లాక్‌డౌన్ టైంలో లేజీగా ఇంట్లో ఉండే, ఈ 6 ఆన్‌లైన్ కోర్సులను నేర్చేసుకోండి

లాక్‌డౌన్‌లో ప్రజలందరూ ఇళ్లకే పరిమితం. ఈటైంలో కొంతమంది సోషల్ మీడియాలో,టీవీ షోలతో టైమ్ పాస్ చేస్తుంటారు. మరి కొంతమందేమో ఒంటరిగా, బోర్ ఫీలవుతుంటారు? ఇంకొంత మంది ఈ టైంను ఎలా యూజ్ చేసుకోవాలని ఆలోచిస్తుంటారు. వీళ్లకోసమే ఇంట్లో ఉండే, మీ స్కిల్స్‌ని డెవలప్ చేసుకునే కొన్ని ఆన్‌లైన్ కోర్సుల గురించి తెలుసుకుందాం…
Sit less, get active
లాక్‌డౌన్లో మీరు ఎక్కువంగా కూర్చునే గడిచిపోతుందా? చాలా యాక్టివ్ గా ఉండాలని కోరుకుంటున్నారా? University of Edinburgh మీ ఫిజికల్ యాక్టీవిటీని ఎలా పెంచుకోవచ్చో ఒక కోర్సును అందిస్తుంది. ఈ కోర్సుతో తక్కువటైంలో మరింత చురుకుగా ఎలా ఉండాలో మీకు నేర్పిస్తుంది. వాటికి సంబంధించి వర్క్ షీట్లను, ఏరోజు ఏపని చేయాలనే క్యాలెండర్‌ను అందిస్తుంది.
The Science of Wellbeing
లాక్‌డౌన్‌లో ఒత్తిడి, ఆందోళన. వాటిని ఎదుర్కొటానికి Yale Universityఒక కోర్సును అందిస్తుంది. ఈ కోర్సు మెుదటి భాగం హ్యాపీనెస్ కు సంబంధించిన విషయాలను నేర్పుతుంది. రెండోభాగంలో సామాజిక సహాయాన్ని అందించే కార్యకలాపాలపై ఎలా దృష్టిపెట్టొచ్చో టీచ్ చేస్తుంది. అంతేనా? ట్రాస్క్ ఇస్తుంది.
Engineering Health:Introduction to Yoga and Physiology
న్యూయార్క్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అందించే కోర్సులో మెుత్తం Health మీదనే. యోగా, ధ్యానం, ఒత్తిడిని ప్రభావితం చేసే వాటిని ఎలా జయించొచ్చో మీకు excersisesతో చెబుతుంది. ఈ కోర్సుతో మీ అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు.
Introduction to Food and Health
Stanford University అమెరికన్ ప్రైవేట్ రీసెర్చ్ యూనివర్శిటీ. ఈ విశ్వవిద్యాలయం మనం డైట్ కి సంబంధించిన కోర్సు అందిస్తుంది. ఫుడ్‌లో ఏరకమైన ప్రోటీన్స్ ఉండాలి? ఏ ఫుడ్‌లో దొరుకుతాయి? ఎంతవరకు తీసుకోవాలి? ఇంటి వంటతో మీడైట్‌ను ఈజీగా ఫాలో కావడానికి ఈ కోర్సు హెల్ప్ చేస్తుంది.
Biohacking Your Brain’s Health
జార్జియాలోని అట్లాంటాలోని Emory University ప్రపంచంలోని ప్రముఖ పరిశోధనా విశ్వవిద్యాలయాలలో ఒకటి. ఈ విశ్వవిద్యాలయం మెదడు పనితీరుకు సంబంధించిన కోర్సును అందిస్తుంది. ఈ కోర్సుతో బ్రెయిన్ యాక్టీవిటీ, వ్యాయామం, ధ్యానం, నిద్ర, క్రియేటీవిటితో పాటు Brain Fitnessను పెంచే కొన్ని Techniques గురించి చెబుతుంది. మెదడు పనితీరును మెరుగుపరిచే కొన్ని చిట్కాలను ‘ప్రిస్క్రిప్షన్’ద్వారా అందుబాటులో ఉంచుతుంది.
Healing with the Arts
లాక్‌డౌన్లో మీరు ఇంట్లో ఉండే మీలోని క్రియేటీవిటీని పెంచుకోవచ్చు. యూనివర్శిటీ ఆఫ్ ఫ్లోరిడా కొన్ని ఆన్‌లైన్ క్లాస్‌లను అందిస్తుంది. డ్యాన్స్, రైటింగ్, మ్యూజిక్, ఆర్ట్స్ నేర్చుకోవడానికి కొన్ని ఐడియాలను ఇస్తుంది. మీరు కొన్ని ప్రాజెక్టులను చేయాల్సి ఉంది. ఈ కోర్సును నేర్చుకోవటానికి రోజుకో గంట కేటాయిస్తే సరిపోతుంది. మీరు ఈ కోర్సుతో క్రియేటీవీటీని ఎందుకు పెంచుకోవాలి, వాటి ఉపయోగాలు ఏమిటి అనే విషయాలు తెలుస్తాయి.