Pregnancy : గర్భధారణ సమయంలో తినాల్సిన పండ్లు ఇవే!

యాపిల్స్ సురక్షితమైన పండ్లలో ఒకటి . గర్భవతిగా ఉన్నప్పుడు తినవలసిన పండ్లలో యాపిల్స్ ముఖ్యమైనది. శిశువు యొక్క రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బిడ్డ పెరిగేకొద్దీ శ్వాసలోపం దగ్గు, ఉబ్బసం ,తామర బారిన పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Fruits To Eat During Pregnancy

Pregnancy : మహిళలు గర్భధారణ సమయంలో మంచి ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. ఎందుకంటే కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవటం అవసరం. తినే ఆహారంలో పోషకాలు, విటమిన్లు , ఖనిజాలు, ఫైబర్ ఉండేలా చూసుకోవాలి. పుట్టబోయే బిడ్డలు తెలివితేటలు కలిగి ఉండాలని కోరుకుంటే మాత్రం గర్భదారణ సమయ నుండే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి. ప్రత్యేకంగా గర్భధారణ సమయంలో కొన్ని రకాల పండ్లను తీసుకోవటం వల్ల గర్భిణీ ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అంతేకాకుండా కడుపులో ఉన్న శిశువుకు మంచి పోషకాహారం అందుతుంది. గర్భధారణ సమయంలో తినవలసిన కొన్ని పండ్ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన పండ్లు ;

యాపిల్స్ సురక్షితమైన పండ్లలో ఒకటి . గర్భవతిగా ఉన్నప్పుడు తినవలసిన పండ్లలో యాపిల్స్ ముఖ్యమైనది. శిశువు యొక్క రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బిడ్డ పెరిగేకొద్దీ శ్వాసలోపం దగ్గు, ఉబ్బసం ,తామర బారిన పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. యాపిల్స్‌లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో విటమిన్లు ఎ,ఇ,డి, అలాగే జింక్‌లు పుష్కలంగా లభిస్తాయి. గర్భిణీ స్త్రీలకు అరటిపండ్లు ఒక సూపర్ ఫుడ్. వాటిలో కాల్షియం, పొటాషియం అధికంగా ఉంటాయి, కాళ్ళ తిమ్మిరిని నివారించడంలో సహాయపడుతుంది. నారింజతోపాటు ఇతర సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ శిశువు యొక్క ఎముకలు మరియు దంతాల నిర్మాణం, పెరుగుదలకు చాలా అవసరం. విటమిన్ సి శరీరానికి కీలకమైన ఖనిజమైన ఐరన్‌ను గ్రహించడంలో కూడా సహాయపడుతుంది. ముఖ్యంగా, విటమిన్ సి అనేది యాంటీ ఆక్సిడెంట్, ఇది ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా కాపాడుతుంది.

గర్భధారణ సమయంలో కివి పండ్లు తినటం మంచిది. వీటిలో విటమిన్ సి, ఇ, ఎ, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్, డైటరీ ఫైబర్ అన్నీ కివిలో పుష్కలంగా ఉన్నాయి. కివీస్ నుండి శ్వాసకోశ వ్యవస్థకు మేలు కలుగుతుంది. తల్లికి జలుబు లేదా దగ్గు రాకుండా కూడా నిరోధించవచ్చు. ఎందుకంటే వాటిలో ఫాస్పరస్ అధికంగా ఉంటుంది. ఇనుమును గ్రహించడంలో సహాయపడుతుంది. కివీస్ రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. నేరేడు పండ్లలో ఫోలిక్ యాసిడ్, కాల్షియం, పొటాషియం మరియు మెగ్నీషియం, ఇతర విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఎండిన ఆప్రికాట్‌లలో ఐరన్,ఫైబర్ అధికంగా ఉంటాయి, ఇవి ఎర్ర రక్త కణాల సంశ్లేషణను మెరుగుపరచడంలో సహాయపడతాయి.