Ukraine Crisis : యుక్రెయిన్ సంక్షోభం.. మన వంటిల్లు ఇక భారమే.. ఎందుకంటే?

యుక్రెయిన్‌ సంక్షోభం.. ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. అలాగే మన భారతీయుల వంటిల్లుకు కూడా పెనుభారంగా మారనుంది. యుక్రెయిన్‌పై రష్యా వివాదానికి.. మన వంటిల్లుకు సంబంధం ఏంటి..

Ukraine Crisis Effect to edible oil : యుక్రెయిన్ సంక్షోభం.. ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. అలాగే మన భారతీయుల వంటిల్లుకు కూడా పెనుభారంగా మారనుంది. అదేంటీ.. యుక్రెయిన్‌పై రష్యా వివాదానికి మన వంటిల్లుకు సంబంధం ఏంటి అనుకుంటున్నారా? భారతీయ వంటకాల్లో అద్భుతమైన రుచిని ఆశ్వాదించేది కేవలం వంటనూనెతోనే.. ఆ వంటనూనె ప్రతిఒక్కరి వంటింట్లో తప్పనిసరిగా ఉండాల్సిందే.. ఇది లేకుంటే ఎలాంటి రెసిపీలు చేయలేం.. అందులోనూ ఆరోగ్యకరమైన వంటనూనె మన వంటింట్లో లేదంటే కష్టమేగా మరి.. అలాంటి వంట నూనె దిగుమతికి యుక్రెయిన్‌ రష్యా మధ్య ఉద్రిక్తతల కారణంగా అంతరాయం ఏర్పడుతోంది. దాంతో భారత మార్కెట్లో అత్యంత డిమాండ్ ఉన్న సన్ ఫ్లవర్ (Sun Flower Oil Import) ఆయిల్ కొరత ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది. ఫలితంగా భారత మార్కెట్లో (సన్ ఫ్లవర్ ఆయిల్) వంటనూనె ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. అదేగానీ జరిగితే మన వంటిల్లు బడ్జెట్ అమాంతం పెరిగే అవకాశం లేకపోలేదు.

దేశంలో 10శాతంగా సన్ ఫ్లవర్ ఆయిల్ వినియోగం :
భారతీయ మార్కెట్లో ఎక్కువగా వాడే వంటనూనెల్లో సన్ ఫ్లవర్ ఆయిల్ వినియోగం 10శాతానికి పైనే ఉంది.. ఈ వంటనూనెకు డిమాండ్ అంతకంతకూ పెరిగిపోతోంది. అంతేకాదు.. భారత్‌లో పామ్ ఆయిల్ (Palm Oil) నెంబర్ స్థానంలో ఉండగా.. ఆ తర్వాత దిగుమతి అయ్యే రెండో అతిపెద్ద వంటనూనెగా సన్ ఫ్లవర్ వినియోగంలో ఉంది. రష్యా, అర్జెంటీనా దేశాలు భారత మార్కెట్లోకి సన్ ఫ్లవర్ ఆయిల్‌ను దిగుమతి చేస్తున్నాయి. అంతర్జాతీయ పరిశీలకుల ప్రకారం.. ఉక్రెయిన్‌లో రష్యా వివాదం కారణంగా అంతర్జాతీయ పరిణామాలకు దారితీసింది. ఈ యుక్రెయిన్‌, రష్యా వివాదం కారణంగా.. భారతదేశంలోని పెద్ద సంఖ్యలో కుటుంబాల్లో వంటిల్లు బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడేలా కనిపిస్తోంది. ఎందుకంటే.. భారత్‌లో సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతికి యుక్రెయిన్‌ ప్రధాన మూలంగా మారింది. 2021లో భారత్ దాదాపు 1.89 మిలియన్ టన్నుల పొద్దుతిరుగుడు (Sun Flower Oil) నూనెను దిగుమతి చేసుకుంది. ఇందులో 74 శాతం సన్ ప్లవర్ ఆయిల్ యుక్రెయిన్‌ నుంచే భారత్ దిగుమతి చేసుకుంటోంది.

భారత్‌లో సన్‌ఫ్లవర్ ఆయిల్‌కు భారీ డిమాండ్ :
సన్‌ఫ్లవర్ ఆయిల్ (Sun Flower Oil) అనేది.. భారత వంటనూనె మార్కెట్లో పామాయిల్ తర్వాత రెండవ అతిపెద్ద దిగుమతి చేసుకున్న వంటనూనె.. అలాంటి సన్‌ఫ్లవర్ ఆయిల్ దేశీయ ఉత్పత్తిలో భారత్‌లో వినియోగంలో కేవలం 10 శాతం మాత్రమే ఉంది. కానీ, ఈ వంటనూనెకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతి ఈ ఏడాది జనవరిలో రూ.2.05 లక్షల టన్నుల నుంచి 3.07 లక్షల టన్నులకు చేరుకుంది. వంటనూనె పరిశ్రమ పరిశీలకుల అభిప్రాయం ప్రకారం.. భారతీయ పొద్దుతిరుగుడు నూనె మార్కెట్ 2022-2027 మధ్యకాలంలో 7.6శాతం వార్షిక వృద్ధి రేటును సాధిస్తుందని అంచనా వేసింది.

ఎందుకంటే.. భారతదేశంలో ఎక్కువ మంది ప్రజలు మంచి హెల్తీ వంటనూనెను కోరుకుంటున్నారు. సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరలు భారతీయ కొనుగోలుదారులకు ఎంతో ఆకర్షణీయంగా మారాయి. భారతీయులు వాడే వంటనూనెగా సన్ ఫ్లవర్ ఆయిల్‌కు ఎక్కువగా డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకోవడంతో యుక్రెయిన్‌లో సంక్షోభం కొనసాగుతోంది. దాంతో ఈ సన్ ఫ్లవర్ ఉత్పత్తి, దిగుమతులపై నీలినీడలు కమ్ముకున్నాయి. యుక్రెయిన్‌, రష్యా మధ్య కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా.. యుక్రెయిన్‌ నుంచి సన్ ఫ్లవర్ ఆయిల్ సరఫరాలను నిర్దిష్ట పరిమితికి మించి పెంచడం సాధ్యం కాని పరిస్థితి ఎదురవుతోంది.

రష్యా, అర్జెంటీనా ఈ రెండు దేశాలే భారతదేశానికి సన్ ఫ్లవర్ నూనెను సరఫరా చేస్తున్నాయి. అయితే ఈ వంటనూనెను యుక్రెయిన్‌ నుంచి సరఫరా చేయలేకపోయాయి. గత రెండు ఏళ్లలో భారత్ సన్‌ఫ్లవర్ ఆయిల్ అవసరాలను తీర్చడానికి యుక్రెయిన్‌ను దాటి మరో వనరు కోసం ప్రయత్నించింది. అర్జెంటీనాలో పరిమితంగా ఉత్పత్తి చేయాల్సి రావడంతో వంటనూనె దిగుమతికి సవాలుగా మారుతోంది. 2019లో అర్జెంటీనా ఎడిబుల్ ఆయిల్ ఇండస్ట్రీ అధిపతి తమ దేశం నుంచి భారత్‌కు 4లక్షల టన్నుల సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను సరఫరా చేయగలదని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే భారత్ కూడా వంటనూనె దిగుమతిలో ఏర్పడిన అంతరాన్ని తగ్గించేందుకు ప్రయత్నాలు చేపట్టింది. ఇంతలో ఉక్రెయిన్‌లోని ఉద్రిక్తతల కారణంగా వంటనూనె రిటైల్ ధరలను మరింత పెంచడమే కాకుండా సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉందని వంటనూనె పరిశ్రమలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Read Also : Sunflower Seeds : ఆరోగ్యానికి ప్రయోజనం కలిగించే పొద్దు తిరుగుడు గింజలు

ట్రెండింగ్ వార్తలు