WFH Employees: వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న ఐటీ ఎంప్లాయీస్ ఇళ్లలో సీసీ కెమెరాలు

పర్‌ఫార్మెన్స్ అనాలసిస్ లో భాగంగా.. ప్రొఫెషనల్ మానిటరింగ్ ముఖ్యమంటున్నాయి కంపెనీలు. బోనస్‌లు, హైక్‌లు, ప్రమోషన్లు వీటిని బట్టే ఇస్తారట. అంటే కంపెనీలు వారి ఉద్యోగులు ఎలా ఫర్‌ఫార్మ్ చేస్తారనే తెలుసుకునేందుకు ఇంత ఫోకస్ చేస్తారట.

WFH Employees: వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న ఐటీ ఎంప్లాయీస్ ఇళ్లలో సీసీ కెమెరాలు

Cc Camera

WFH Employees: కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి పలు కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ఇంతవరకూ బాగానే ఉంది. మరి పనిచేస్తున్న ఉద్యోగులను మానిటర్ చేయడం ఎలా. వాళ్లను ఎప్పుడూ చూస్తూ పర్యవేక్షించాలనే ఆలోచన వచ్చిందో ఏమో.. దాదాపు 2.4 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఇళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు.

పర్‌ఫార్మెన్స్ అనాలసిస్ లో భాగంగా.. ప్రొఫెషనల్ మానిటరింగ్ ముఖ్యమంటున్నాయి కంపెనీలు. బోనస్‌లు, హైక్‌లు, ప్రమోషన్లు వీటిని బట్టే ఇస్తారట. అంటే కంపెనీలు వారి ఉద్యోగులు ఎలా ఫర్‌ఫార్మ్ చేస్తారనే తెలుసుకునేందుకు ఇంత ఫోకస్ చేస్తారట.

వర్క్ ఫ్రమ్ హోం వచ్చినప్పటి నుంచి ప్రతి ఐటీ ఎంప్లాయ్ కాల్ సెంటర్ కు పనిచేస్తున్నట్లుగానే ఉందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల ఇళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి.. మానిటర్ చేస్తామంటూ మరో బాంబు వేసింది కంపెనీ యాజమాన్యం.

మార్చిలో ఇష్యూ అయిన కాంట్రాక్ట్ ప్రకారం.. ఆర్టిఫిషియల్ పవర్డ్ కెమెరాలను ఇన్ స్టాల్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఉద్యోగులు వారి ప్రైవేట్ స్సేస్ లో కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. సర్వీస్ ప్రొవైడర్లు కుటుంబ సభ్యుల మానిటర్ చేయాలంటూ అదంతా స్టోరేజ్ డేటాలో వాయీస్ అనలిటిక్స్ ద్వారా పరీక్షిస్తామని చెప్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా 3లక్షల 80వేలకు మందికి పైగా ఉన్న వర్కర్లను ఈ కాంట్రాక్ట్ కు ఒప్పుకోవాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. ఇంటి దగ్గర ఉద్యోగులు ఏం చేస్తున్నారనేది తెలుసుకోవాలని ఫోన్లలో పెంచుతున్న ఒత్తిడితో తమకు విసుగ్గా ఉంటుందంటున్నారు.

మేం ఆఫీసులో కాదు కదా పనిచేసేది. వర్క్ ఫ్రమ్ హోం చేసేటప్పుడు ఒక్కోసారి బెడ్ రూంలో ఉన్నప్పుడు కూడా పనిచేస్తుంటాం. అక్కడ కూడా సీసీ కెమెరాలు ఫిక్స్ చేస్తారా.. అని అడుగుతుంటే.. కొందరు మహిళా ఉద్యోగులు ఉద్యోగం పోతుందని భయం వేసి ఎనిమిది పేజీల కాంట్రాక్ట్ పై సంతకం పెట్టేసినట్లు తెలిపారు.