WFH Priority: వర్క్ ఫ్రమ్ హోంకే మొగ్గుచూపుతున్న కార్పొరేట్ కంపెనీలు
కొవిడ్ మహమ్మారి వర్క్ ఫ్రమ్ హోంతో కార్పొరేట్ లైఫ్ స్టైల్ లో మార్పులు తెచ్చింది. ఈ సౌకర్యానికి అలవాటుపడ్డ ఉద్యోగులు పర్మినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కే మొగ్గుచూపుతున్నారని..

Wfh
WFH Priority: కొవిడ్ మహమ్మారి వర్క్ ఫ్రమ్ హోంతో కార్పొరేట్ లైఫ్ స్టైల్ లో మార్పులు తెచ్చింది. ఈ సౌకర్యానికి అలవాటుపడ్డ ఉద్యోగులు పర్మినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కే మొగ్గుచూపుతున్నారని జాబ్స్ అగ్రిగేటర్ Naukri.com డేటా వెల్లడించింది.
ఆరు నెలల్లో, 32 లక్షల మంది పర్మినెంట్, టెంపరరీ ఉద్యోగాల కోసం వెదికారు. వీటిలో దాదాపు 57% పర్మినెంట్ వర్క్ ఫ్రమ్ హోం కోసం వెదికినవే.
జాబ్ బోర్డ్‌లో ప్రత్యేక ఫీచర్‌ను రూపొందించిన తర్వాత, సంస్థ తన సైట్‌లో 93వేల శాశ్వత, తాత్కాలిక రిమోట్ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయంటూ చూపించారు. వీటిలో వర్క్ ఫ్రమ్ హోం 22% ఉన్నాయి. సంస్థలు క్రమంగా తెరుచుకుంటున్నప్పటికీ, కార్పోరేట్‌లు ఎక్కువగా WFHకే మొగ్గుచూపుతున్నారు.
Read Also: జీవితాంతం ఇళ్లలో ఉండే పని చేసుకోండి.. ఎంప్లాయీస్‌కు బంపర్ ఆఫర్
నౌకరీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ మాట్లాడుతూ.. “రిక్రూటర్‌లు సంస్థాగత నిర్మాణాలను ఎలా ఏర్పాటు చేసుకుంటున్నారనే విషయంలో మార్పు ఉంది. మహమ్మారి కారణంగా అనిశ్చితి నెలకొని ఉండగా, ఎక్కువ మంది రిక్రూటర్‌లు ప్రతిభను పొందడం, మరింత చేరిక వంటి ఎక్కడి నుంచైనా పని చేయగల ప్రయోజనాలను అంగీకరిస్తున్నారు. ఇప్పుడు కార్పొరేట్ స్థాయిలో మానవ వనరులు, మౌలిక సదుపాయాల అవసరాలకు శాశ్వత మార్పులు చేయడం వంటివి ప్రారంభించారు” అని అన్నారు.
‘అంతేకాకుండా, కంపెనీలు కొన్ని జాబ్ ప్రొఫైల్‌లను పూర్తిగా WFHగా మార్చేందుకు జాగ్రత్తగా పరిశీలించాం. అధిక వ్యక్తిగత సహకారంతోనే ఇది సాధ్యపడుతుంది. ముఖ్యంగా IT, సాఫ్ట్‌వేర్, BPO పరిశ్రమలలో ఇది కీలకం’ అని జాబ్ బోర్డు పేర్కొంది.
IT సాఫ్ట్‌వేర్, సాఫ్ట్‌వేర్ సేవలు, ITeS, రిక్రూట్‌మెంట్/సిబ్బంది రంగాలు ఎక్కువ శాశ్వత రిమోట్ ఉద్యోగాలను పోస్ట్ చేస్తున్నాయని డేటా చూపిస్తోంది. నౌకరీ వెబ్‌సైట్ డేటా ప్రకారం పర్మినెంట్ లేదా టెంపరరీ WFH కేటాయించిన వాళ్లల్లో అమెజాన్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్, పీడబ్ల్యుసీ, ట్రిజెంట్, ఫ్లిప్‌కార్ట్, సీమెన్స్, డెలాయిట్, ఒరాకిల్, జెన్సార్, టీసీఎస్, క్యాప్‌జెమినీలు ఉన్నాయి.
Read Also: వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న ఐటీ ఎంప్లాయీస్ ఇళ్లలో సీసీ కెమెరాలు