన్సీ టైంలో పులుపు ఎందుకు తింటారంటే?

ప్రెగ్నెన్సీ కన్ఫామ్ కాగానే చాలామంది మహిళల్లో పులుపు, ఉప్పుగా ఉండే ఆహారం తినాలనిపిస్తుంది. మామిడికాయ, చింతకాయ, నిమ్మరసం వంటివి తినడానికి ఇష్టపడతారు. వీటిని ఎవరూ సిఫార్సు చేయకపోయినా తినడం ఎంతవరకూ కరెక్ట్?

Sour foods in pregnancy

Sour foods in pregnancy : చాలామంది మహిళలు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ కాగానే పుల్లటి పదార్ధాలు తినడానికి ఇష్టపడతారు. మామిడి, ఉసిరి, చింతకాయ వంటివి తింటారు. కొందరు ఉప్పు కాస్త ఎక్కువగా ఉండే పదార్ధాలు తింటూ ఉంటారు. వీరు ఈ రకమైన ఆహారం తినడానికి కారణాలు ఉన్నాయి.

America : గర్భంలోనే శిశువు మెదడుకు శస్త్ర చికిత్స.. తల్లీబిడ్డలు క్షేమం

ప్రెగ్నెన్సీ కన్ఫామ్ కాగానే చాలామంది మహిళలు పచ్చళ్లు, ఊరగాయలు, ఆలూ చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి పుల్లటి, ఉప్పగా ఉండే ఆహార పదార్ధాలు తినడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా గర్భం ధరించిన మొదటి మూడు నెలలు వీటిని తినడానికి బాగా ఇష్టపడతారట. అందుకు కారణం ఈ సమయంలో ప్రొజెస్టెరాన్ స్ధాయిల్లో వచ్చే మార్పువల్ల మూత్రంలో ఎక్కువ సోడియం కోల్పోవడం కారణం కావచ్చునట.

 

గర్భిణీ స్త్రీలలో హార్మోన్లు బాగా మారతాయి. ఈ హార్మోన్ లెవెల్స్‌ని బట్టి గర్భాన్ని నిర్ధారణ చేస్తారు. మొదటి మూడు నెలలు హార్మెన్ల లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. కోరియోనిక్ గోనడోట్రోపిన్ గ్యాస్ట్రిక్ యాసిడ్ ఉత్పత్తిని తగ్గించడం వల్ల డైజెస్టివ్ ఎంజైమ్‌ల కార్యకలాపాలు తగ్గుతాయట. అందువల్ల తల తిరగడం, తలనొప్పి, తిన్న ఆహారం అరగకపోవడం, వాంతులు, వికారం వంటివి ఎక్కువగా ఉంటాయి. నాల్గవ నెల వచ్చాక ఈ హార్మెన్ లెవెల్స్ క్రమంగా తగ్గుతు వస్తాయి.

Saffron : కుంకుమపువ్వు తింటే పిల్లలు తెల్లగా పుడతారా…?

ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యాక నాలుక రుచి తెలియనట్లు అవుతుంది. విపరీతమైన పులుపు తినాలనిపిస్తుంది. అందుకే పుల్లటి మామిడిపండ్లు, ఉసిరి కాయలు, చింతకాయలు, నిమ్మరసం తినడానికి ఇష్టపడతారు. వారు అంత పులుపు తిన్నా రుచి తెలియదు. మొదటి మూడు నెలలు పుల్లటి పదార్ధం తినచ్చు. పుల్లటి ఆహారాలు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. అవి జీర్ణక్రియకు భంగం కలిగిస్తాయి. జలుబు, దగ్గు వంటి వాటిని తీవ్రతరం చేస్తాయి. అందుకని వాటిని మితంగా తినడమే మంచిది. నిజానికి వాటిని తినాలి అని అయితే ఎవరూ సిఫార్సు చేయలేదు. కొందరిలో మట్టి, చాక్ పీస్ లు వంటి వాటిని తినాలని కోరుకుంటారు. ఇలాంటి వస్తువులు తినాలనిపించినపుడు ఖచ్చితంగా వైద్యులను కలవాలని చెబుతున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు