104 ఫీవర్‌లో.. చిరు స్టెప్పేస్తే.. ఆడియన్స్ విజిల్స్ వేశారు మరి!

‘జ‌గ‌దేక‌వీరుడు అతిలోక‌సుంద‌రి’లోని ‘ధిన‌క్కు తా’ పాట వెనుక ఎంత కష్టందాగుందో తెలుసా?..

  • Publish Date - May 8, 2020 / 12:41 PM IST

‘జ‌గ‌దేక‌వీరుడు అతిలోక‌సుంద‌రి’లోని ‘ధిన‌క్కు తా’ పాట వెనుక ఎంత కష్టందాగుందో తెలుసా?..

‘జ‌గ‌దేక‌వీరుడు అతిలోక‌సుంద‌రి’.. ఈ సెల్యులాయిడ్ వండ‌ర్ వెనుక ఎంతోమంది ఛాంపియ‌న్స్‌.. మెగాస్టార్ చిరంజీవి, అతిలోక సుందరి శ్రీదేవి హీరోహీరోయిన్లుగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా విడుదలై 30 ఏళ్లు(మే 9) పూర్తవుతున్న సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అప్పటి సంగతులను ప్రేక్షకులతో పంచుకుంటోంది.  తాజాగా ‘ధిన‌క్కు తా’.. సాంగ్ వెనుక జరిగిన విశేషాలను వెల్లడించారు. ఈ పాట‌కు వాహినీ స్టూడియోలోనే భారీ సెట్ వేశారు. షూటింగ్ అయిపోగానే శ్రీ‌దేవి హిందీ సినిమా షూటింగ్‌కు ఫారిన్ వెళ్లిపోవాలి. స‌రిగ్గా అదే టైమ్‌కు చిరంజీవికి  104 డిగ్రీల హై ఫీవ‌ర్‌! ఒళ్లు కాలిపోతోంది.

ఓ ప‌క్క‌న రిలీజ్ డేట్ మే 9! ఒక్క రోజు తేడా వ‌చ్చినా మొత్తం తేడా వ‌చ్చేస్తుంది. అప్పుడు చిరంజీవి హై ఫీవ‌ర్‌తోనే షూటింగ్‌కు రెడీ అయ్యారు. సెట్‌లోనే డాక్ట‌ర్‌.. చిరంజీవి, శ్రీ‌దేవితో డ్యాన్స్‌.. అస‌లెక్క‌డా చిన్న తేడా కూడా క‌నిపించదు స్క్రీన్ మీద‌! అంత కష్టపడి చేసిన ఈ పాటకు ఏ స్థాయిలో ఆదరణ దక్కిందో తెలిసిందే. అనుకున్న డేట్‌కు అనుకున్న‌ట్లు రిలీజ్ చెయ్య‌గ‌లిగామంటే దానికి చిరు  డెడికేష‌న్ ముఖ్య కార‌ణ‌మ‌ని మ‌న‌సారా మెచ్చుకుంటారు నిర్మాత దత్. అందుకే.. ఒక్క కార‌ణం కాదు, ఎన్నో యాంగిల్స్‌లో ‘జ‌గ‌దేక‌వీరుడు అతిలోక‌సుంద‌రి’ తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే ఒక సెల్యులాయిడ్ వండ‌ర్, ఒక మైల్ స్టోన్‌! ఎవ‌రూ ఎప్ప‌టికీ రిపీట్ చేయ‌లేని హిస్టారిక‌ల్ ల్యాండ్ మార్క్‌. ఈ మే 9వ తేదీకి ఈ చిత్రం విడుద‌లై ముప్పై ఏళ్ల‌వుతోంది.