వైన్ షాపులు, పాన్ షాపులు తెరుస్తారా?.. మందేసి 29 ఏళ్లయింది.. బాలీవుడ్ ప్రముఖులు గరం గరం..

కేంద్ర ప్రభుత్వం మద్యం మరియు పాన్ షాపులు తెరుచుకోవచ్చు అంటూ ఇచ్చిన ఆదేేశాలపై బాలీవుడ్ ప్రముఖుల స్పందన..

  • Publish Date - May 2, 2020 / 11:52 AM IST

కేంద్ర ప్రభుత్వం మద్యం మరియు పాన్ షాపులు తెరుచుకోవచ్చు అంటూ ఇచ్చిన ఆదేేశాలపై బాలీవుడ్ ప్రముఖుల స్పందన..

లాక్ డౌన్ కారణంగా ఇన్ని రోజులు పలు ఆంక్షలు విధించిన కేంద్ర ప్రభుత్వం గ్రీన్ జోన్లలో కొన్ని నిబంధనలను పాటిస్తూ మద్యం మరియు పాన్ షాపులు తెరుచుకోవచ్చని ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై ప్రముఖ బాలీవుడ్ రచయిత జావేద్ అక్తర్, నటి రవీనా టాండన్ అసహనం వ్యక్తం చేశారు.‘‘అద్భుతం.. పాన్, గుట్కా షాపుల తెరుచుకుంటున్నాయి. ఇక ఉమ్మివేయడం కూడా మళ్లీ ప్రారంభమవుతుంది..’’ అంటూ రవీనా వ్యంగ్యంగా పోస్ట్ చేశారు.

 

ఇక జావేద్ అక్తర్ స్పందిస్తూ.. ‘లాక్ డౌన్ సమయంలో మద్యం దుకాణాలను తెరవడం తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. అన్ని సర్వేల ప్రకారం ఈ లాక్‌డౌన్ కాలంలో గృహ హింస కేసులు చాలా వరకు పెరిగాయి. చిన్న చిన్న విషయాలకే ఆడాళ్లపై చేయి చేసుకుంటున్నారు మగాళ్లు. అలాంటిది ఈ టైములో మద్యం అమ్మకాలకు అనుమతిస్తే రెచ్చిపోతారు. అంతేకాదు అది మహిళలు, పిల్లలకు మరింత ప్రమాదకరంగా మారుతుంది..’’ అని ట్వీట్‌ చేశారు. అయితే జావేద్‌ మద్యం సేవించడం మానేసినట్లున్నారని ఓ నెటిజన్‌ అడగ్గా.. ‘1991 జూలై 30, నేను మద్యం స్వీకరించిన చివరి రోజు’ అని జావేద్‌ చెప్పారు.