Lips : పెదవులు నాజూకుగా, మృదువుగా కావాలంటే?..

రోజుకి 12 గ్లాసుల నీరు త్రాగడం వలన మీ శరీరం మాత్రమేకాకుండా పెదవులు హైడ్రేట్ అవుతాయి. చర్మం రక్త ప్రసరణను ఉత్తేజపరచడంలో సహాయపడుతుంది.

Lips : పెదవులు నాజూకుగా, మృదువుగా కావాలంటే?..

Lips (1)

Lips : శరీరంలోని ఇతర భాగాలకంటే పెదవులు మాత్రం నాజుకుతనంతో ఉంటాయి. వాతావరణ ప్రభావంతో చాలా మంది పెదవులు నల్లబడటం, రంగు మారి చూడటానికి వీల్లేకుండా తయారవుతాయి. ముఖ్యంగా సూర్యరశ్మి నుంచి వెలువడే యూవీ కిరణాలు వల్ల పెదవులు వివిధ వర్ణాల్లోకి మారిపోతాయి. పెదాలు లేత గులాబీ రంగులో ఉంటే చూడటానికి అందంగా ఉంటాయి. ఇందుకోసం చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ చిన్నచిన్న చిట్కాలతో పెదాలను లేత గులాబీ రంగులో మెరిసిపోయేలా చేసుకోవచ్చు.

కీర దోస రసాన్ని రోజు పెదాలకు పట్టించి రెండు నిమిషాలు రుద్దితే పెదాలు మంచి రంగులో కనిపిస్తాయి. రాత్రి పూట పెదాలపై పాల మీగడ రుద్ది కడగకుండా వదిలేస్తే పొడి బారటం తగ్గి పెదాలపై తేమతో మెరుస్తూ ఉంటాయి. వారానికొకసారి న్యాచురల్‌ లిప్‌ స్క్రబ్బర్‌ను ఉపయోగించండి. దీనివల్ల చర్మంపైన ఉన్న మృతకణాలు తొలగిపోతాయి. ఫలితంగా పెదాలు సాధారణ రంగులోకి వచ్చేస్తాయి. కొన్ని చుక్కల ఆలివ్‌ ఆయిల్‌లో ఒక టీస్పూన్‌ షుగర్‌ కలిపి పెదాలపై రాసుకుంటే సరిపోతుంది.

ఆరెంజ్‌ రసం కలిగిన లిప్‌బామ్‌ సూర్యుని నుంచి వెలువడే ప్రమాధకర కిరణాల నుంచి రక్షణ కల్పించి సహజ కండిషనింగ్‌లా పనిచేస్తుంది.పెదాలపై డెడ్‌ స్కిన్‌ పొరను తొలగించాలంటే వారానికి ఒకసారైనా టూత్‌ బ్రష్‌తో షుగర్ స్క్రబ్‌ను అప్లై చేయాలి. రాత్రి పడుకునే ముందు పెదాలపై నిమ్మరసం రాసుకోవాలి. ఇలా కొన్నినెలల పాటు చేస్తే డార్క్‌లిప్స్‌ సాధారణ రంగులోకి వచ్చేస్తాయి. నిమ్మకాయను కట్‌ చేసి ఒక ముక్కపై కొంచెం పంచదార వేసి నెమ్మదిగా పెదాలపై రబ్‌ చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా మృతకణాలు తొలగిపోయి పెదాలు మంచి రంగును సంతరించుకుంటాయి.

ఆలివ్ నూనెలో కొద్దిగా పంచదార కలిపి పెదవులపై సున్నితంగా మర్ధన చేయాలి. ఇలా చేయటం వల్ల పెదవులు మెరుస్తూ ఉంటాయి. వెన్నను పెదాలపై రాయడం వల్ల ఎల్లప్పుడూ తేమగా, మృదువుగా కనిపిస్తాయి. విటమిన్లు పుష్కలంగా ఉండే పండ్లు ఆకుకూరలు తినాలి. అలాగే అధికంగా నీళ్లు తాగడం మంచిది. అర టీస్పూన్ గ్లిజరిన్, ఆముదం, నిమ్మరసం తీసుకుని, వీటిని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదవులపై అప్లై చేసి రాత్రంతా అలాగే ఉంచండి. ఇలా చేయడం ద్వారా పెదాలపై పేరుకుపోయిన ట్యాన్‌ తొలగిపోతుంది.

బీట్‌రూట్‌లో న్యాచురల్‌ బ్లీచింగ్‌ గుణాలుంటాయి. డార్క్‌లిప్స్‌ను లేతరంగులోకి మారేలా చేయడంలో బీట్‌రూట్‌ బాగా ఉపయోగపడుతుంది. రాత్రిపడుకునే ముందు పెదాలపై బీట్‌రూట్‌ జ్యూస్‌ రాసుకుని ఉదయాన్నే చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. రోజూ ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. బీట్‌రూట్‌ జ్యూస్‌, క్యారెట్‌ జ్యూస్‌ కలిపి పెదాలపై నెమ్మదిగా మర్దన చేయాలి. తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకోవాలి. వారంలో రెండు రోజులు ఇలా చేయడం వల్ల పెదాలు లేత గులాబీరంగులోకి మారతాయి.

రోజుకి 12 గ్లాసుల నీరు త్రాగడం వలన మీ శరీరం మాత్రమేకాకుండా పెదవులు హైడ్రేట్ అవుతాయి. చర్మం రక్త ప్రసరణను ఉత్తేజపరచడంలో సహాయపడుతుంది. గులాబి రేకులను పాలలో వేసి నానబెట్టాలి. తర్వాత పేస్ట్ చేసి తేనె, చిటికెడు కుంకుమపువ్వు కలపాలి. దీన్ని పెదవులకు రాసి పదిహేను నిముషాల తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేస్తే పెదవులు మంచి కాంతి వంతంగా మెరిసి పోతాయి.