Uttam Kumar Reddy : మరోసారి మోడీ వస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది- ఉత్తమ్ కుమార్ రెడ్డి

బీఆర్ఎస్ పార్టీ పని ఇక ముగిసినట్టే. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగు అవుతుంది.

Uttam Kumar Reddy : నల్గొండ జిల్లా హాలియాలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. నల్గొండ ఎంపీగా రఘువీర్ రెడ్డి ఎన్నిక లాంఛనమే అని మంత్రి ఉత్తమ్ జోస్యం చెప్పారు. దేశంలోనే అత్యధిక మెజార్టీతో రఘువీర్ రెడ్డి గెలుపు ఖాయం అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. నల్గొండ పార్లమెంట్ స్థానంలో బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు కానున్నాయని వ్యాఖ్యానించారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ పై నిప్పులు చెరిగారు ఉత్తమ్. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ఇంతటి ప్రమాదాన్ని ఎన్నడూ ఎదుర్కోలేదన్నారు. దేశంలో అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించింది మోడీ సర్కార్ అని విరుచుకుపడ్డారు. మరోసారి మోడీ అధికారంలోకి వస్తే ఇక దేశంలో ప్రజాస్వామ్యం ఉండదని హెచ్చరించారు మంత్రి ఉత్తమ్. ఇక, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పని ముగిసినట్టే అని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలవడం, రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

”మోడీ చెప్పిన ఏ హామీలు అమలు కాలేదు. తెలంగాణకు అన్ని విషయాల్లో అన్యాయం జరిగింది. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు రాలేదు. తెలంగాణలో ఓటు అడిగే హక్కు బీజేపీకి లేదు. బీఆర్ఎస్ పార్టీ పని ఇక ముగిసినట్టే. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగు అవుతుంది. పార్లమెంట్ ఎన్నికలు ముగియగానే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తాం. నెల్లికల్ లిఫ్ట్ పనులకు 200 కోట్ల నిధులు మంజూరు చేసి మొదటి ఫేస్ పూర్తి చేస్తాం. పెండింగ్ లో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలన్నీ పూర్తి చేస్తాం” అని హామీ ఇచ్చారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.

Also Read : మూడు పార్టీల మధ్య టఫ్ ఫైట్.. ఈసారి సికింద్రాబాద్ బాద్‌షా ఎవరు?

ట్రెండింగ్ వార్తలు