World Diabetes Day 2021 : ప్రతి షుగర్ పేషెంట్ తప్పక తినాల్సిన 5 పండ్లు ఇవే..!

ఆహారపు అలవాట్ల కారణంగా అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తోంది. వయస్సుతో సంబంధం లేకుండా చిన్నవయస్సులోనే డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.

World Diabetes Day 2021 : ప్రస్తుత 21వ శతాబ్దంలో జీవినశైలి ఆరోగ్యానికి పెద్ద సవాలుగా మారింది. ఆహారపు అలవాట్ల కారణంగా అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తోంది. వయస్సుతో సంబంధం లేకుండా చిన్నవయస్సులోనే డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. 30ఏళ్ల వయస్సు నుంచి షుగర్, బీపీల బారినపడేవారి సంఖ్య పెరిగిపోతోంది. జీవితంలో ఒకసారి షుగర్ ఎంటర్ అయిందంటే.. జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ వ్యాధితో ఇబ్బందులు పడిపోతున్నవారి సంఖ్య పెరిగిపోతోంది. అందుకే ప్రతి ఏడాది నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ డయాబెటిక్ డే (World Diabetes Day) జరుపుకుంటారు. డయాబెటిస్ అనేది.. ఒక దీర్ఘకాలిక వ్యాధిగా అందరికి తెలిసిందే.

శరీరంలోని రక్తంలో షుగర్ లెవల్స్ అదుపులో ఉండవు. అప్పుడు క్లోమ గ్రంథి ఇన్సూలిన్ ఉత్పత్తి చేయలేదు. రక్తానికి తగినంత ఇన్సూలిన్ ఉత్పత్తి కానప్పుడు షుగర్ లెవల్స్ పెరిగిపోతాయి. రక్తకణాలు సరిగా స్పందించవు. అందుకే షుగర్ లెవల్స్ ఎప్పటికప్పుడూ చెక్ చేసుకోవాలంటారు. అవసరమైన మందులతో పాటు మంచి ఆహారం వంటి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా షుగర్ అదుపులోకి తెచ్చుకోవచ్చు. లైఫ్ స్టయిల్ మార్చుకోవాడం ద్వారా కూడా డయాబెటిస్ సమస్యను అదుపులోకి తెచ్చుకోవచ్చు. మీరు తీసుకునే ఆహారం బట్టే మీ శరీరంలోని రక్తంలో షుగర్ లెవల్స్ స్థాయి అదుపులోకి ఉంచుకోవచ్చు. డయాబెటిస్ వచ్చినవారు షుగర్ లెవల్స్ సహజంగా అదుపులో ఉంచుకోవాలంటే ఈ పండ్లు తప్పక తమ డైట్ లో చేర్చుకోవాలి. అవేంటో ఓసారి చూద్దాం..

1. Green Apples ( గ్రీన్ ఆపిల్) :
గ్రీన్ యాపిల్స్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు సూపర్ ఫుడ్స్ అని చెప్పవచ్చు. ఈ పండులో కరిగే ఫైబర్స్, నియాసిన్, జింక్, ఐరన్, ఇతర మెటల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి రక్తంలో చక్కెరను అదుపులో ఉంచడంలో సహాయపడతాయి. గ్రీన్ యాపిల్స్‌లో చక్కెర శాతం కూడా తక్కువగా ఉంటుంది. ఎర్రటి యాపిల్స్‌లో చక్కెర శాతం ఎక్కువగా ఉన్నందున వాటిని తినకపోవడమే మంచిది.

2. నారింజ (Ogranges) :
సిట్రిక్ పండ్లు (ఆరెంజ్) మధుమేహం (Diabetes)పై అద్భుతాలు పనిచేస్తాయి. నారింజ, ముఖ్యంగా, తక్కువ గ్లైసెమిక్ సూచికలను కలిగి ఉంటుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు అద్భుత ప్రయోజనాలను కలిగిస్తుంది. నారింజలో విటమిన్ (C), ఫ్లేవనాయిడ్ యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి.

3.పియర్ (Pear) :
పియర్ (Pear) పండు.. ఇది నేరేడు రకానికి చెందిన పండు.. ఈ పండు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. అందుకే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తొందరంగా పెరగనివ్వదు. ఇందులో విటమిన్ A, C, E, B1, B2, B3, B9 పుష్కలంగా ఉన్నాయి. పియర్‌లో అధిక స్థాయిలో పొటాషియం, కాల్షియం కూడా జింక్ లభిస్తాయి. పియర్ పీచు పదార్థం కూడా. ఈ పండులోని యాంటీఆక్సిడెంట్లు, కెరోటినాయిడ్లను కలిగి ఉండటం ద్వారా తేలికగా జీర్ణమవుతుంది.

4. నేరేడు పండు (Jamun) :
మధుమేహ (Diabetics) వ్యాధిగ్రస్తులకు జామున్ ఫ్రూట్ అద్భుతం ప్రయోజనాలు పొందవచ్చు. ఇందులో విటమిన్లు, A, C, గ్రూప్ B, D అధికంగా ఉంటాయి. అధిక రక్తంలో చక్కెర స్థాయిల ప్రమాదాన్ని తగ్గించడంలో అద్భుతంగా సాయపడుతుంది.

5. జామ (Guava) :
జామ పండు.. ఇందులో సోడియం కంటెంట్ తక్కువగా ఉంటుంది. అలాగే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్‌ కలిగి ఉంటుంది. పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తుల ఆరోగ్యానికి ఈ జామపండు అద్భుతంగా పనిచేస్తుంది. జామపండులో నారింజ కన్నా నాలుగు రెట్లు ఎక్కువ విటమిన్ C సమృద్ధిగా లభిస్తుంది.
Read Also : Germany Pandemic: జర్మనీలో చెలరేగిపోతున్న కరోనా.. రోజుకు 50వేలకు మించి నమోదవుతున్న కేసులు

ట్రెండింగ్ వార్తలు