Site icon 10TV Telugu

71st National Film Awards 2025: నేషనల్ ఫిల్మ్ అవార్డుల్లో దుమ్మురేపిన టాలీవుడ్.. ఏకంగా ఏడు అవార్డులు.. ఫుల్‌ లిస్ట్..

నేషనల్ ఫిల్మ్ అవార్డుల్లో టాలీవుడ్ దుమ్మురేపింది. ఏకంగా ఏడు అవార్డులు వచ్చాయి. భగవంత్‌ కేసరి, హనుమాన్, బలగం, బేబీ, గాంధీ తాత చెట్టు సినిమాలకు మొత్తం కలిపి ఏడు అవార్డులు దక్కాయి.

ఏయే అవార్డులు?

ఏ సినిమాలో ఏం చూపించారు?

భగవంత్‌ కేసరి
నందమూరి బాలకృష్ణ పవర్‌ఫుల్ రోల్‌తో కనపడ్డారు. మహిళల సామర్థ్యాన్ని ప్రోత్సహించేలా తీసిన యాక్షన్ డ్రామా ఇది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

హనుమాన్
హనుమంతుడి ద్వారా శక్తి లభించి, హీరో సాహసాలు చేసే సినిమా ఇది. సూపర్ హీరో కోణంలో చూపించిన విజువల్ వండర్ “హనుమాన్”. ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా తెలుగు సూపర్ హీరో జానర్‌లో ఓ మార్గాన్ని చూపినట్లు చెప్పుకోవచ్చు.

బలగం
పల్లె నేపథ్యంలో కుటుంబ బంధాలను, మానవ సంబంధాలను చూపిన భావోద్వేగ కథ. వేణు డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలను తాకింది.

బేబీ
ప్రేమ, స్వార్థం, లవ్‌ ఫెయిల్యూర్‌ను చూపే సినిమా ఇది. ఈ ఎమోషనల్ డ్రామాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి నటన సినిమాకు బలంగా నిలిచింది.

గాంధీ తాత చెట్టు
ప్రకృతి పరిరక్షణ, పిల్లల ఆలోచనల ద్వారా సామాజిక సందేశాన్ని అందించిన సినిమా ఇది.

Exit mobile version