Fiber Foods : ఫైబర్ అధికంగా లభించే ఆహారాలు ఇవే!

తృణధాన్యాలు అనేక ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. కరగని ఫైబర్ యొక్క అధిక వనరులు ఇందులో ఉంటాయి. మలబద్ధకం వంటి కడుపు సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. ,

High In Fiber

Fiber Foods : మనిషి రోజువారిగా తీసుకున్న ఆహారం జీర్ణం కావాలన్నా, శరీరంలోని చక్కెర నిల్వలు అదుపులో ఉండాలన్నా పీచు పదార్ధాలు ఆహారంలో భాగం చేసుకోవటం అవసరం. జీర్ణ వ్యవస్ధ ఆరోగ్యంగా ఉంచటంలో ఫైబర్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. పండ్లు, కూరగాయలు, పప్పుదినుసుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించటంలో ఫైబర్ సహాయకారిగా పనిచేస్తుంది. మన ఆహారంలో తగినంత ఫైబర్ తీసుకోవడం విషయానికి వస్తే 50 మరియు అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పెద్దలకు, స్త్రీలకు 25 గ్రాములు, పురుషులకు 38 గ్రాములు అవసరం. ఫైబర్ బరువును నియంత్రించటంలో సహాయపడుతుంది, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది, ప్రేగు కదలికలను సక్రమంగా ఉంచుతుంది. మధుమేహం మరియు గుండె జబ్బులు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది.

ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు ;

కొన్ని రకాల పండ్లు కూరగాయల్లో ఫైబర్ అధికంగా లభిస్తుంది. పండ్లను జ్యూస్ ల రూపంలో తాగటం కన్నా నేరుగా తినటం ద్వారా ఎక్కువ మొత్తంలో శరీరానికి ఫైబర్ లభిస్తుంది. తక్కువ మొత్తంలో షుగర్ శరీరానికి అందుతుంది. పీచు ఎక్కువగా ఉండే బీరకాయ, బెండకాయ వంటివి తీసుకోవటం ద్వారా ఫైబర్ ను పొందవచ్చు. పాప్ కార్న్ లో శరీరానికి కావాల్సిన ఫైబర్ లభిస్తుంది. రుచిగా, తేలికగా ఉండే పాప్ కార్న్ లో పీచు ఉంటుంది. పొట్ట నిండుగా ఉంచటంతో ఎక్కవ ఆహారం తీసుకోలేరు. బరువు తగ్గాలనుకునే వారికి పాప్ కార్న్ తినటం ఉత్తమం.

గోధుమల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. మైదాపిండి కంటే గోధుమలను నేరుగా మరాడించి పిండిగా మార్చుకుని దానితో ఆహారపదార్ధాలు తయారు చేసుకుని తీసుకోవాలి. మైదాతో పోలిస్తే గోధుమల్లో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. సబ్జా గింజల్లో పీచు అధికంగానే ఉంటుంది. సబ్జా గింజలను నానబెట్టుకుని తీసుకోవటం ద్వారా శరీరానికి కావాల్సిన ఫైబర్ ను పొందవచ్చు. అరటిపండ్లు ఫైబర్ కు అధిక మూలంగా చెప్పవచ్చు. అరటిపండులో లభించే కరగని ఫైబర్ జీర్ణక్రియను మందగించే ధోరణిని కలిగి ఉంటుంది, తద్వారా మీరు ఎక్కువసేపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. అరటిపండు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు హృదయ మరియు కరోనరీ హార్ట్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

తృణధాన్యాలు అనేక ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. కరగని ఫైబర్ యొక్క అధిక వనరులు ఇందులో ఉంటాయి. మలబద్ధకం వంటి కడుపు సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. , తృణధాన్యాలు వంటి అధిక ఫైబర్ ఆహారాలు టైప్ 1 డయాబెటిస్‌ నుండి రక్షించడంలో సహాయపడతాయి. బార్లీలో ఉండే ఫైబర్ జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బార్లీలో ఉండే ఫైబర్‌లు ఆకలిని, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. బార్లీ హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని పరిశోధనల్లో తేలింది.

బాదం మరియు పిస్తా వంటి నట్స్ నట్స్ ఫైబర్ యొక్క అధిక మూలాలు కలిగినవిగా చెప్పవచ్చు. ఇవి ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతాయి. పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడతాయి. పిస్తాల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్లు, యాంటీ-ఆక్సిడెంట్ల యొక్క గొప్ప మూలంగా చెప్పవచ్చు. ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియాను మరింత పెంచడంలో సహాయపడతాయి. దోసకాయలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి, ప్రత్యేకించి దానిని తొక్కతో సహా తీసుకుంటే శరీరానికి అవసరమైన ఫైబర్‌ని పొందవచ్చు.