బత్తాయికి బలుపు తగ్గలేదు.. దానికి లేని దురద మీకెందుకురా..

30 ఇయర్స్ పృథ్వీ తనను విమర్శిస్తున్నవారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు..

  • Publish Date - April 5, 2020 / 04:31 PM IST

30 ఇయర్స్ పృథ్వీ తనను విమర్శిస్తున్నవారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు..

30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అంటూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీ సినిమాలు చేసినన్ని రోజులు బాగానే ఉన్నాడు. చిన్నా చితకా వివాదాలు, విభేదాలు ఉన్నా పెద్దగా బయటకి రాలేదు. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాక మనోడి ప్రవర్తన, బూతు పురాణం చూసి ఆశ్చర్యపోయారంతా.. ఇటీవల వెనకనుండి వచ్చి పట్టుకుందామనుకున్నా అనే ఒకే ఒక్క డైలాగ్‌తో ఓవర్ నైట్ కాంట్రవర్సీ స్టార్ అయిపోయాడు. దెబ్బకి మనోడిని పదవినుంచి తొలగించిన సంగతి తెలిసిందే.

కొద్దిరోజులు అవుట్ ఫోకస్ అయిపోయిన పృథ్వీ తాజాగా మరో కొత్త కాంట్రవర్సీకి తెరలేపాడు. తనను కించపరుస్తూ, కామెడీగా ఆడుకుంటున్న కొందరు ఆకతాయి నెటిజన్లపై విరుచుకుపడ్డాడు. లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇంటికే పరిమితమైన పృథ్వీ తాజాగా టిక్‌టాక్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. రామేశ్వరం పోయినా శనీశ్వరం తప్పలేదన్నట్టు పృథ్వీని అక్కడ కూడా తగులుకున్నారు. దీంతో తనను విమర్శిస్తున్న వారికి వీడియో ద్వారా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.

Read Also : ఆ డైరెక్టర్‌తో కలిసి మందేసి రచ్చ చేశావంటగా.. ఆకతాయి ప్రశ్న.. అదిరిపోయే ఆన్సర్ ఇచ్చిన అనసూయ..

‘నేనేదో వెనక పట్టుకున్నా ముందు పట్టుకున్నానంటున్నారు.. ఆమెకి లేని బాధ మీకెందుకురా.. నేను చక్కగా మాట్లాడుతున్నాను.. ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి.. టిక్‌టాక్ ఫ్యామిలీకి స్వాగతించండి కానీ తప్పుడు మాటలు మాట్లాడకండి’’ అంటూ వార్నింగ్ లాంటి రిక్వెస్ట్ చేశాడు 30 ఇయర్స్ పృథ్వీ. దీంతో ‘చింత చచ్చినా పులుపు చావలేదు.. ఇంత జరిగినా బత్తాయికి బలుపు తగ్గలేదు’ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.