Balakrishna : తమన్ మీదకు నెట్టేసిన బాలయ్య.. అందుకే ఆగారంట..

బాలకృష్ణ సినిమాలకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చే సంగీత దర్శకుడు తమన్ గురించి బాలయ్య ఆసక్తికర కామెంట్స్ చేసారు. (Balakrishna)

Balakrishna : తమన్ మీదకు నెట్టేసిన బాలయ్య.. అందుకే ఆగారంట..

Balakrishna

Updated On : September 5, 2025 / 4:36 PM IST

Balakrishna : బాలకృష్ణ త్వరలో అఖండ 2 సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. అఖండలో అఘోరాగా కనిపించి ప్రేక్షకులను మెప్పించి 100 కోట్లు కొట్టి భారీ విజయం సాధించారు బాలయ్య. దానికి సీక్వెల్ కావడం, ఇటీవల రిలీజ్ చేసిన గ్లింప్స్ అదిరిపోవడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలయ్య పల్స్ తెలిసిన దర్శకుడు బోయపాటి దర్శకత్వంలో అఖండ 2 గ్రాండ్ గా తెరకెక్కుతుంది.(Balakrishna)

అయితే అఖండ 2 సినిమా మొన్న సమ్మర్ కే రావాల్సింది. కానీ షూటింగ్ కాకపోవడంతో వాయిదా పడింది. సెప్టెంబర్ 25 దసరా టైంకి వస్తుందని ప్రకటించారు కానీ ఇటీవల మళ్ళీ వాయిదా పడిందని అధికారికంగానే ప్రకటించారు. ఆ డేట్ కి OG సినిమా వస్తుంది. ప్రస్తుతం అఖండ 2 సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.

Also See : Sravanthi Chokarapu : అస్సాం కామాఖ్య దేవి ఆలయంలో యాంకర్ స్రవంతి.. ఫొటోలు..

బాలయ్య తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొనగా అక్కడ మీడియా అఖండ 2 గురించి అడగడంతో.. అఖండ 2 సినిమా డిసెంబర్ మొదటి వారంలో రాబోతుంది. మొదటి భాగానికి సగం ఊఫర్స్ పేలిపోయాయి. ఇక రెండో భాగం ఎలా ఉంటుందో చూసుకోండి. ఈ సినిమాకు తమన్ కి ఇచ్చిన టైం సరిపొవట్లేదంట. అందుకే సినిమా లేట్ అవుతుంది. అఖండ సినిమాకు 50 రేట్లు ఎక్కువగా ఉంటుంది అఖండ 2 అని తెలిపారు. దీంతో బాలయ్య తమన్ వల్లే సినిమా లేట్ అవుతుందని, రిలీజ్ వాయిదా పడుతుందని డైరెక్ట్ గానే చెప్పేసారు.

థమన్ ప్రస్తుతం అన్ని భారీ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు సెప్టెంబర్ 25 OG రిలీజ్ చేయాలి కాబట్టి ఆ సినిమాకు డ్యూటీ చేస్తున్నాడు. ఇప్పటికే OG నుచి వచ్చిన సాంగ్స్ అదిరిపోయాయి. ఆ సినిమా రిలీజ్ తర్వాత తమన్ అఖండ 2 వర్క్ మొదలుపెడతాడని సమాచారం. ప్రభాస్ రాజాసాబ్ సినిమా డిసెంబర్ 5 నుంచి సంక్రాంతికి వాయిదా పడటంతో అఖండ 2 డిసెంబర్ 5న రిలీజ్ అవుతుందని సమాచారం.

Also See : Onam Celebrations : అలనాటి హీరోయిన్స్ ఒకే చోట సందడి.. ఓనం పండగ సెలబ్రేషన్స్..