No Time To Die : వామ్మో.. 32 వేల లీటర్ల కూల్ డ్రింక్..!
మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘నో టైమ్ టు డై’ అక్టోబర్ 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది..

No Time To Die
No Time To Die: ప్రపంచం మొత్తం ఎప్పుడెప్పుడు జేమ్స్ బాండ్‌ని చూద్దామా అని వెయిట్ చేస్తుంటే.. బాండ్ మాత్రం ఇదిగో వస్తున్నా, అదిగో వస్తున్నా అంటూ ఊరిస్తూనే.. పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నాడు. అయితే ఇన్నాళ్లకు ‘నేనొస్తున్నానోచ్’ అంటూ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేశారు జేమ్స్ బాండ్.
Annaatthe First Look : ‘అన్నాత్తే’ లుక్ అదిరిందిగా..!
వరల్డ్స్ మోస్ట్ అవెయిటింగ్ మూవీ జేమ్స్ బాండ్.. డేనియల్ క్రేగ్ ‘నో టైమ్ టు డై’ టైటిల్‌తో బాండ్ సిరీస్‌లో 25వ సినిమాగా వస్తున్న ఈ సినిమాని మోట్రో గోల్డెన్ మేయర్, ఇయోన్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో.. దాదాపు 2 వేల కోట్లకు పైగా బడ్జెట్‌తో డైరెక్టర్ జోజీ ఫకునగా ఎలక్ట్రిఫైయింగ్ యాక్షన్ సీన్స్‌తో తెరకెక్కించారు.

జేమ్స్ బాండ్ సినిమా అంటే యాక్షన్ సీక్వెన్స్ ఎలా ఉంటాయో కొత్తగా చెప్పక్కర్లేదు. ఈ మూవీలో ఓ ఫైట్ కోసం ఏకంగా 32 వేల లీటర్ల కూల్ డ్రింక్ వాడారట. దీనికి దాదాపు 50 లక్షలకు పైగా ఖర్చు చేశారట. అక్టోబర్ 8న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా ‘నో టైమ్ టు డై’ రిలీజ్ కానుంది..