Monsoon Season Health Tips
Monsoon Season Health Tips : వర్షాకాలంలో అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు పెరుగుతాయి. ఈ కాంలో ఆరోగ్యంగా ఉండటానికి సరైన పరిశుభ్రతను పాటించాల్సిన అవసరం ఉంది. వర్షకాలంలో పరిశుభ్రత పాటించడం వల్ల అనారోగ్యం బారిన పడకుండా నిరోధించవచ్చు. వర్షాకాలంలో అనారోగ్యం బారిన పడకుండా ఉండటానికి ఆరోగ్యకరమైన అలవాట్లను అనుసరించటం ముఖ్యం. వర్షా కాలంలో తేమతో కూడిన వాతావరణం దోమల సంతానోత్పత్తికి అనుకూలంగా ఉంటుంది. వర్షాకాలంలో, బ్యాక్టీరియా, జెర్మ్స్ , దోమలు వేగంగా వృద్ధి చెందుతాయి. వర్షాకాలంలో సాధారణంగా మలేరియా, డెంగ్యూ, ఫ్లూ, చికున్‌గున్యా, లెప్టోస్పిరోసిస్ మొదలైన వ్యాధులు వస్తాయి.
READ ALSO : Monsoon Diet : వర్షకాలంలో ఆహారంలో నెయ్యిని తప్పనిసరిగా చేర్చుకోవడానికి 5 కారణాలు !
వర్షాకాలంలో జబ్బు పడకుండా నిరోధించే మార్గాలు ;
పరిశుభ్రమైన తాగునీరు తీసుకోవటం ; వర్షం సమయంలో కలుషిత నీటి కారణంగా కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి. సురక్షితంగా , ఆరోగ్యంగా ఉండేందుకు ఇంటి వద్ద తప్పనిసరిగా వాటర్ ఫిల్టర్‌ని ఏర్పటుచేసుకోవాలి. లేదంటే కాచి చల్లార్చిన నీటిని తీసుకోవాలి. ప్రయాణ సమయంలో వాటర్ బాటిల్‌ను మీతో తీసుకెళ్లండి. లేదంటే నీర్ణీత ప్రమాణాలు పాటించే సీల్డ్, ప్యాక్ చేసిన వాటర్ బాటిల్స్ నీటి తీసుకోండి.
బయటి ఆహారాలను నివారించండి ; బయటి హోటల్స్ లో, వీధుల్లో ఉండే జంక్ ఫుడ్స్ స్పైసీ, అనారోగ్యకరమైన ఆహార పదార్థాలు తీసుకోరాదు. ఇవి కడుపు ఉబ్బరం, ఆమ్లత్వం , అజీర్ణానికి కారణమవుతాయి. ఈ ఆహారాల తయారీలో ఉపయోగించే కూరగాయలు , నీరు కలుషితం కావచ్చు, దీని వలన టైఫాయిడ్ ,కలరాతోపాటు వివిధ న్ఫెక్షన్‌లతో ప్రభావితమయ్యే ప్రమాదం ఉంటుంది.
READ ALSO : Fever Season : జ్వరాల కాలం వర్షకాలం! జాగ్రత్తలే రక్షణ
దోమల నివారణకోసం ; అధిక వర్షపు నీటితో రోడ్లపై నడవకపోవటం మంచిది. ఈ నీటితో నిండిన రోడ్లపై మలేరియా, డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులకు కారణమయ్యే దోమల అలవాలంగా ఉంటాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల నుండి రక్షించుకోవడానికి, కీటక వికర్షకాలను, దోమతెరలను ఉపయోగించాలి. సాయంత్రం బయటకు వెళ్లేటప్పుడు ఫుల్ దుస్తులను కప్పి ఉంచుకోండి.
ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం ; ఆరోగ్య విషయంలో ఏవైనా నిర్దిష్ట లక్షణాలను గమనించినట్లయితే వైద్యుడిని సంప్రదించడం మంచిది. జ్వరం, ముక్కు కారటం, జలుబు, దగ్గు, లేదా కీళ్ల ,కండరాల నొప్పి వంటి ప్రాథమిక లక్షణాలు ఈ సీజన్ లో కనిపిస్తాయి. సరైన రోగ నిర్ధారణ ద్వారా అసలు కారణం తెలుసుకుని చికిత్స పొందాలి.
READ ALSO : Boost Immunity During Monsoons : వర్షకాలంలో రోగనిరోధక శక్తిని పెంచటంలో సహాయపడే పండ్లు, కూరగాయలు ఇవే!
విటమిన్ సి తీసుకోవడం ; వర్షాకాలం వైరల్ జ్వరాలు, అలెర్జీ ప్రతిచర్యలు,వైరల్ ఇన్ఫెక్షన్లు అధికంగా వస్తాయి. వాతావరణంలో గాలిలో బ్యాక్టీరియా కూడా పెరుగటం వల్ల ఇవి వ్యాపిస్తాయి. వర్షాకాలంలో ఆరోగ్యంగా ఫిట్‌గా ఉండటానికి మీరు మీ రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. వర్షాకాలంలో విటమిన్ సి తీసుకోవడం పెంచాలి. మొలకలు, తాజా ఆకుపచ్చ కూరగాయలు , నారింజ వంటి సిట్రస్ పండ్లతో విటమిన్ సి అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.
దోమల అవాసాలు అవకాశం కల్పించొద్దు ; ఇంటిలో బహిరంగ నీటి నిల్వ లేకుండా చూసుకోవాలి. అలాగే, కాలువలు మూసుకుపోకుండా చూసుకోవటం సమీప ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోకుండా చూడాలి. నిలిచిన నీటిలో దోమలు , వాటిగుడ్లను నాశనం చేయాలి. ఇలా చేయటం వల్ల దోమల వృద్ధిని అరికట్టటంతోపాటు, రోగాలను నివారించవచ్చు.
READ ALSO : Asthma Patients : వర్షకాలంలో ఆస్తమా రోగులు ఈ జాగ్రత్తలు పాటిస్తే మంచిది!
అనారోగ్య వ్యక్తులకు దూరంగా ; వైరల్ లేదా సాధారణ ఫ్లూ ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. కాబట్టి జబ్బుపడిన వ్యక్తుల నుండి సురక్షితమైన దూరంలో ఉండటం మంచిది. ప్రయాణిస్తున్నప్పుడు, అనారోగ్యానికి గురయ్యే అవకాశాలను నివారించడానికి, అనారోగ్యంతో ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండాలి.
చివరిగా సీజనల్ అనారోగ్యాలు సాధారణమైనవి. ఆరోగ్యంగా ఫిట్‌గా ఉండటానికి వర్షాకాలంలో ఆరోగ్యకరమైన జీవనశైలి, మంచి ఆహారపు అలవాట్లు ఈ వ్యాధులను దూరంగా ఉంచడంలో
మీకు సహాయపడతాయి.