నా భర్తకు చదువు పిచ్చి : నన్ను పట్టించుకోవడం లేదు.. విడాకులు కావాలి!

  • Published By: sreehari ,Published On : August 31, 2019 / 11:11 AM IST
నా భర్తకు చదువు పిచ్చి : నన్ను పట్టించుకోవడం లేదు.. విడాకులు కావాలి!

Updated On : August 31, 2019 / 11:11 AM IST

అందరి పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయించబడతాయి అంటారు. కానీ, ఆ బంధాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం భూమి మీద జీవించే మనపైనే ఉంటుందని మరిచిపోతున్నారు. భర్త తిట్టాడని ఒకరు.. భర్త పట్టించుకోలేదని కొందరు.. చిన్న చిన్న విషయాలకే బంధాలను తెంచేసుకుంటున్నారు. మధ్యప్రదేశ్‌లో ఓ మహిళ తన భర్త పట్టించుకోవడం లేదని అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. పైగా తనకు భర్త నుంచి విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించింది.

ఇంతకీ భర్త చేసిన తప్పు ఏంటో తెలుసా? పోటీ పరీక్షల పుణ్యామాని అతడు 24 గంటలు చదవడమే. అదేంటీ.. భర్త పోటీ పరీక్షలకు ప్రీపేర్ కావడం కూడా తప్పేనా? అంటే.. అతడి భార్య విషయంలో తప్పే మరి. ఎందుకుంటే.. కొత్తగా పెళ్లి అయింది. భర్తతో కలిసి సరదాగా గడపాలని భార్యకు ఉండదా మరి. ఏ ముద్దు ముచ్చటా లేకుండా పుస్తకాల పురుగులా ఒకేటే పుస్తకాలకు హత్తుకుపోతే ఎలా? అని ఆమె బాధ.

ఆ బాధలో నుంచి భర్తపై విరక్తి పుట్టింది. అంతే.. అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. తన భర్త తనను పట్టించుకోవడం లేదని విడాకులు ఇప్పించాలని కోర్టును ఆశ్రయించింది. భార్య కాపురానికి రావడం లేదని భర్త ఫ్యామిలీ కోర్టులో విడాకులు కోరుతూ పిటిషన్ వేశాడు. వీరిద్దరి పిటిషన్లను స్వీకరించిన కోర్టు భార్యభర్తలిద్దరికి కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆదేశించినట్టు జిల్లా లీగల్ సర్వీసు అథారిటీ కౌన్సిలర్ నూర్నిషా తెలిపారు. ‘బాధితురాలి భర్త పీహెచ్ డీ చేశాడు.

కుటుంబంలో అతడు ఒక్కడే కొడుకు. తన తల్లిదండ్రుల్లో ఒకరికి అనారోగ్యంగా ఉండటంతో బలవంతంగా పెళ్లి చేశారు’ అని కౌన్సిలర్ తెలిపారు. దంపతులకు కౌన్సిలింగ్ ఇప్పించి ఇద్దరికి కలిపేందుకు బంధువులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ కేసుపై కోర్టులో విచారణకు రాకముందే మరో నాలుగు సెషన్ల వరకు కౌన్సిలింగ్ ఇప్పించి ఇద్దరిని ఒకటి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు కౌన్సిలర్ తెలిపారు.