Walnuts : వాల్‌నట్స్ డయాబెటిక్ పేషెంట్లు కూడా తినొచ్చు! గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయ్?

వాల్ నట్స్‌లో మెలటోనిన్ అనే కాంపౌడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది మనం గాఢంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. వాల్ నట్స్ ను పచ్చిగా తినడానికి బదులు నానబెట్టి తింటే, దాని ప్రయోజనాలు చాలా రెట్లు పెరుగుతాయి.

Walnuts : వాల్‌నట్స్ డయాబెటిక్ పేషెంట్లు కూడా తినొచ్చు! గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయ్?

Walnuts in wooden bowl. Whole walnut on wood table with green leaves

Walnuts : డ్రై ప్రూట్స్ మన ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని ప్రతిరోజు తీసుకోవటం వల్ల చాలా రకాల ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా వాల్ నట్స్ ప్రతిరోజు వీటిని మన డైట్లో చేర్చుకోవడం వలన శరీరం ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటమే కాకుండా ఆయుష్షు కూడా పెరుగుతుంది. ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్, డయాబెటీస్ వంటి వ్యాధులను తగ్గిస్తాయి. శరీరంలో మెటబాలిక్ రేటును క్రమంగా పెంచుతాయి.

వీటిలో విటమిన్ ఇ మరియు ప్లెవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది జ్ఞాపకశక్తి లోపానికి గురి చేసే హానికరమైన ఫ్రీరాడికల్స్ మరియు కెమికల్స్‌ను నాశనం చేస్తుంది. ఇది మెదడుకు బాగా ఉపకరిస్తుంది. అందుకే దీనిని బ్రెయిన్ ఫుడ్ అని అంటారు. వాల్‌నట్స్ డయాబెటిక్ పేషెంట్లకు కూడా మంచివే. వాల్‌నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు, ప్రొటీన్‌లు, ఫైబర్‌ల ముఖ్యమైన స్థాయిలు మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

మంచి నిద్రను ప్రోత్సహించడానికి, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి అద్భుతంగా తోడ్పడతాయి. వారానికినాలుగు సార్లు కంటే ఎక్కువగా గింజలు తినేవారికి కొరోనరీ హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశం 37 శాతం తక్కువని అధ్యయనాల్లో తేలింది. డిప్రెషన్, అల్జీమర్స్ వ్యాధి చికిత్సలో కూడా సహాయపడుతుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ధమనుల ద్వారా రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. రొమ్ము, ప్రోస్టేట్, కొలొరెక్టల్ క్యాన్సర్‌తో సహా కొన్ని క్యాన్సర్‌ల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది.

శరీరంలో ప్రొజెస్టెరాన్ స్థాయిలను మెరుగుపరచి, గర్భాశయానికి రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మహిళల సంతానోత్పత్తికి ఉత్తమమైన సూపర్‌ఫుడ్‌లలో ఒకటి. దీనిలో అధిక స్థాయిలో ఫైబర్, ఒమెగ్ ఎ-3 ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నీషియంలు లభిస్తాయి. మగవారిలో స్పెర్మ్ ఉత్పత్తికి సహాయపడతాయి. నానబెట్టిన వాల్ నట్స్‌ను ప్రతిరోజు 5 చొప్పున తీసుకోవటం వలన కీళ్లనొప్పులు, వాపులు తగ్గిపోతాయి.

వాల్ నట్స్‌లో మెలటోనిన్ అనే కాంపౌడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది మనం గాఢంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. వాల్ నట్స్ ను పచ్చిగా తినడానికి బదులు నానబెట్టి తింటే, దాని ప్రయోజనాలు చాలా రెట్లు పెరుగుతాయి. ఇందుకోసం రాత్రి 2 వాల్ నట్స్ ను నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలి. అధిక రక్తపోటు సమస్య ఉన్నవారికి వాల్‌నట్ ఉపయోగకరంగా ఉంటుందని చాలా అధ్యయనాలలో రుజువైంది.