Cigibud : సిగరెట్‌ తాగే అలవాటుని మాన్పించే ఫిల్టర్ .. ప్రపంచంలోనే మొట్టమొదటి పరికరం

సిగరెట్‌ తాగే అలవాటుని మాన్పించే ఫిల్టర్ ను ఆవిష్కరించింది ఢిల్లీ ఐఐటీ అంకుర. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి పరికరమని వెల్లడి.

Cigibud : సిగరెట్‌ తాగే అలవాటుని మాన్పించే ఫిల్టర్ .. ప్రపంచంలోనే మొట్టమొదటి పరికరం

Cigibud..World’s First Smoking Cessation Filter

Cigibud : సిగిరెట్ తాగకండి పోతారు అని ఎంతగా చెప్పినా..ఎంతమంది చెప్పినా పొగరాయుళ్లు గుప్పు గుప్పు మంటూ పొగతాగుతునే ఉంటారు. ఛీ సిగిరెట్ తాగకూడదని అనుకున్నా.. అదొక వ్యసనంగా మారిపోవటంతో మానలేకపోతుంటారు. అలా పొగతాగకూడదనుకునేవారికి ఐఐటీ-ఢిల్లీ అంకుర సంస్థ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. నానోక్లీన్‌ పొగ తాగే అలవాటును మాన్పించే ఫిల్టర్‌ను ఆవిష్కరించి ధూమపానానికి మంచి సాధనం అంటూ వివరించింది..

ధూమపానం క్యాన్సర్,గుండె బజ్జులు, క్రానిక్ బ్రోన్కైటిస్, ఊపిరితిత్తుల వ్యాధులకు మూలకారణంగా మారి ప్రజల ప్రాణాలను హరించేస్తుంది. ధూమపానం ఉన్నవారికి ఐఐటీ-ఢిల్లీ అంకుర సంస్థ అత్యాధునిక గాలి వడపోత పరిష్కారంతో తయారైన వినూత్న పరికరాన్ని ఆవిష్కరించింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ధూమపానం మాన్పించేందుకు కనిపెట్టిన ఫిల్లర్. దీని పేరు ‘సిగిబడ్‌’(Cigibud). సిగిబడ్ అని పిలిచే ఈ ఫిల్టర్ వినియోగిస్తూ కేవలం మూడు నెలల్లో ధూమపానం వ్యసనం నుంచి బయటపడవచ్చని తెలిపింది.

మూడు నెలల్లో ధూమపానం మాన్పించటానికి శాస్త్రీయంగా నిరూపితమైన ఫిల్టర్ ఇది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)ప్రతిపాదించిన నికోటిన్‌ రీప్లేస్‌మెంట్‌ థెరపీ ప్రేరణతో రూపొందించిన ఈ ఫిల్టర్‌ లైట్‌, అల్ట్రా, ప్రొ స్థాయిల్లో లభ్యమవుతుంది. వీటిలో (పొగాకు మండినప్పుడు వెలువడే రసాయనం), నికోటిన్‌ స్థాయిలు తగ్గుతూ వస్తాయి.

నానోఫైబర్ సాంకేతికత గణనీయమైన పరిమాణంలో నికోటిన్‌ను ఫిల్టర్ చేయడంలో సహాయపడుతుంది. సిగిబడ్ లైట్,అల్ట్రా మరియు ప్రో స్థాయిలతో ఒక ప్యాక్ వస్తుంది. ఇవి ధూమపానాన్ని దశలవారీగా మానివేయటానికి సహాయపడతాయి. ఇది మూడు దశల ప్రక్రియ. దీంట్లో 30 నుంచి 60శాతం వరకు నికోటిన్ లైట్ స్థాయిలోనే తగ్గించబడతాయి.