Chiranjeevi : మెగాస్టార్ నటప్రస్థానానికి 50 ఏళ్ళు.. చిరంజీవి స్పెషల్ పోస్ట్ వైరల్..

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.

50 years of Megastar acting Chiranjeevi special post goes viral

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. సినీ ఇండ‌స్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేక‌పోయినా స్వ‌యం కృషితో పైకి ఎదిగారు. ఆరంభంలో చిన్న చిన్న పాత్ర‌లు, విల‌న్ పాత్ర‌ల‌తో మెప్పించి హీరోగా వెండితెర‌ను ఏలారు. 40 ఏళ్లుగా సినీ ప‌రిశ్ర‌మ‌లో కొన‌సాగుతూ ఒక్కొ మెట్టు ఎదుగుతూ మెగాస్టార్ స్థాయికి చేరుకున్నారు. దేశ వ్యాప్తంగానే కాకుండా విదేశాల్లోనూ ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు. ఆరు పదుల వయసులోనూ అదే జోష్ తో యంగ్ హీరోలతో పోటీ పడుతూ వ‌రుస సినిమాల‌ను చేస్తున్నారు.

Unstoppable : మనవడు దేవాంశ్‌ ప్రశ్నలు.. ఫ‌న్నీగా స‌మాధానాలు ఇచ్చిన చంద్ర‌బాబు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి సోష‌ల్ మీడియాలో స్పెష‌ల్ పోస్ట్‌ను షేర్ చేశారు. ఇక చిరు తన కెరీర్ స్టార్ట్ చేసింది డిగ్రీ రోజుల్లోనే. ఆ సమయంలోనే ఆయ‌న‌ ‘రాజీనామా’ అనే తొలి నాటకం వేశారు. ఈ నాట‌కానికి గానూ ఆయనకి నటుడిగా తొలి గుర్తింపుతో పాటు బెస్ట్ యాక్టర్ గా కూడా అవార్డు దక్కింది. ఇక ఈ విషయాన్నీ గుర్తు చేసుకుంటూ తన 50 ఏళ్ల నటప్రస్థానానికి గుర్తుగా అప్పుడు దిగిన ఫోటోను ఫాన్స్ తో షేర్ చేసుకున్నారు చిరు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైర‌ల్‌గా మారింది.


ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం విశ్వంభర సినిమా చేస్తున్నారు. అయితే ముందుగా ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని అన్నారు. కానీ వీఎఫ్ఎక్స్ కారణంగా పోస్ట్ పోన్ చేసినట్టు తెలుస్తుంది.