National Film Awards: నేషనల్ ఫిలిం అవార్డుల్లో ఆహా అనిపించిన తెలుగు సినిమాలు

68వ జాతీయ చలనచిత్ర అవార్డుల జాబితాను కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఈసారి జాతీయ అవార్డుల జాబితాలో తెలుగు సినిమా తన సత్తాను మరోసారి చాటింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు సినిమాలు నేషనల్ ఫిలిం అవార్డుల్లో ప్లేస్ దక్కించుకున్నాయి.

National Film Awards: 68వ జాతీయ చలనచిత్ర అవార్డుల జాబితాను కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. 2020 సంవత్సరంలో రిలీజ్ అయిన సినిమాల్లో నుంచి ప్రేక్షకుల మెప్పు పొందిన ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి అవార్డులను ప్రకటించింది. ఈ క్రమంలో జాతీయ ఉత్తమ చిత్రంగా లేడీ డైరెక్టర్ సుధా కొంగర తెరకెక్కించిన సూరారై పోట్రు(తెలుగులో ఆకాశం నీ హద్దురా) బెస్ట్ మూవీ అవార్డును అందుకుంది. ఇక బెస్ట్ యాక్టర్‌గా సూర్య, అజయ్ దేవ్గన్‌లు అవార్డును షేర్ చేసుకున్నారు. అటు ఉత్తమ నటిగా సూరారై పోట్రు సినిమాలో నటించిన అపర్ణ బాలమురళి ఎంపికయ్యింది.

National Film Awards: 68వ జాతీయ చలనచిత్ర అవార్డుల జాబితా

ఇక ఈసారి జాతీయ అవార్డుల జాబితాలో తెలుగు సినిమా తన సత్తాను మరోసారి చాటింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు సినిమాలు నేషనల్ ఫిలిం అవార్డుల్లో తమ సత్తా చాటి ‘ఆహా’ అనిపించాయి. బెస్ట్ తెలుగు ఫిలింగా నేషనల్ అవార్డు అందుకుంది ‘కలర్ ఫోటో’ మూవీ. సుహాస్, చాందినీ చౌదరీలు హీరోహీరోయిన్లుగా నటించిన ఈ ప్యూర్ లవ్ స్టోరీ మూవీకి నేషనల్ అవార్డు రావడంపై పలువురు టాలీవుడ్ స్టార్స్ చిత్ర యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక డ్యాన్స్ కాన్సెప్ట్ మూవీగా తెరకెక్కిన ‘నాట్యం’ సినిమా నేషనల్ అవార్డుల్లో రెండు అవార్డులను అందుకుంది. బెస్ట్ కొరియోగ్రఫీ, బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ విభాగంలో సంధ్యారాజు, రాంబాబులకు ఈ సినిమా నేషనల్ అవార్డును తెచ్చిపెట్టింది.

Ala Vaikunthapurramuloo : అలా.. రికార్డుల వేట కొనసాగుతోందిలా.. రెండు బిలియన్ల స్ట్రీమింగ్స్ సాధించిన ‘అల..వైకుంఠపురములో..’

కాగా.. 2020లో టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీగా నిలిచిన ‘అల వైకుంఠపురములో’ సినిమా కూడా నేషనల్ అవార్డుల జాబితాలో చోటు సంపాదించుకుంది. థమన్ ఈ సినిమాకు అందించిన మ్యూజిక్ ఏరేంజ్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా పాటలకు నేషనల్ ఫిలిం అవార్డ్స్ జ్యూరీ కూడా ఫిదా అయ్యింది. అందుకే ఈ సినిమాలో కెరీర్ బెస్ట్ మ్యూజిక్ అందించిన థమన్‌కు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా నేషనల్ అవార్డు దక్కింది. ఇలా 2020లో తెలుగు సినిమాలు చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రేక్షకుల ప్రశంసలతో పాటు నేషనల్ అవార్డులను కూడా కైవసం చేసుకోవడం విశేషమని చెప్పాలి.

ట్రెండింగ్ వార్తలు