Crop Protection : అడవిపందులు, పక్షుల నుండి పంట రక్షణకోసం అందుబాటులోకి గార్డియన్ 2 పరికరం …

వంటగ్యాస్‌తో పనిచేసే ఈ పరికరం ధర రూ.45 వేలు. గార్డియన్ టూ పరికరాన్ని చేలలో ఒకచోట అమర్చుతారు. ఫిక్స్‌ చేసిన తర్వాత మనుషులు ఎవరూ లేకుండా ఆటోమేటిక్‌గా పనిచేస్తుంది. ప్రతి ఐదు నిమిషాలకోసారి పెద్ద శబ్దం చేస్తుంది.

Crop Protection : అడవిపందులు, పక్షుల నుండి పంట రక్షణకోసం అందుబాటులోకి గార్డియన్ 2 పరికరం …

crop protection from wild animals & birds

Crop Protection : ఒక వైపు ప్రకృతి ఒడిదుడుకులు, మరోవైపు నకిలీ విత్తనాల మధ్య ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొని పంట సాగుచేస్తే.. ఇప్పుడు అడవి జంతువుల రూపంలో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. అడవులను వదిలేసి జంతువులు పంటపొలాలపై పడి చేతికొచ్చిన పంట నాశనం చేస్తున్నాయి. వీటి నుండి పంటపోలాలను కాపాడుకునేందుకు అనేక పద్ధతులను ఆచరిస్తున్నారు. అయినా వీటిని పూర్తి స్థాయిలో అరికట్టలేకపోతున్నారు.

ఆదిలాబాద్‌ జిల్లాలో అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉండడం, పొలాలకు సమీపంలో అడవులు ఉండడంతో పంటలకు పక్షులు, అడవి పందుల బెడద అధికంగా ఉన్నది. అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను.. చేతికొచ్చే దశలో పక్షులు, కోతులు, అడవి పందులు నాశనం చేస్తున్నాయి. గుంపులు, గుంపులుగా చేలలోకి వచ్చి పంటలను తినేస్తున్నాయి. అడవిపందుల కారణంగా 20 నుంచి 30 శాతం పంటను రైతులు నష్టపోతున్నారు.

READ ALSO : Crave Crops : పంటలను ఆశించే చీడ పీడలను ఆకర్షించే ఎరపంటలు!

ఈ నేపథ్యంలో రైతులు పంటలను రక్షించుకునేందుకు ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చర్యలు చేపట్టారు. పొలాల్లో పక్షులు, అడవి పందులను బెదరగొట్టడానికి గార్డియన్ – 2(టూ) అనే పరికరాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దీన్ని ఆదిలాబాద్‌ వ్యవసాయ పరిశోధన కేంద్రంలోని జొన్న చేనులో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. ఈ పరికరం సత్ఫలితాలు ఇవ్వడంతో రైతులకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఫలితం ఆశాజనకంగా ఉండటంతో త్వరలో రైతులకు అవగాహన కల్పిస్తామంటున్నారు.

READ ALSO : Paddy Cultivation : వరిలో కాండంతొలుచు పురుగు, సుడిదోమ ఉధృతి… నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు

వంటగ్యాస్‌తో పనిచేసే ఈ పరికరం ధర రూ.45 వేలు. గార్డియన్ టూ పరికరాన్ని చేలలో ఒకచోట అమర్చుతారు. ఫిక్స్‌ చేసిన తర్వాత మనుషులు ఎవరూ లేకుండా ఆటోమేటిక్‌గా పనిచేస్తుంది. ప్రతి ఐదు నిమిషాలకోసారి పెద్ద శబ్దం చేస్తుంది. 119 డెసిబెల్‌ శబ్దం వెలువడటంతో పక్షులు, అడవిపందులు, కోతులు భయంతో చేలలోకి రావు. వంటగ్యాస్‌ ఉపయోగిస్తుండడంతో వాటికి ఎలాంటి హానీ ఉండదు. ఐదు కిలోల సిలిండర్‌ను పది వేల శబ్దాలు వచ్చే వరకు వినియోగించవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. పూర్తి సమాచారం కోసం క్రింది వీడియోపై క్లిక్ చేయండి.