ప్రేమికులకు వాలంటైన్స్ డే అంటే వెరీ స్పెషల్. తమ ప్రేమను ఎక్స్ ప్రెస్ చేసేందుకు ఇదే మంచి రోజుని ప్రేమికులంతా ఫీల్ అవుతుంటారు. ప్రియుడు, ప్రియురాలు ఇలా ఇద్దరూ తమ ప్రియమైన వ్యక్తికి ఏదో గిఫ్ట్ ఇచ్చి సర్ ఫ్రైజ్ చేస్తుంటారు.
వాలంటైన్స్ డే దగ్గరలోనే ఉంది. ఫిబ్రవరి నెలలో వచ్చే ఈ వాలంటైన్స్ డే అంటే ప్రేమికులకు వెరీ స్పెషల్. తమ ప్రేమను ఎక్స్ ప్రెస్ చేసేందుకు ఇదే మంచి రోజుని ప్రేమికులంతా ఫీల్ అవుతుంటారు. ప్రియుడు, ప్రియురాలు ఇలా ఇద్దరూ తమ ప్రియమైన వ్యక్తికి ఏదో గిఫ్ట్ ఇచ్చి సర్ ఫ్రైజ్ చేస్తుంటారు. వెరీ కామన్. అదే.. మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కో లేదా.. మీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కు కూడా ఇదే వాలంటైన్స్ డే రోజు గిఫ్ట్ ఇవ్వాలనుందా? అదేనండి.. రీవేంజ్ గిఫ్ట్?. గిఫ్ట్ అంటే.. ఇష్టమైన వాళ్లకు ఇచ్చేది కదా? మళ్లీ గిఫ్ట్ ఎందుకు దండగ అనుకుంటున్నారా? మీరు మీ ఎక్స్ ఫ్రెండ్ కు నచ్చని గిఫ్ట్ ఇచ్చినా రీవేంజ్ తీర్చుకున్నట్టే కదా? సాధారణంగా బొద్దింక అంటే అందరికి నచ్చదు. కొందరికి భయం కూడా. అది కనిపిస్తే చాలు.. ఆమడ దూరం పారిపోతారు. అలాంటి బొద్దింకను ఈ ఎక్స్ ఫ్రెండ్ కు ఇచ్చి భయపెట్టండి..
ఈ బొద్దింక బోర్డుపై మీ ఎక్స్ ఫ్రెండ్ పేరు..
అంతే కాదండోయ్.. ఈ బొద్దింకకు ఎక్స్ ఫ్రెండ్ పేరు పెట్టాలి. ఈ ఏడాది ఇంగ్లాండ్ లోని ఓ జూలో బొద్దింకలకు పేర్లు పెట్టే వినూత్న ప్రొగ్రామ్ ను డిజైన్ చేశారు. ఎక్స్ ఫ్రెండ్ పై రీవేంజ్ తీర్చుకోవాలంటే ఈ బొద్దింక గిఫ్ట్ పర్ఫెక్ట్ గిఫ్ట్ అని ఈవెంట్ నిర్వహకులు చెబుతున్నారు. ఫ్రీగా కాదండోయ్.. బొద్దింకకు పేరు పెట్టాలంటే డబ్బులు చెల్లించాల్సిందే. బొద్దింక బోర్డు గిఫ్ట్ ధర ఎంతంటే.. రూ.140. బొద్దింక బోర్డుపై పేరు పక్కన మీ ఎక్స్ ఫ్రెండ్ పేరు పెట్టాల్సి ఉంటుంది. సరదా కోసం నిర్వహించే ప్రొగ్రామ్ ద్వారా చెల్లించే మొత్తం సొమ్మును ఓ ఛారిటీకి విరాళంగా ఇచ్చేస్తారట. మీ రీవెంజ్.. ఓ మంచి పనికి ఉపయోగపడుతుంది కదా. మీరు చేయాల్సిందిల్లా వాలంటైన్స్ డే కాక్ రోచ్ అనే వెబ్ సైట్ లోకి పేరును నమోదు చేసుకోవడమే. ఇంకెందుకు ఆలస్యం.. డోంట్ మిస్ ది ఛాన్స్.