Chef Hat History
Chef Hat History : హోటళ్లు, రెస్టారెంట్లలో పనిచేసే చెఫ్‌లు ఆప్రాన్, పొడవాటి టోపీ పెట్టుకుంటారు. వారు పెట్టుకునే టోపీకి 100 మడతలు ఉంటాయట. అసలు చెఫ్‌లు అంత పొడవైన టోపీ ఎందుకు పెట్టుకుంటారు? దాని వెనుక ఉన్న చరిత్ర తెలుసుకుందాం.
Iron Cookware : ఇనుప పాత్రల్లో వంట చేస్తే శరీరానికి కావాల్సిన ఐరన్ దొరుకుతుందట.. నిజమేనా?
తెలుపు రంగులో ఫోల్డ్స్‌తో ఉండే పొడవైన టోపీని టోక్ అని పిలుస్తారు. ఫ్రెంచ్ వాళ్లు తెల్ల చెఫ్ టోపీని టోక్ లేదా టోచ్ బ్లాంక్ అని పిలిచేవారట. అయితే చెఫ్ పెట్టుకునే టోపీకి 100 మడతలు ఉంటాయి. ఆ మడతలు అతనికి అన్ని రకాల వంటకాలు వండటం తెలుసు అనే అర్ధాన్ని సూచిస్తుందట.
చెఫ్ పెట్టుకునే టోపీ ఎత్తు అతని స్ధాయిని సూచిస్తుందట. ఎత్తైన టోపీ పెట్టుకోవడం వెనుక చెఫ్ అతను వంట గదికి అధిపతి లేదా మాస్టర్ చెఫ్‌గా గుర్తింపట. 1800 లలో ప్రసిద్ధి చెందిన ఫ్రెంచ్ చెఫ్ మేరీ ఆంటోయిన్ కారేమో 18 అంగుళాల టోపీని ధరించేవారట. అంత పొడవైన టోపీ నిలబడాలంటే దానికి కార్డ్ బోర్డ్ సపోర్ట్ అవసరం. చెఫ్ పెట్టుకునే టోపీ వెనుక చరిత్ర ఏంటంటే? 7 వ శతాబ్దం కింగ్ అసుర్బానిపాల్ వంటవారిని ప్రత్యేకంగా గుర్తించడం కోసం, వారి విధేయతను ప్రోత్సహించడం కోసం ప్రధాన వంటవారు ఈ టోపీలను ధరించాలని కోరాడట.
Kerala : ఒకప్పుడు కేటరింగ్ బాయ్.. ఇప్పుడు రెస్టారెంట్ల ఓనర్.. చెఫ్ పిళ్లై లైఫ్ స్టోరి
16 వ శతాబ్దంలో ఇంగ్లాండ్ రాజులలో ఒకరైన హెన్రీ VIII తను తినే ఆహారంలో వెంట్రుకలు రావడం చూసి వంట చేసిన చెఫ్‌కు శిరచ్ఛేదనం విధించాడని చెబుతారు. ఈ సంఘటన తర్వాత చెఫ్‌లందరూ వంట చేసేటప్పుడు తప్పనిసరిగా టోపీ ధరించాలని ఆదేశించారట. వండిన ఆహారంలో వెంట్రుకలు పడకుండా.. వంటగదిలో పరిశుభ్రత కోసం కూడా చెఫ్‌లు టోపీలు వాడటం మొదలైంది. 1800 తర్వాత చెఫ్‌లు వంటగదుల్లో టోపీలు ధరించడం అనేది సర్వసాధారణం అయిపోయింది. తెలుపు శుభ్రతకు ప్రతీక కాబట్టి తెలుపు రంగులో ఉన్న టోపీలను ధరిస్తారు.