త్వరలో మరికొంత మంది చనిపోతారు – సోనూ నిగమ్ సెన్సేషనల్ కామెంట్స్

  • Publish Date - June 20, 2020 / 12:45 AM IST

త్వరలోనే మరికొంత మంది చనిపోతారంటూ..ప్రముఖ బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. బాలీవుడ్ హీరో..సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం..బాలీవుడ్ లో తీవ్ర ప్రకంపనలు రేకేత్తిస్తున్నాయి. ఈ ఘటనపై సినీ నాయకులు పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. అందులో భాగంగా సోనూ నిగమ్ పలు కామెంట్స్ చేశారు. ఈ మేరకు ఆయన ఇన్ స్ట్రాగ్రామ్ లో వీడియోను విడుదల చేశారు.

ఇలాంటి ఆత్మహత్యలు చిత్ర పరిశ్రమలో ఇకపై కూడా జరుగుతాయని, చిత్ర పరిశ్రమలోని మాఫియా కంటే..సంగీత పరిశ్రమలో ఉన్న మాఫియా ఇంకా పెద్దదని వెల్లడించారు. నటుడు సుశాంత్ మరణించాడు…ఓ గాయకుడు, సంగీత దర్శకుడు, సాహిత్య రచయిత ఇలాంటి పనే అంటే..ఆత్మహత్య చేశారనే వార్త వింటారని తెలిపారు. ఇక్కడున్న పరిస్థితి తనకు అర్థమైందని వివరించారు. అందరూ బిజినెస్ చేయాలని అనుకుంటారు..కానీ కొంతమంది మాత్రం బిజినెస్ శాసించాలని అనుకుంటారని వెల్లడించారు.

కొత్తగా కెరీర్ ఆరంభించే వారి పరిస్థితి క్లిష్టంగా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాను మాత్రం చిత్ర పరిశ్రమకు ముందుగానే వచ్చానని, గందరగోళానికి దూరంగా ఉన్నట్లు తెలిపారు. తన సహ గాయకుడు ఆర్జిత్ సింగ్ గురించి ప్రస్తావించారాయన. ఓ హీరో కోసం పాట పాడితే..కానీ అతడి పాటను సినిమా నుంచి తొలగించారని, ఆర్జిత్ కెరిర్ ను దెబ్బ తీశారన్నారు. గతంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన ‘వెల్ కమ్ టు ది న్యూయార్క్’ కోసం ఆర్జిత్ సింగ్  పాడారు. ప్రస్తుతం ఆర్జిత్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

ఫలానా సింగర్ తో పాడించాలని చిత్ర దర్శక, నిర్మాతలు, సంగీత దర్శకుడు అనుకున్నా…సదరు మ్యూజిక్ కంపెనీ..ఈ వ్యక్తి ఆర్టిస్ట్ కాదు..అంటోందన్నారు. కొత్త సింగర్స్, సంగీత దర్శకులు, సాహిత్య రచయితలు కళ్లలో కోపం చూస్తున్నా అంటూ కామెంట్స్ చేశారు. వారు ఘోరంగా ఏడ్వడం చూస్తున్నా..వారు చనిపోతే..మిమ్మల్నే ప్రశ్నిస్తారు అంటూ…మ్యూజిక్ మాఫియాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దయచేసి కొత్త వారికి అవకాశాలు కల్పించాలని సింగర్ సోనూ నిగమ్ తెలిపారు. ప్రస్తుతం ఈయన చేసిన వ్యాఖ్యలు ఎలాంటి పరిణామాలు వ్యక్తమౌతాయో చూడాలి. 

 

Read:  మాధురీ దీక్షిత్ 45 రోజుల సమ్మర్‌ క్యాంప్‌

ట్రెండింగ్ వార్తలు