Germany Pandemic: జర్మనీలో చెలరేగిపోతున్న కరోనా.. రోజుకు 50వేలకు మించి నమోదవుతున్న కేసులు

జర్మనీలో కొవిడ్ విజృంభణ ఆందోళనకర పరిస్థితులు సృష్టిస్తుంది. బాధితులు భారీ సంఖ్యలో పెరిగిపోవడంతో ఆస్పత్రులు ఫుల్ అయిపోతున్నాయి.

Germany Pandemic: జర్మనీలో చెలరేగిపోతున్న కరోనా.. రోజుకు 50వేలకు మించి నమోదవుతున్న కేసులు

Corona Virus

Germany Pandemic: జర్మనీలో కొవిడ్ విజృంభణ ఆందోళనకర పరిస్థితులు సృష్టిస్తుంది. బాధితులు భారీ సంఖ్యలో పెరిగిపోవడంతో ఆస్పత్రులు ఫుల్ అయిపోతున్నాయి. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల కారణంగా కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ రేటు గరిష్ఠ స్థాయికి చేరుకుంది. వారం వ్యవధిలో లక్ష మందికిగానూ 277.4గా నమోదైంది. వైరస్ వ్యాప్తి మొదలైన నాటి నుంచి ఇదే అత్యధికం.

జర్మన్‌ ప్రభుత్వ సంస్థ రాబర్ట్ కోచ్ ఇన్‌స్టిట్యూట్ ఈ లెక్కలు బయటపెట్టింది. గత వారం నాటికే ఈ రేటు 201.1గా ఉండగా, అతి తక్కువ సమయంలోనే 277కు చేరుకోవడం స్థానికంగా కొవిడ్‌ తీవ్రతను ప్రతిబింబిస్తుంది. గతేడాది డిసెంబర్‌ 22న 197.6గా నమోదైన తీవ్రత రేటు.. ఈ ఏడాది మరింత పెరిగిపోయింది.

రోజువారీ కేసులు 50 వేలు దాటి పెరిగిపోతున్నాయి. 24 గంటల వ్యవధిలో 235 మంది కొవిడ్ మృతులు ఉన్నట్లు ఆర్‌కేఐ వెల్లడించింది. సాక్సోని, తురింగియా, బవేరియాలో పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు చెబుతుంది.

……………………………………..: ఢిల్లీలో తీవ్రవాయు కాలుష్యం.. కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు..!

ఇన్‌ఫెక్షన్‌ రేటు భారీగా పెరగడంపై జర్మన్ ఛాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ శనివారం ప్రకటన విడుదల చేస్తూ.. టీకాలు తీసుకోని అత్యవసరంగా నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

జర్మనీ జనాబా 83 మిలియన్ల మందిలో 40 శాతం మందికి మాత్రమే 2 డోసులు పూర్తయ్యాయి. ఆరోగ్యశాఖ మంత్రి జెన్స్ స్పాన్ దేశంలో వైరస్‌ కట్టడి విషయమై మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తామని ఇండోర్ సమావేశాలకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. దేశంలో కరోనా పరిస్థితులను నియంత్రించేందుకుగానూ ఫెడరల్ ప్రభుత్వం వచ్చేవారం స్థానిక 16 రాష్ట్రాల ప్రతినిధులతో సమావేశం కానుంది.