To recall memories
To recall memories : కొన్ని వస్తువులు ఎక్కడ పెట్టామో మర్చిపోతాం.. చేయాలనుకున్న పని మర్చిపోతాం.. సహజంగా చాలామందిలో ఇలా జరుగుతుంది. ఎంత ఆలోచించినా విషయం గుర్తు రాదు.. ఎంత వెతికిన వస్తువులు ఎక్కడ పెట్టామో కనిపించవు. విపరీతమైన గందరగోళానికి గురయ్యేకంటే కాసేపు కళ్లు మూసుకోమంటున్నారు శాస్త్రవేత్తలు. కాసేపు కళ్లు మూసుకోవడం వల్ల మర్చిపోయినవి గుర్తుకు వస్తాయట.
Morse Code : మీ మనసులో మాట ‘మోర్స్ కోడ్’లో చెప్పేయండి
కొద్దిసేపు కళ్లు మూసుకుని ఉండటం వల్ల బయట ప్రపంచంలోని గందరగోళం తగ్గుతుంది. అప్పుడు ఏదైతే మర్చిపోయామో అవి గుర్తుకు వస్తాయని యూనివర్సిటీ ఆఫ్ సర్రే శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 71 మందిపై జరిపిన పరిశోధనలో వారు ఈ అంశం వెల్లడించారు. మీకు సంబంధించిన ఏ పిన్ నంబర్ మర్చిపోయినా కాసేపు కళ్లు మూసుకుని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించాలట. బయటి ప్రపంచాన్ని మూసివేసినప్పుడే రీకాల్ బూస్ట్ అవుతుందని వారు చేసిన ప్రయోగం ద్వారా స్పష్టం చేస్తున్నారు.
సర్రే యూనివర్సిటీకి చెందిన మనస్తత్వవేత్తలు దాదాపుగా 200 మంది మగ,ఆడవారికి షార్ట్ ఫిల్మ్‌లను చూపించి వాటిపై ప్రశ్నలు వేసారట. కళ్లు తెరిచిన వారు 48 శాతం సమాధానాలు సరిగ్గా చెప్పారట. కళ్లు మూసుకుని ఉన్నవారు 71 శాతం స్కోర్ చేయగలిగారట. కళ్లు మూసుకుని ఉన్నవారిలో పరధ్యానం తక్కువగా ఉంటుందని పరిశోధకుడు రాబర్ట్ నాష్ పేర్కొన్నారు. పిన్ నంబర్లు, షాపింగ్ లిస్ట్‌లను గుర్తు పెట్టుకోవాలంటే కాసేపు కళ్లు మూసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుందని కూడా డాక్టర్ నాష్ చెప్పారు. కొన్ని ఇతర అధ్యయనాలు కళ్లు మూసుకోవడం వల్ల చాలా కాలం క్రితం జరిగిన సంఘటనలు కూడా గుర్తు తెచ్చుకోవచ్చని చెబుతున్నాయి.