heart attack
Travel And Heart Disease : పిల్లలకు వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. చాలా మంది వేసవి సెలవులను సరదాగా గడిపేందుకు వివిధ పర్యాటక ప్రాంతాలకు వెళుతుంటారు. అయితే కుటుంబసభ్యుల్లో ఎవరైన గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే దూరప్రాంత ప్రయాణాలకు వెళుతుంటే తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. వేసవి సెలవుల సమయంలో రిలాక్సేషన్ మరియు స్ట్రెస్‌ని తగ్గించుకోవటానికి దూరప్రాంతాల్లోని పర్యాటక ప్రదేశాలకు వెళుతుంటే ప్రయాణం సమయంలో హృద్రోగులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
READ ALSO : Heart Disease : షుగర్ ఉన్నవారికి గుండె జబ్బులు దరిచేరకుండా ఉండాలంటే ?
దూరప్రయాణాలు చేసే హృద్రోగులకు జాగ్రత్తలు ;
1. గుండె జబ్బు ఉన్న రోగులు ప్రయాణం చేసినప్పుడు తాము రోజువారిగా వేసుకునే మందులను మరచిపోతారు. యాంజియోప్లాస్టీ , ఏదైనా ఇతర గుండె ప్రక్రియ తర్వాత, వైద్యుడు సూచించిన విధంగా సమయానికి మందులు తీసుకోవడం తప్పనిసరి. ఎవరైనా ప్రయాణాలు చేస్తుంటే ముందస్తుగా మందులను నిల్వ చేసుకోవాలి. కొన్నిసార్లు మీరు సందర్శించబోయే ప్రదేశంలో మందులు తక్షణమే అందుబాటులో ఉండకపోవచ్చు. అకస్మాత్తుగా కార్డియాక్ ప్రక్రియకు గురైతే సరైన సమయంలో మందులు అందించలేకుంటే ప్రాణానికే ప్రమాదంగా మారుతుంది. కాబట్టి చికిత్స చేసే వైద్యుడు సిఫార్సు చేసిన మందులను వెంట ఉంచుకోవటం మంచిది.
2. ఎవరైనా ఏదైనా అడ్వెంచర్ స్పోర్ట్స్ ప్లాన్ చేస్తుంటే లేదా పర్వతాలను అధిరోహించడం ఎక్కువ ఎత్తులోకి ఎక్కుతుంటే మాత్రం ముందస్తుగా వైద్యుల సూచనలు, సలహాలు తీసుకోవటం మంచిది.
READ ALSO : Walnuts : వాల్‌నట్స్ డయాబెటిక్ పేషెంట్లు కూడా తినొచ్చు! గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయ్?
3. ఒకే చోట కూలబడి కూర్చోకుండా శారీరకంగా చురుకుగా ఉండాలి. సుదీర్ఘ ప్రయాణాల్లో అప్పుడప్పుడు అటు, ఇటు కదులుతూ ఉండాలి. ప్రయాణంలో నడక, స్పాట్ యోగా వంటి తేలికపాటి వ్యాయామాలు చేయడానికి ప్రయత్నించండి.
4. హృద్రోగులు తమ ఆహారం పట్ల శ్రద్ధ వహించడం అవసరం. అయిల్ ఫుడ్స్, ప్రాసెస్ చేసిన ఆహారాలకు బదులుగా తాజా పండ్లు , కూరగాయలతో కూడిన ఆహారాన్ని తీసుకోవటం మంచిది.
5. ప్రయాణానికి ముందుగా కార్డియాక్ పరీక్షలు, ఈసీజీ, ఎకోకార్డియోగ్రఫీ,ఒత్తిడి పరీక్షల వైద్యుల సలహా మేరకు చేయించుకోవాలి. పరీక్షల ఫలితాలను వైద్యులు విశ్లేషించి ప్రయాణం చేసినా ఎలాంటి ఇబ్బందులు ఉండవని నిర్ధారించుకున్న తరువాతనే ప్రయాణించటం మంచిది.
READ ALSO : అతి నిద్ర కారణంగా గుండె జబ్బుల ప్రమాదం?
6. సౌకర్యవంతమైన పాదరక్షలను ధరించండి, హైడ్రేటెడ్‌గా ఉండటానికి తగినంత నీరు తీసుకుంటూ ఉండాలి. అవసరమైతే కాళ్ళకు మేజోళ్ళు ధరించండి, కాళ్ళలో రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని తగ్గించేందుకు ఎక్కువసమయం కూర్చోకుండా కొద్ది నిమిషాలు నడవండి.
7. ఛాతీ నొప్పి, శ్వాస సమస్యలు, అనవసరమైన అలసట వంటి లక్షణాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. అవసరమైతే వెంటనే స్థానిక వైద్యుడిని సంప్రదించండి.