Kerala : ఒకప్పుడు కేటరింగ్ బాయ్.. ఇప్పుడు రెస్టారెంట్ల ఓనర్.. చెఫ్ పిళ్లై లైఫ్ స్టోరి

సురేష్ పిళ్లై.. సెలబ్రిటీ చెఫ్... ఒకప్పుడు హోటల్లో వెయిటర్‌గా, టెంపుల్లో క్లీనర్‌గా, క్యాటరింగ్ బాయ్‌గా పనిచేశారు. వచ్చిన అవకాశాన్ని చేసుకుంటూ వెళ్లిపోవడమే తనను ఈరోజు ఈ స్ధాయిలో నిలబెట్టింది అంటారాయన. తాజాగా ఓ ఫోటోతో పాటు తన జీవితానికి సంబంధించిన కొన్ని స్ఫూర్తివంతమైన అంశాలను ఆయన ట్విట్టర్‌లో షేర్ చేసుకున్నారు.

Kerala : ఒకప్పుడు కేటరింగ్ బాయ్.. ఇప్పుడు రెస్టారెంట్ల ఓనర్.. చెఫ్ పిళ్లై లైఫ్ స్టోరి

Kerala

Kerala celebrity chef : జీవితం అందరికీ వడ్డించిన విస్తరి కాదు.. దాన్ని అందంగా మలుచుకోవడం వారి చేతుల్లో ఉంటుంది. ఫేమస్ సెలబ్రిటీ చెఫ్ సురేష్ పిళ్లై.. ఒకప్పుడు కేటరింగ్ సర్వీస్ బాయ్‌గా పనిచేశారు. ఇప్పుడు అనేక రెస్టారెంట్లకు యజమానిగా ఉన్నారు. రీసెంట్‌గా ఆయన తన లైఫ్‌కి సంబంధించిన విషయాలు షేర్ చేసుకుంటూ ఓ ఫోటోని షేర్ చేశారు. ట్విట్టర్‌లో అది వైరల్ అవుతోంది.

74-year-old Hasan Ali Story : 74 ఏళ్ల రుమాళ్ల వ్యాపారి హసన్ అలీ స్ఫూర్తివంతమైన కథనం చదవండి

సురేష్ పిళ్లై ఫేమస్ చెఫ్.. అలాగే కేరళ వంటకాలతో ప్రత్యేక గుర్తింపు ఉన్న వ్యక్తి. ఎన్నో రెస్టారెంట్లకు యజమాని కూడా.. సోషల్ మీడియాలో అనేకమంది పెద్ద సంఖ్యలో ఆయనకు ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఆయన జీవితంలో అంత ఈజీగా పైకి రాలేదు. ఈరోజు ఈ స్థితికి చేరుకోవడానికి చిన్న చిన్న ఉద్యోగాలు చేశారు.

 

ఒక ఈవెంట్‌లో క్యాటరింగ్ బాయ్‌గా ఉన్న పాత ఫోటోను ఆయన తాజాగా ట్విట్టర్‌లో షేర్ చేసుకున్నారు. ‘ఈ 18 సంవత్సరాల క్యాటరింగ్ బాయ్ రిసెప్షన్‌లో ఆహారం అందిస్తున్నాడు.. ఈరోజు మీకు నాకు తెలిసిన అదే చెఫ్ పిళ్లై’ అనే క్యాప్షన్‌తో ఆయన ఈ ఫోటోని షేర్ చేసుకున్నారు. కొద్దిరోజుల క్రితం తన స్నేహితుడు ఈ ఫోటోను పంపాడని.. అది తనను కొన్ని సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిందని చెప్తూ అనేక విషయాలను suresh pillai అనే తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేసుకున్నారు.

 

Punjab Police Dog Story : క్యాన్సర్ జయించి విధుల్లో చేరిన పంజాబ్ పోలీస్ డాగ్

ఆయన చిన్నతనంలో సురేష్ పిళ్లై ఇంట్లో పొమెలో చెట్టు ఉండేదట.. దాని నుంచి వచ్చిన పండ్లను అమ్మడం ద్వారా పాకెట్ మనీ సంపాదించడం మొదలుపెట్టారట. అలా మొదటిసారిగా తను వ్యాపారవేత్తగా మారారట. ఆ తరువాత ఆలయాల్లో జరిగే పండుగల్లో వేరుశెనగలు అమ్మేవారట. ప్రభుత్వ పడవల్లో కొల్లాం సిటీకి వెళ్తూ పచ్చి వేరుశెనగలు కొని గుడి మైదానంలో ఇసుకలో వేయించి వాటిని అమ్మేరవాట. వ్యాపారం చేయాలని, డబ్బు సంపాదించాలని.. జీవితంలో ఏదైనా సాధించాలనే ఆలోచనలు తనను మరిన్ని అవకాశాల వైపు నడిపించాయని ఆయన పోస్టులో చెప్పుకొచ్చారు.

 

 

టీనేజ్‌లో ఉన్నప్పుడు హోటల్‌లో వెయిటర్‌గా, ఆలయాల్లో క్లీనర్‌గా .. క్యాటరింగ్ బాయ్‌గా.. పనిచేసి ఈరోజు ఇలా ఉన్నానని ఒక్కోసారి జీవితం గందరగోళంగా అనిపించినా ప్రయత్నాన్ని ఆపకూడదని ముందుకు సాగాలని తన పోస్టులో రాసుకొచ్చారు. ఆయన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ‘వాట్ ఏ జర్నీ సార్.. చాలామంది ప్రేరణ’ అని .. నెటిజన్లు కామెంట్లు పెట్టారు. పిళ్లై లండన్‌లోని పలు రెస్టారెంట్లలో పనిచేశారు. 2017 లో బ్రిటీష్ రియాల్టీ షోలో పోటీ పడ్డారు. చెఫ్ పిళ్లై బ్రాండ్‌తో రెస్టారెంట్ చైన్‌ను నడిపిస్తున్నారు.