15 heroes rejected the movie #Single starring Srivishnu
Sree Vishnu: సినిమా ఇండస్ట్రీలో.. ఒక సినిమా విషయంలో చాలా విషయాలు జరుగుతాయి. ఒక హీరోకి అనుకున్న సినిమా ఇంకో సినిమా చేయడం. ఒక హీరో రరిజెక్ట్ చేసిన సినిమా ను మరో హీరో చేసి బ్లాక్ బస్టర్ కొట్టడం.. ఇలా చాలా జరుగుతాయి. అయితే, తాజాగా రిలీజైన ఒక హిట్ సినిమా విషయంలో కూడా అదే జరిగిందట. ఈ సినిమాను ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 మంది హీరోలు రిజెక్ట్ చేశారట. ఫైనల్ గా ఆ కథను టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు(Sree Vishnu) ఒకే చేసి సూపర్ హిట్ కొట్టాడు. ఆ సినిమా మరేదో కాదు సింగిల్. యూత్ ఫుల్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్, కాల్య ఫిల్మ్స్ నిర్మించగా డైరెక్టర్ కార్తీక్ రాజు తెరకెక్కించాడు.
Pawan-Balayya: పవన్ కళ్యాణ్ vs బాలకృష్ణ.. తప్పుకున్నా.. ఫ్యాన్స్ ఒప్పుకోవడం లేదు
ట్రయాంగిల్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాలో శ్రీవిష్ణు సరసన కేతిక శర్మ, ఇవానా హీరోయిన్స్ గా నటించారు. ఈ ఇయర్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి సూపర్ హిట్ టాక్ వచ్చింది. దీంతో, ఈ సినిమా ఏకంగా రూ.25 కోట్లకు పైగా వసూళ్లు సాదించి భారీ లాభాలను తెచ్చిపెట్టింది. అయితే, సింగిల్ సినిమా కథను ఇండస్ట్రీలో ఉన్న దాదాపు 15 మంది హీరోలు రిజెక్ట్ చేశారట. ఈ విషయాని హీరో శ్రీవిష్ణునే చెప్పుకొచ్చాడు. ఈ కథను దర్శకుడు కార్తీక్ రాజు మూడేళ్ళ క్రితమే చెప్పాడు. అంతకుముందు ఇదే కథను 15 ముందుకి చెప్పాడట. కానీ, వాళ్ళు రిజెక్ట్ చేశారు. వాళ్ళు రిజెక్ట్ చేయడం మంచిదే అయ్యింది. వాళ్లందరికి నా థాంక్స్ అంటూ చెప్పుకొచ్చాడు. అలా ఒక సూపర్ హిట్ సినిమాను మిస్ అయ్యారు 15 మంది హీరోలు.
ఇక శ్రీవిష్ణు సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన మృత్యుంజయ, కామ్రేడ్ కళ్యాణ్ అనే రెండు సినిమాలు చేస్తున్నాడు. ఫాంటసీ అండ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో వస్తున్న మృత్యుంజయ మూవీ షూటింగ్ ఇప్పటికే మొదలవగా.. కామ్రేడ్ కళ్యాణ్ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలయ్యింది. సరికొత్త కథలతో వస్తున్న ఈ రెండు సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.