2020 బాలీవుడ్ రీమేక్స్ – మామూలుగా ఉండదు మరి!

2020లో బాలీవుడ్‌లో పెద్ద ఎత్తున రీమేక్ చిత్రాలు తెరకెక్కుతున్నాయి..

  • Published By: sekhar ,Published On : January 30, 2020 / 02:06 PM IST
2020 బాలీవుడ్ రీమేక్స్ – మామూలుగా ఉండదు మరి!

Updated On : January 30, 2020 / 2:06 PM IST

2020లో బాలీవుడ్‌లో పెద్ద ఎత్తున రీమేక్ చిత్రాలు తెరకెక్కుతున్నాయి..

ఒక భాషలో హిట్ అయిన సినిమాని మరో భాషలో డబ్ చేయడం అనేది సర్వసాధారణం.. అది కొంచెం ఈజీ ప్రాసెస్ కూడా.. అదే రీమేక్ అంటే మాత్రం కొంచెం ఆలోచించాలి.. ఎందుకంటే సదరు భాషలో ప్రేక్షకాదరణ పొందిన సినిమాని మరో లాంగ్వేజ్‌లో ఒరిజినల్ వెర్షన్‌లోని సోల్ మిస్ అవకుండా తెరకెక్కించి ఆడియన్స్‌ని మెప్పించడం అనేది చిన్న విషయం కాదు కదా మరి.. ప్రస్తుతం దక్షిణాది పరిశ్రమలో బయెపిక్స్‌తో రీమేక్స్ ట్రెండ్ కూడా నడుస్తోంది. 2020లో బాలీవుడ్‌లో పెద్ద సంఖ్యలో రీమేక్స్ రూపొందనున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం..

‘ఫారెస్ట్ గంప్ – లాల్ సింగ్ చద్దా’
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’.. రాబర్ట్ జిమికిస్ డైరెక్ట్ చేయగా ఆస్కార్ అవార్డ్ అందుకున్న హాలీవుడ్‌ మూవీ‘ఫారెస్ట్‌గంప్‌’ మూవీకిది హిందీ రీమేక్‌.. ‘సీక్రెట్ సూపర్ స్టార్’ ఫేమ్ అద్వైత్ చందన్ డైరెక్ట్ చేస్తుండగా, కరీనా కపూర్ కథానాయికగా నటిస్తోంది. 1994 హాలీవుడ్ క్లాసిక్ ‘ఫారెస్ట్‌గంప్‌’ చిత్రానికి హిందీ నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేసి తెరకెక్కిస్తున్న ‘లాల్ సింగ్ చద్దా’ 2020 క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది.

Laal Singh Chaddha forest gump remake
‘కాంచన – లక్ష్మీబాంబ్’
ఖిలాడి అక్షయ్ కుమార్ నటిస్తున్న కామెడీ హారర్ ఫిలిం.. ‘లక్ష్మీబాంబ్’.. తమిళనాట లారెన్స్ నటిస్తూ, దర్శకత్వం వహించిన సూపర్ హిట్ ‘కాంచన’ రీమేక్ ఇది. ఈ సిరీస్‌లో వచ్చిన చిత్రాలన్నీ తెలుగులో డబ్ చేయగా మంచి ఆదరణ పొందాయి. హిందీలోనూ లారెన్స్ డైరెక్ట్ చేస్తుండడం విశేషం.. కియారా అద్వాణీ కథానాయికగా నటిస్తున్న ’లక్ష్మీబాంబ్’ 2020 మే 22న రిలీజ్ కానుంది.

Laxmmi Bomb remake hindi
నాని ‘జెర్సీ – షాహిద్ కపూర్ జెర్సీ’
నేచురల్ స్టార్ నాని క్రికెటర్‌గా, ప్రేమికుడిగా, భర్తగా, తండ్రిగా డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేసి నటుడిగా మరో మెట్టు ఎక్కిన సినిమా ‘జెర్సీ’.. ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘కబీర్ సింగ్’ తర్వాత షాహిద్ కపూర్ ఈ ‘జెర్సీ’ రీమేక్‌లో నటిస్తున్నాడు. షాహిద్ సరసన మృణాల్ ఠాకూర్ జతకడుతుండగా ఒరిజినల్ వెర్షన్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి హిందీ చిత్రసీమకి పరిచయమవుతున్నాడు. అల్లు అరవింద్, దిల్ రాజు, అమన్ గిల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

shahid kapoor jersey remake bollywood
‘విక్రమ్ వేద – సైఫ్, ఆమిర్ ఖాన్’
తమిళనాట సంచలన విజయం సాధించిన చిత్రం ‘విక్రమ్ వేద’.. ఆర్.మాధవన్ పోలీస్ ఆఫీసర్‌గా, విజయ్ సేతుపతి గ్యాంగ్‌స్టర్‌గా నటించారు. పుష్కర్ – గాయత్రి డైరెక్ట్ చేసిన ఈ సినిమా అదే పేరుతో హిందీలో రీమేక్ కానుంది. మాధవన్ క్యారెక్టర్ సైఫ్, విజయ్ సేతుపతి రోల్ ఆమిర్ ఖాన్ చేయనున్నారు. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

Image result for vikram vedha hindi remake
‘ది ఇంటెర్న్’ కూడా..
రాబర్ట్ డి నిరో, అన్నే హాథవే ప్రధాన పాత్రల్లో నటించిన హాలీవుడ్ మూవీ ‘ది ఇంటెర్న్’ బాలీవుడ్‌లో రీమేక్ అవనుంది. నాన్సీ మేయర్స్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా హిందీ రీమేక్‌లో రిషి కపూర్, దీపికా పదుకొణే నటించనున్నారు.

the intern
‘ది గర్ల్ ఆన్ ది ట్రైన్’
హాలీవుడ్ మూవీ ‘ది గర్ల్ ఆన్ ది ట్రైన్’ హిందీ రీమేక్‌లో పరిణితీ చోప్రా ప్రధాన పాత్రలో నటిస్తోంది. చిత్రీకరణ తుదిదశకు చేరుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.

dil bechara bollywood remake
‘ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’..
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సంజనా సంఘీ జంటగా నటిస్తున్న ఈ సినిమా ఇదే పేరుతో జాన్ గ్రీన్ రాసిన బుక్ ఆధారంగా రూపొందుతుంది.
వీటితో పాటు అనిల్ కపూర్ నటించనున్న హాలీవుడ్ ‘రెడ్’ మూవీ, ‘లవ్ ఆజ్ కల్’ సీక్వెల్, ‘కూలీ నెం.1’ సీక్వెల్ కూడా 2020లో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి.