Dry Ginger : శొంఠితో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నంటే?..

వేడి పాలల్లో శొంఠి పొడిని కలిపి సేవిస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పరగడుపున నీళ్లల్లో శొంఠి పొడిని కలిపి మరిగించుకుని తేనె కలుపుకుని తాగితే అజీర్తి, గ్యాస్, ఎసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు పోతాయి.

Dry Ginger : పురాతన కాలంలో నుండి ఆయుర్వేదంలో శొంఠికి ప్రత్యేకమైన స్ధానం ఉంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే శొంఠి జీర్ణ సంబంధిత సమస్యలను తొలగించటంలో చక్కగా ఉపయోగపడుతుంది. అల్లాన్ని పాలల్లో ఉడికించి ఎండబెట్టటం ద్వారా శొంఠిని తయారు చేస్తారు. ఈ శొంఠిని పొడిగా మార్చి ఆయుర్వేద వైద్యంలో వినియోగిస్తుంటారు. రోజువారిగా శొంఠిని వినియోగిస్తే మనశరీరంలో అనేక అనారోగ్య సమస్యలను పోగొట్టవచ్చు.

శొంఠి అజీర్తి దోషాలను నిర్మూలిస్తుంది. ఆహారాన్ని శరీరానికి వంటబట్టేటట్లు చేస్తుంది. కఫాన్నితగ్గిస్తుంది. గొంతు సమస్యలను తొలగించటంతోపాటు, కంఠాన్ని శుద్ధి చేస్తుంది. వాంతులను అరికటట్టంలో తోడ్పడుతుంది. ఆయాసం, ఉబ్బసం వ్యాధులలో అల్లం కన్నా శొంఠి శ్రేష్టమయినది. కడుపునొప్పి, దగ్గు, ఆయాసం, గుండె జబ్బుకు శొంఠి ఉపకరిస్తుంది. బోదకాలు, మొలలు, కడుపుబ్బరం, పైత్యం, లివరు సంబంధిత వ్యాధులు, వాత రోగాలను నయం చేసుకునేందుకు శొంఠిని ఉపయోగించవచ్చు. శొంఠిను ఉప్పుతో కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో మంట తగ్గుతుంది. ఇది ముఖ్యంగా కీళ్ళు , వేళ్ళలో వాపును తగ్గిస్తుంది.

నీళ్ళ విరేచనాలవుతున్నప్పుడు శొంఠి పొడిని తీసుకుంటే విరేచనంలో నీటి శాతాన్ని తగ్గిస్తుంది. కడుపులో మంటను ,విరేచనాలకు కారణమయిన దోషాలను నివారిస్తుంది. వాము, కరక్కాయ, శొంఠి ఈ మూడింటిని కలిపి బెల్లంతో నూరి తీసుకుంటే కీళ్ళవాతం తగ్గుతుంది. విరేచనం సాఫీగా జరుగుతుంది. శొంఠిని పొడి చేసి, తేనెలో కలిపి కుంకుడు గింజ పరిమాణంలో తీసుకుంటే పక్షవాతరోగులకు ఉపశమనం కలుగుతుంది. అమీబియాసిన్ జిగట విరేచనాలు తరచుగా అయ్యేటప్పుడు శొంఠిని క్రమం తప్పక ఉపయోగిస్తుంటే సమస్య తొలగుతుంది.

వేడి పాలల్లో శొంఠి పొడిని కలిపి సేవిస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పరగడుపున నీళ్లల్లో శొంఠి పొడిని కలిపి మరిగించుకుని తేనె కలుపుకుని తాగితే అజీర్తి, గ్యాస్, ఎసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు పోతాయి. ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో అర స్పూన్ శొంఠి పొడి వేసి బాగా కలిపుకుని తాగితే శరీరంలో పేరుకున్న కొవ్వు కరిగిపోతుంది. అదే క్రమంలో బరువు కూడా తగ్గుతారు. జలుబు, దగ్గు సమస్యల నివారణకు ఒక గ్లాస్ నీటిలో అర స్పూన్ శొంఠి పొడి, పావు స్పూన్ లవంగాల పొడి వేసి బాగా మరిగించి గోరు వెచ్చగా తీసుకుంటే సమస్య పరిష్కారమవుతుంది.

శొంఠి శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. కొద్దిగా శొంఠి పొడిని గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పుతో కలిపి తినాలి. ఉదయం ఖాళీ కడుపుతో దీన్ని తినడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. శొంఠి పొడిని పాలతో కలిపి త్రాగటం వల్ల బరువును అదుపులో ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు