Indian Edible Oil Prices : తగ్గిన వంట నూనె రేట్లు, ఇంపోర్ట్స్​పై డ్యూటీ తగ్గింపు

సామాన్య ప్రజలకు ఊరట కల్గించే నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. వంట నూనెల ఇంపోర్ట్స్​పై డ్యూటీ తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వంట నూనెల రేట్లు ఇటీవల రికార్డు స్థాయికి చేరడంతో కేంద్రం పన్ను తగ్గించింది. దాదాపు 20 శాతం వరకు ధరల తగ్గింపు ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Indian Edible Oil Prices : తగ్గిన వంట నూనె రేట్లు, ఇంపోర్ట్స్​పై డ్యూటీ తగ్గింపు

Indian Edible Oil Prices

Updated On : June 18, 2021 / 11:35 AM IST

Indian Edible Oil Prices: సామాన్య ప్రజలకు ఊరట కల్గించే నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. వంట నూనెల ఇంపోర్ట్స్​పై డ్యూటీ తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వంట నూనెల రేట్లు ఇటీవల రికార్డు స్థాయికి చేరడంతో కేంద్రం పన్ను తగ్గించింది. దాదాపు 20 శాతం వరకు ధరల తగ్గింపు ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు దిగుమతి తగ్గింపు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. 2021, జూన్ 17వ తేదీ గురువారం కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి.

ముడి పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని టన్నుకు 87 డాలర్లు తగ్గించింది. ముడి సోయా చమురు దిగుమతి సుంకం టన్నుకు 37 డాలర్లు తగ్గించింది. దీంతో ప్రస్తుతం దీని ధర టన్నుకు 14 వందల 15 డాలర్లుగా ఉంది. అటు ఆర్బీడీ పామాయిల్ పై టన్నుకు 11 వందల 48 డాలర్లకు దిగివచ్చింది. తాజా తగ్గింపుతో దేశీయంగా ఆవ, సోయాబీన్​, వేరుశనగ నూనెల రేట్లు కూడా దిగిరానున్నాయి.

188 రూపాయలున్న లీటర్ సన్ ఫ్లవర్‌ ఆయిల్‌ 157 రూపాయలకు తగ్గనుంది. పల్లి నూనె 174 రూపాయలకు తగ్గనుంది. పామాయిల్ 115 రూపాయలకే రానుంది. ఆవ నూనె 157 రూపాయలకు తగ్గనుంది. సోయా నూనె 138 రూపాయలకు, వనస్పతి నూనె కిలో 141 రూపాయలకు తగ్గనుంది.