Benefits Of Basil : మొటిమలతోపాటు, చర్మ సమస్యలు తొలగించే సహజసిద్ధమైన తులసి!
తులసి ఆకులు, వేపాకు, లవంగాలు, కొన్ని నీళ్లు కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ ప్యాక్ ని కూడా ముఖానికి అప్లై చేస్తూ ఉంటె మంచి ఫలితం కన్పిస్తుంది. తులసి ఆకులు, గ్రీన్ టీ ఆకులు, పెరుగు కలిపి పేస్ట్ లా తయారు చేసుకోవాలి.

Benefits of Tulsi for Skin and Hair
Benefits Of Basil : మెరిసిపోయే చర్మం కోసం, సహజసిద్దమైన పదార్థాలు మన ప్రకృతిలో చాలానే ఉన్నాయి. ఇవి ఎన్నో విధిలుగా చర్మ ఛాయను మెరుగుపరచటంలో తోడ్పడతాయి.అలాంటి వాటిలో మన ఇంట్లో రోజు కనిపించే తులసి మొక్క కూడా ఒకటి. తులసి చర్మసంబంధిత సమస్యలు తగ్గిస్తుంది. ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా తులసి మేలు చేస్తుంది.
తులసి లో విటమిన్లు, మినరల్స్, ఎలెక్రోలైట్స్, మరియు ఫీతోనూట్రిఎంట్స్ లాంటివి ఎన్నో ఉన్నాయి. ఆరోగ్యవంతమైన చర్మానికి తులసి ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖంపై వచ్చే మొటిమలు, చర్మ సంబంధిత రుగ్మతలను తగ్గించడంలో ఉపయోపడుతుంది. అంతేకాకుండా వ్యాధినిరోధక శక్తి ని పెంపొందిస్తుంది. తాజా తులసి ఆకులను తినడం వల్ల రక్తం శుద్ధి అయి మొటిమలు క్రమంగా తగ్గుముఖం పడుతాయి.
తులసి ఆకుల పేస్ట్ కి కొంచెం పసుపు కలిపి, క్రమం తప్పకుండ వారానికి 2 సార్లు అప్లై చేయాలి. ఇలా చేయటం వల్ల మొటిమలు నుండి విముక్తి లభిస్తుంది. తులసి ఆకులపొడిని , రోజ్ పౌడర్ తో కలిపి ముఖానికి పట్టిస్తే చర్మరంధ్రాలు తెరుచుకొని, మొటిమలు, చర్మసమస్యలు తగ్గుతాయి. తులసి ఆకుల రసానికి తగిన మోతాదులో నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుని 15 నిమిషాల తర్వాత చల్లని నీళ్లతో కడ్కుక్కోవాలి. ప్రతిరోజు చేయడం వల్ల నల్లమచ్చలు తగ్గుతాయి.
తులసి ఆకులు, వేపాకు, లవంగాలు, కొన్ని నీళ్లు కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ ప్యాక్ ని కూడా ముఖానికి అప్లై చేస్తూ ఉంటె మంచి ఫలితం కన్పిస్తుంది. తులసి ఆకులు, గ్రీన్ టీ ఆకులు, పెరుగు కలిపి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. తరువాత ముఖానికి ప్యాక్ గా వేసుకోవాలి. ఇలా చేస్తే మెరిసే చర్మాన్ని పొందవొచ్చు. అలాగే తులసి ఆకుల పేస్ట్, చందనం పొడి, రోజ్ వాటర్ ను కలిపి ప్యాక్ ల తయారు చేసి ముఖానికి అప్లై చేయాలి. తులసి ఆకుల రసానికి, పుదీనా ఆకుల రసం కలిపి ముఖానికి అప్లై చేస్తే ఉపశమనం ఉంటుంది.