Morse Code : మీ మనసులో మాట ‘మోర్స్ కోడ్‌’లో చెప్పేయండి

డిజిటల్ యుగంలో ఇప్పుడు ఎవరూ ఉత్తరాలు రాసుకోవడం లేదు. కానీ మీ ప్రియమైన వారికి మీ మనసులో మాట చెప్పాలంటే కాస్త డిఫరెంట్‌గా ఆలోచించండి. మోర్స్ కోడ్‌లో మీ మనసులోని మాటను చెప్పేయండి. అదేంటి అంటారా? చార్ట్ చూసి నేర్చేసుకోండి.. చాలా సింపుల్.

Morse Code : మీ మనసులో మాట ‘మోర్స్ కోడ్‌’లో చెప్పేయండి

Morse Code

Updated On : July 21, 2023 / 2:45 PM IST

Morse Code : మోర్స్ కోడ్ అనేది ఎలక్ట్రికల్ పల్స్‌లను పంపే ఒక మెకానిజం. DASH , DOTS ఉపయోగించి దీనిని వాడతారు. ఈ కోడ్‌ను ఉపయోగించాలంటే ఖచ్చితంగా ఆంగ్ల అక్షరాలు రావాలన్నమాట.

Cigibud : సిగరెట్‌ తాగే అలవాటుని మాన్పించే ఫిల్టర్ .. ప్రపంచంలోనే మొట్టమొదటి పరికరం

ఇంగ్లీష్ పదాలను చుక్కలు, డాష్‌లతో రూపొందించి మీ ప్రియమైన వారికి పంపొచ్చు. మోర్స్ కోడ్‌లో ప్రేమ లేఖను కూడా రాయచ్చు. అయితే దీనిని కనిపెట్టిన శామ్యూల్ మోర్స్ గురించి తెలుసుకుందాం. దీనిని ఆయన సృష్టించడం వెనుక బాధాకరమైన కథ ఉందట. శామ్యూల్ మోర్స్ మంచి చిత్రకారుడు. ఒకరోజు అతను పెయింటింగ్ వేసే పనిలో ఉన్నప్పుడు భార్య తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్లు లేఖ వచ్చిందట. మర్నాడు ఆమె చనిపోయినట్లు మరో లేఖ వచ్చిందట. అతని భార్య మరణం గురించి విచారకరమైన వార్తను తెచ్చింది.

 

శామ్యూల్ మోర్స్ తన భార్య చాలాకాలంగా బాధపడుతోందని గ్రహించాడు. ఇక అప్పట్లో ఉత్తరాలు వేగంగా బట్వాడా చేయడానికి సరైన మార్గం కూడా లేదు. దూరంగా ఉన్న తమ వారికి సందేశాలను త్వరగా పంపడంలో సహాయపడే దానిని కనిపెట్టడానికి ఈ విషాదమే అతడిని ప్రేరేపించిందని చెబుతారు. అలా మోర్స్ ఈ కోడ్‌ను కనిపెట్టాడట.

Crop Protection : అడవిపందులు, పక్షుల నుండి పంట రక్షణకోసం అందుబాటులోకి గార్డియన్ 2 పరికరం …

మోర్స్ కోడ్‌లో మీ ప్రియమైన వారికి ఉత్తరం, లేదా ప్రేమ లేఖ రాయండి. లేదంటే వాట్సాప్‌లో మెసేజ్ చేసి అదేంటో కనిపెట్టమనండి. అదేంటో తెలుసుకోవాలని వారికి కాస్త ఇంట్రెస్టింగ్‌గా.. కాస్త థ్రిల్లింగ్‌గా.. ఉంటుంది. అసలు ముందు మీరు రాయాలంటే మోర్స్ కోడ్ చార్ట్ మీ దగ్గర ఉండాలి. ఆలస్యం చేయకుండా సరదాగా చార్ట్ చూసి ట్రై చేయండి.