సూసైడ్ చేసుకుందామనుకున్నా- చిరు సేవ్ చేశారు.. గుడి కట్టినా తప్పులేదు..

ఓ ఇంటర్వూలో మెగాస్టార్ చిరంజీవి తనకు అవకాశాలు ఇప్పించారని చెప్పాడు 30 ఇయర్స్ పృథ్వీ..

  • Publish Date - March 9, 2020 / 08:49 AM IST

ఓ ఇంటర్వూలో మెగాస్టార్ చిరంజీవి తనకు అవకాశాలు ఇప్పించారని చెప్పాడు 30 ఇయర్స్ పృథ్వీ..

కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వరసగా సినిమాలు చేస్తూ.. ఒక ఊపు ఊపిన థ‌ర్టీ ఇయ‌ర్స్ పృథ్వీ.. రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాక వివాదాలకు కేంద్రబిందువుగా మారాడు. ఎస్‌వీబీసీ వివాదం కారణంగా ఇటీవల వార్తల్లో నిలిచిన పృథ్వీ.. ఓ ఇంట‌ర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి వల్లే తాను బతికున్నానని, ఆయన తన పాలిట దేవుడని అన్నాడు.

ఇంకా మాట్లాడుతూ.. ‘నేను మ‌హిళా ఉద్యోగితో మాట్లాడిన‌ట్లు వ‌చ్చిన ఫోన్ కాల్ రికార్డింగ్స్ ఫేక్ ..అందులో న‌న్ను మ‌ద్యం తాగిన వాడిగా చిత్రీక‌రించారు. నేను మ‌ద్యం మానేసి ఏడాది కాల‌మైంది, నేనేమీ దేశ ద్రోహం చేయ‌లేద‌ు’ అని అన్నాడు. 

సినిమా ఇండ‌స్ట్రీలో ఉన్న‌వారితో నేను సైద్ధాంతికంగా మాట్లాడాను. దాని వ‌ల్ల నాకు చాలా సినిమాలు పోయాయి. సినిమా రంగంలో ఎవ‌రైనా గొప్ప వ్య‌క్తి ఉన్నారా? అంటే అది మెగాస్టార్ చిరంజీవి గారు. అలాగ‌ని మిగ‌తావారిని నేనేం త‌క్కువ చేసి మాట్లాడ‌లేదు. నేను మాన‌సికంగా ఇబ్బందిప‌డ్డాన‌ని, నాకు వేషాలు ఇచ్చి ఎంక‌రేజ్ చేయాల‌ని చెప్పిన వ్య‌క్తి చిరంజీవిగారు. ఆయ‌న లేక‌పోతే నేను సూసైడ్ కూడా చేసుకునేవాడిని.  ‘వాడు మానసికంగా కృంగిపోయాడు.. వాడికి ఏదో వేషం ఇవ్వండి’ అని నిర్మాతలకు చెప్పి క్యారెక్టర్లు ఇప్పించారు. లేకపోతే నేను ఆత్మహత్య చేసుకునే వాడిని అని చెప్పుకొచ్చాడు పృథ్వీ. 

2019 ఎన్నికల ప్రచారంలో మెగాహీరోలపై విమర్శలు చేసిన పృథ్వీ ఇప్పుడు ఆయన వల్లే బతికున్నానని, చిరు తనపాలిట దేవుడంటూ ఆయనకు గుడికట్టినా తప్పు లేదు అనే విధంగా చిరంజీవిని పొగడడంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

See Also | చిరంజీవితో మాత్రమే.. ఇదే చివరిసారి.. ఇంకెప్పుడు చెయ్యను!