Monsoons Diseases : వర్షకాలంలో మలేరియా, డెంగ్యూ వంటి అనారోగ్యకారకాల నుండి మీ పిల్లలను రక్షించుకోవటానికి చిట్కాలు !

ఇంటి పరిసరాల్లో నీరు నిలిచిపోకుండా చూసుకోవాలి. దోమలను అరికట్టడానికి క్రమం తప్పకుండా ఫాగింగ్ చేయాలి. పూల కుండీలు, బకెట్లు , టైర్లలో నీటి నిల్వలు లేకుండా చూడాలి. ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు సాయంత్రం సమయంలో కిటికీలు మూసి ఉంచాలి. ఎందుకంటే దోమలు కుట్టే ప్రమాదం ఉంది.

monsoons diseases

Monsoons Diseases : వర్షకాలం పెద్దలకు మాత్రమే కాకుండా పిల్లలకు కఠినమైన సమయంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఉష్ణోగ్రతలో అకస్మాత్తుగా తగ్గుదల, అధిక తేమ, పరిసరాల్లో నీరు నిలిచిపోవడం వల్ల మలేరియా, డెంగ్యూ, డీహైడ్రేషన్, టైఫాయిడ్, చికున్‌గున్యా, గ్యాస్ట్రోఎంటెరిటిస్, కలరా, లెప్టోస్పిరోసిస్,కామెర్లు వంటి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అధిక జ్వరం, తీవ్రమైన శరీర నొప్పి, దద్దుర్లు, వాంతులు మరియు కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.

READ ALSO : knee Care : మోకాళ్ల సంరక్షణకు చిట్కాలు

కలుషితమైన ఆహారం, నీటి వల్ల ఇన్‌ఫెక్షన్లు కలుగుతాయి. పిల్లలకు దగ్గు, జలుబు మరియు ఫ్లూ వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ సందర్భంలో తల్లిదండ్రులు తప్పకుండా కొన్ని ముందస్తు జాగ్రత్తలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

పరిసరాలను శుభ్రంగా , దోమలు లేకుండా ఉంచటం: ఇంటి పరిసరాల్లో నీరు నిలిచిపోకుండా చూసుకోవాలి. దోమలను అరికట్టడానికి క్రమం తప్పకుండా ఫాగింగ్ చేయాలి. పూల కుండీలు, బకెట్లు , టైర్లలో నీటి నిల్వలు లేకుండా చూడాలి. ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు సాయంత్రం సమయంలో కిటికీలు మూసి ఉంచాలి. ఎందుకంటే దోమలు కుట్టే ప్రమాదం ఉంది. ఇంట్లో పిల్లలకు పడుకునేటప్పుడు దోమతెరలు ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల డెంగ్యూ, మలేరియా రాకుండా చూసుకోవచ్చు.

READ ALSO : Monsoon Diseases : డెంగ్యూ నుండి చికున్‌గున్యా వరకు వర్షకాలంలో వచ్చే 5 సాధారణ వ్యాధులు, నివారణ చిట్కాలు !

దోమల వికర్షకాలను ఉపయోగించటం: దోమల వల్ల పిల్లలకు హానికలగకుండా చూసుకోవాలి. దోమలు దరిచేరకుండా ఏదైనా వికర్షకాలను ఉపయోగించాలి. వీటిని ఉపయోగించే ముందు నిపుణులతో మాట్లాడటం మంచిది. లెప్టోస్పిరోసిస్‌ను నివారించడానికి వర్షపు నీటికి సమీపంలో ఉండటం, నడవడం మానుకోవాలి.

పిల్లలకు తగిన విధంగా దుస్తులు ధరింపచేయటం : తేలికైన , వదులుగా ఉండటంతోపాటు పూర్తి గా చేతులు కప్పిఉంచే దుస్తులను ఎంచుకోవాలి. ఈ దుస్తులు సౌకర్యంగా ఉండటంతోపాటు కొంత రక్షణను అందిస్తాయి. పిల్లల బహిరంగ కార్యకలాపాలను పరిమితం చేయాలి.

ఇంట్లో పరిశుభ్రత పాటించండి: అలెర్జీ కారకాలను నివారించడానికి , బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడానికి తల్లిదండ్రులు బెడ్ షీట్లు, దుప్పట్లు , ఇతర గృహోపకరణాలను క్రమం తప్పకుండా శుభ్రపరుచుకోవాలి.

READ ALSO : Rainy Season Diseases : వర్షకాలంలో వీటి జోలికి వెళ్ళి రోగాలు కొనితెచ్చుకోకండి!

మంచి చేతి పరిశుభ్రతను పాటించటం: పిల్లలు తినడానికి ముందు, పాఠశాల నుండి వచ్చిన తర్వాత , ఏదైనా వస్తువులను తాకడానికి ముందు చేతులు కడుక్కునే విధంగా ప్రోత్సహించాలి.

పిల్లలకు మంచి పోషకాహారం అందించటం: పోషకాలు, విటమిన్లు మరియు మినరల్స్ కలిగిన నారింజ, కివీ, నిమ్మ, స్ట్రాబెర్రీలు, క్యాబేజీ, కాలీఫ్లవర్ మరియు టొమాటోలు వంటి విటమిన్ సితో నిండిన ఆహారాన్ని తినమని పిల్లలను ప్రోత్సహించాలి. దీని వల్ల వారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.