Five super Drinks : బరువు తగ్గడానికే కాదు..జీవక్రియకు ఉపయోపడే ఐదు అద్భుత పానీయాలు

బరువు తగ్గడానికి..జీవక్రియ మెరుగు పడటానికి ఉపయోపడే ఐదు అద్భుత పానీయాలు గురించి తెలుసుకోండీ..

జీవక్రియ అంటే ఏమిటి? ప్రేగు మరియు మూత్రమార్గం గుండా పొట్టలో మరియు దాని విసర్జన ఆహార అందిన తర్వాత సంభవించే వివిధ రసాయన ప్రతిచర్యలు శరీరంలో ఈ కలయిక. శరీరం శక్తిని శక్తిగా మార్చడానికి ఉపయోగించే జీవరసాయన ప్రక్రియల జీవక్రియ. ఈ జీవక్రియా ప్రక్రియలో శ్వాస, తినడం, జీర్ణం చేయటం, రక్తం ద్వారా మీ కణాలకు పోషకాలను పంపిణీ చేయడం, మీ కండరాలు, నరాలు,కణాల ద్వారా శక్తిని ఉపయోగించడం, చివరికి మీ శరీరం నుండి వ్యర్థ ఉత్పత్తుల తొలగింపు. ఇవన్నీ జీవక్రియలే. ఆకలి గురించి జాగ్రత్తలు తీసుకోకపోతే జీర్ణ సమస్యలకు దారి తీస్తుంది. తద్వారా అధికంగా బరువు పెరిగిపోవటం జరుగుతుంది. ఆరోగ్యకరమైన బరువు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, నిద్ర విధానాలు మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది.నెమ్మదిగా జీవక్రియ మీ బరువు తగ్గించే ప్రయాణానికి ఆటంకం కలిగిస్తుందని తరచుగా చెబుతారు. ఇది మీ సమస్య అని మీరు భావిస్తే, మీ జీవక్రియను పెంచడంలో సహాయపడే ఈ ఐదు సాధారణ పానీయాలు గురించి తెలుసుకోండీ..

ఫెన్నెల్ టీ..

ఫెన్నెల్ టీ అంటే ఫెన్నెల్ గింజలతో కాచే టీ. పెన్నెల్ గింజలు అంటే సోంపు గింజలు. తిన్న ఆహారం త్వరగా జీర్ణం కావటానికి భోజనం తరువాత తింటారు సోంపు గింజల్ని. అంతేకాదు ఈ ఫెన్నెల్ గింజలు చక్కటి మౌత్ ఫ్రెష్ గా కూడా పనిచేస్తాయనే విషయం మీకు తెలిసిందే. జీవక్రియను మెరుగుపరచటంలో ఈ సోంపుగింజలతో తయారు చేసిన టీ తాగితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఫెన్నెల్ గింజలో చక్కటి పోషకాలుంటాయి. ఫెన్నెల్ గింజలతో చేసిన టీ తాగితే..కడుపు ఉబ్బరం, మలబద్ధకం వదిలిపోతాయి.అంతేకాదు ఈ ఫెన్నెల్ టీ బరువు తగ్గడానికి చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాదు..మీ జీవక్రియను మెరుగుపరచడంలో చాలా సహాయపడుతుంది.

Read more : Lips : పెదవులు నాజుకుగా, మృదువుగా కావాలంటే?..

ఫెన్నెల్ టీ చేయడానికి, రెండు కప్పుల నీటిని మరిగించి 1 టీస్పూన్ సోపు గింజలు వేసి, మరిగించి, కొద్దిగా నిమ్మరసం మరియు తేనె వేసి రుచిని పెంచుతుంది. ఈ ఫెన్నెల్ టీ తాగితే ఎటువంటి ఆహారం అయినా సరే చక్కగా జీర్ణమైపోతుంది. అదే సమయంలో మీరు తిన్న ఆహారంలో ఫ్యాట్ ఉంటే కరిగించేస్తుంది. దీంతో వెయిట్ లాస్ అనేది జరుగుతుంది.

నిమ్మ డిటాక్స్ వాటర్..

నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుందనే విషయం ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. నిమ్మలో సిట్రిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరం నుండి కొవ్వును తొలగించి మన జీవక్రియను పెంచడంలో సహాయపడతాయి. నిమ్మ డిటాక్స్ నీటిలో తేనె, దాల్చినచెక్కను కలిపి మరిగింటం ద్వారా రోగ్యాన్ని కూడా మెరుగుపరచటంలో సహాయకారిగా ఉంటుంది. లెమన్ వాటర్ డిటాక్స్ చేయడానికి..రెండు కప్పుల నీటిని తీసుకుని, ఒక నిమ్మకాయను పిండి, 1/2 టీస్పూన్ దాల్చిన చెక్క,1 టేబుల్ స్పూన్ తేనె జోడించండి. బాగా కలపండి అంతే తాగటానికి చక్కటి నిమ్మ డిటాక్స్ వాటర్ రెడీ..ఇది తాగితే జీవక్రియ మెరుగుపడటంతో పాటు చక్కటి వెయిల్ లాస్ అవుతారు.

Read more : మొలకెత్తిన పెసలు తినటం ఆరోగ్యానికి మంచిదా..__ Why Green Peas are Healthy and Nutritious

అజ్వైన్ డిటాక్స్ వాటర్


అజ్వైన్ డిటాక్స్ వాటర్.అంటే వాము నీరు. అజ్వైన్ లేదా క్యారమ్ విత్తనాలు అంటారు. ఈ గింజలు జీర్ణక్రియకు గొప్పగా పనిచేస్తాయి. వీటిని ఔషధ ప్రయోజనాల కోసం చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. అజ్వైన్ ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాదు బరువు తగ్గడంలో చాలా సహాయపడుతుంది.

అజ్వైన్ డిటాక్స్ వాటర్ చేయడానికి..రెండు కప్పుల నీటిని తీసుకుని, ఒక టీస్పూన్ అజ్వైన్‌ (వాము) రాత్రంతా నానబెట్టండి. ఈ మిశ్రమాన్ని ఎక్కువగా నీరు పోసి ఉడకబెట్టండి..తరువాత దాన్ని వడకట్టండి..తరువాత దాన్ని చక్కగా వేడి చేయండి. ఆ మిశ్రమం మరింత రుచిగా మారటానికి చక్కగా ఓ నిమ్మచెక్క పిండుకోండీ. తరువాత చక్కగా తాగేయండీ..

అల్లం-నిమ్మకాయ పానీయం


జింజర్ (అల్లం) లెమన్ (నిమ్మ) డ్రింక్ బరువు తగ్గడమే కాకుండా జీర్ణకోశ సమస్యలకు సూపర్ గా పనిచేస్తుంది. ఈ పానీయం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. శరీరం తిమ్మిర్లతో బాధపడుతుంటే..ఈ పానీయం చక్కగా ఉపయోగపడుతుంది. ఈ పానీయం తాగితే తిమ్మిర్లు రావటం తగ్గుతుంది.నిమ్మలోని విటమిన్ సి,పెక్టిన్ జీర్ణాశయాన్ని మెరుగుపరచడంతో పాటు మంచి డిటాక్స్ డ్రింక్‌గా చేస్తుంది.

అల్లం నిమ్మరసం పానీయం చేయడానికి, మిక్సర్‌లో ఒక గ్లాసు నీటిని తీసుకుని, కొంచెం ఐస్, 1-అంగుళాల అల్లం,పుదీనా ఆకులను కలిపి మరిగించండీ. రుచి పెరగటానికి ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం,తేనె వేసి చక్కగా కలపండి. అంతే అల్లం-నిమ్మకాయ పానీయం రెడీ.రోజుకు ఓ కప్పు తాగినా చక్కటి జీవక్రియ జరుగుతుంది. బరువు తగ్గుతారు.

జీలకర్ర-దాల్చిన చెక్క పానీయం


జీలకర్ర-దాల్చిన చెక్క పానీయం రోజూ తాగితే..వంటకు వాడే జీలకర్ర అద్భుతమైన జీర్ణక్రియ సాధనం. ఒంట్లో అజీర్తిగా అనిపించినప్పుడు ఓ స్పూన్ జీలకర్ర తింటే కడుపు ఉబ్బరం తగ్గుతుంది. ఇక జీలకర్రకు దాల్చిన చెక్క జోడించి పానీయం తయారు చేస్తే పెరుగుతున్న బరువుకు చెక్ పెట్టవచ్చు. బరువు తగ్గడంలో దాల్చిన చెక్క చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు మధుమేహంతో పోరాడడంలో సహాయపడతాయి. జీలకర్ర, మరోవైపు, జీర్ణక్రియకు మంచిది మరియు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

ఈ జీలకర్ర- దాల్చిన చెక్క పానీయం చేయడానికి.. ఒక పెద్ద టీ కాచే గిన్నెలాంటిది తీసుకుని దాంట్లో ఒక లీటరు గానీ అరలీటరు నీటిని తీసుకని జీలకర్ర, దాల్చినచెక్కను వేసి జోడించండి. ఐదు నిమిషాలు ఉడకనివ్వండి. పానీయాన్ని వడకట్టి, వేడి చేయండి. మీరు కొద్దిగా ఉప్పు, నిమ్మ రసంతో పాటు కాస్త తేనె కూడా కలిపి తాగితే వెయిట్ లాస్ కు చక్కటి ఉపయోగకరంగా ఉంటుంది.అలాగే చక్కటి జీవక్రియకు కూడా ఎంతో ఉపయోగం.

ట్రెండింగ్ వార్తలు